ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్‌గా ధురంధర్ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.
అదేరోజు టాక్సిక్ రిలీజ్
ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్ టాక్సిక్ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
డైరెక్టర్ క్లారిటీ
ధురంధర్ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) డైరెక్టర్, ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్‌కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్‌కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.


