
షెంజెన్ వీసా (schengen visa) దరఖాస్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయులకు యూరప్ ప్రయాణాల ఖర్చు పెరిగింది. చాలా యూరోపియన్ దేశాలకు వీసా సమర్పణలను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ తన సర్వీస్ ఛార్జీలను పెంచడంతో ధరలు పెరిగాయి.
2023 తర్వాత ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెద్దలకు బేస్ షెంజెన్ వీసా ఫీజు దాదాపు రూ. 8,000 - రూ. 10,000 వరకు ఉన్నప్పటికీ.. VFS అదనపు సర్వీస్ ఫీజును వసూలు చేస్తుంది. దీనివల్ల వల్ల మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఈ కొత్త సర్వీస్ ఫీజు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జర్మనీ ఇప్పుడు రూ.1933, స్విట్జర్లాండ్ రూ.2690, పోర్చుగల్ రూ.3111, ఫ్రాన్స్ రూ.2234, ఆస్ట్రియా రూ.2274 వసూలు చేస్తున్నాయి.
కొరియర్ డెలివరీ, ఎస్ఎమ్ఎస్ అప్‌డేట్‌లు, ప్రీమియం లాంజ్ యాక్సెస్ వంటి సేవలకు అదనంగా చెల్లించడాన్ని కూడా దరఖాస్తుదారులు ఎంచుకోవచ్చు. దేశాన్ని బట్టి ఈ ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్ స్విట్జర్లాండ్‌కు ఈ పెరుగుదలను ధృవీకరించింది. కానీ ఇతర దేశాలకు ఫీజులు మారాయా?, లేదా?.. అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
షెంజెన్ వీసా కలిగిన ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించడానికి అనుమతిస్తుంది. దీనికోసం దరఖాస్తుదారులు ట్రావెల్ ప్లాన్, ఇన్సూరెన్స్ వంటి వాటితోపాటు ఫైనాన్సియల్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..
కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా యూరప్ పర్యటనల ఖర్చు పెరగడానికి మరోకారణం అని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంలో రూపాయి బాగా బలహీనపడింది. 2015లో ఒక యూరో ధర రూ.72.12గా ఉంది. 2020లో ఇది రూ.84.64కి పెరిగింది. 2023 నాటికి రూ.89.20కు చేరింది. 2024లో దీని విలువ రూ. 90.55గా ఉంది. కాగా జూన్ 2025లో యూరో విలువ మొదటిదారిగా రూ. 100 దాటిపోయింది. ఇది భారతీయ సందర్శకులకు యూరోపియన్ ప్రయాణ ఖర్చును మరింత పెంచింది.