
బరద్వాన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో బిహార్ వెళుతున్న బస్సు.. రోడ్డు ప్రమాదానికి గురౌవడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 35 మందికి గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికులతో బిహార్ వెళుతున్న బస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బరద్వాన్ జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.
నేషనల్ హైవే 19పై రోడ్డు ప్రక్కన ఆపి ఉంచిన ట్రక్కును బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. నాలా ఫెర్రీ ఘాట్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారి ట్రక్కును ఢికొట్టడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.