ధురంధర్‌ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్‌ | Aditya Dhar Gets Emotional over Rajinikanth Review on Dhurandhar 2 Movie | Sakshi
Sakshi News home page

Aditya Dhar: ధురంధర్‌ 2పై రజనీ ప్రశంసలు.. గర్వంగా ఉందన్న డైరెక్టర్‌

Mar 24 2026 10:13 AM | Updated on Mar 24 2026 10:24 AM

Aditya Dhar Gets Emotional over Rajinikanth Review on Dhurandhar 2 Movie

గత ఆరునెలలుగా బాక్సాఫీస్‌ వద్ద ధురంధర్‌ పేరు మారుమోగిపోతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్‌ దానికి సీక్వెల్‌ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్‌: ది రివేంజ్‌ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్‌ నుంచి సౌత్‌ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తలైవా రివ్యూ
తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ధురంధర్‌ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్‌ను బాక్సాఫీస్‌ కా బాప్‌ అని అభివర్ణించాడు. రణ్‌వీర్‌ సహా చిత్రయూనిట్‌ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్‌ (ట్విటర్‌)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 

గర్వంగా ఉంది
సర్‌, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్‌ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్‌, స్వాగ్‌తో మ్యాజిక్‌ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్‌ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్‌స్టార్‌ మూమెంట్‌గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్‌. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్‌ రాసుకొచ్చాడు.

 

 

చదవండి: బ్యాండ్‌మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్‌.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement