
2024లో భారతీయులకు రూ.136 కోట్లు నష్టం
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాల్లో 3 నుంచి ఆర్నెల్ల పాటు ఉండేందుకు వీలు కల్పించే షెంజెన్ వీసాలు భారతీయులకు నానాటికీ తగ్గుతున్నాయి. 2024లో 1.65 లక్షల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ జాబితాలో అల్జీరియా, టర్కీ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.
దరఖాస్తు రుసుం రూపేణా మనవాళ్లు రూ.136.6 కోట్లు కోల్పోయారు. ఇండియా నుంచి 11.08 లక్షల మంది దరఖాస్తు చేయగా, ఇందులో 5.91 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందాయి. 1.65 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెంజెన్ వీసాతో యూరప్‌లోని 26 దేశాల్లో పర్యటించవచ్చు.