
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ.. కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే 'మాక్రోహార్డ్' (Macrohard) పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎక్స్ఏఐ(xAI)లో చేరి.. మాక్రోహార్డ్ అనే పూర్తిగా ఏఐ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్ట్ వాస్తవమైనది. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్‌వేర్‌ను తయారు చేయలేదు. కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుంది'' అని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆగస్టు 1న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో 'మాక్రోహార్డ్' పేటెంట్ కోసం మస్క్ xAI దాఖలు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ద్వారానే పనిచేస్తుంది. ఇందులో కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీడియో గేమ్‌లను రూపొందించడం, కోడింగ్, రన్నింగ్, గేమ్స్ కోసం డౌన్‌లోడ్ చేయగల కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మొదలైనవి ఉన్నాయి.
గత నెలలో Xలో ఒక పోస్ట్‌లో.. ''xAI లేటెస్ట్ AI సాఫ్ట్‌వేర్ కంపెనీ, వందలాది ప్రత్యేక కోడింగ్ మరియు ఇమేజ్ / వీడియో జనరేషన్ /అండర్‌స్టాండింగ్ ఏజెంట్లు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఫలితం అద్భుతంగా వచ్చే వరకు వర్చువల్ మెషీన్లలో సాఫ్ట్‌వేర్‌తో పరస్పర చర్య చేసే మానవులను అనుకరిస్తాయి" అని మస్క్ అన్నారు
ఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్
గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్‌ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్‌జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్‌ఏఐ మైక్రోసాఫ్ట్‌ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్ తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Join @xAI and help build a purely AI software company called Macrohard. It’s a tongue-in-cheek name, but the project is very real!
In principle, given that software companies like Microsoft do not themselves manufacture any physical hardware, it should be possible to simulate…— Elon Musk (@elonmusk) August 22, 2025