
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్‌పోర్ట్‌లలో నాన్‌బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.
ఎక్స్ లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్‌కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
కెనడా 2019లో పాస్‌పోర్ట్‌లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్‌పోర్ట్‌లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది.