49 శాతానికి ఎఫ్‌డీఐ పరిమితి పెంపు యోచనలో ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంకులలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని పెంచే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత 20 శాతం పరిమితిని 49 శాతానికి పెంచాలని చూస్తున్నట్లు ఆర్థిక సరీ్వసుల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనస్థాయిని బలపరిచేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు అంతర్‌మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకు(పీఎస్‌బీ)లలో ఎఫ్‌డీఐ పరిమితి 20 శాతంకాగా.. ప్రయివేట్ రంగ బ్యాంకులకు 74 శాతంగా అమలవుతోంది. అయితే 49 శాతంవరకూ ఆటోమేటిక్ మార్గంలో అను మతిస్తారు. ఆపై 74 శాతంవరకూ ప్రభుత్వ అనుమతిని పొందవలసి ఉంటుంది. నిజానికి 2020 నుంచి 12 పీఎస్‌బీలలో ప్రభు త్వం వద్దగల షేర్ల సంఖ్యలో మార్పులేనప్పటికీ కొన్ని బ్యాంకులలో వాటా శాతాలు మార్పులకు లోనయ్యాయి. ఆయా బ్యాంకులు మూలధన సమీకరణకు కొత్తగా షేర్లను జారీ చేయడం ప్రభావం చూపింది. కాగా.. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించి ఈ నెల లో లేదా వచ్చే నెలలో ఫైనాన్షియల్ బిడ్స్ ను ఆహ్వానించనున్నట్లు నాగరాజు తెలియజేశారు.


