శ్రీలంక @ బంగ్లాదేశ్‌  | Sri Lanka is set to begin a two-Test series against Bangladesh | Sakshi
Sakshi News home page

శ్రీలంక @ బంగ్లాదేశ్‌ 

Jun 17 2025 4:58 AM | Updated on Jun 17 2025 4:58 AM

Sri Lanka is set to begin a two-Test series against Bangladesh

నేటి నుంచి డబ్ల్యూటీసీ (2025–27) షురూ

గాలే: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) తాజా విజేత దక్షిణాఫ్రికా సంబరాలు ఇంకా ముగియక ముందే తర్వాతి డబ్ల్యూటీసీకి తెర లేచింది. 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. గాలే వేదికగా నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొన్నాళ్ల క్రితమే సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో 0–2తో చిత్తయిన లంక కోలుకొని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. 

ఈ సిరీస్‌ కోసం లంక ఏకంగా ఆరుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. రెండు చేతులతో స్పిన్‌ బౌలింగ్‌ చేయగల తరిందు రత్ననాయకే ఈ టెస్టుతో అరంగేట్రం చేయడం ఖాయమైంది. టీమ్‌లో సీనియర్‌ ప్లేయర్‌ ఏంజెలో మాథ్యూస్‌ ఈ సిరీస్‌ తర్వాత రిటైర్‌ కానున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ పరిస్థితి ఎప్పటిలాగే బలహీనంగా కనిపిస్తోంది. 

జింబాబ్వేతో సిరీస్‌ను 1–1తో ముగించిన తర్వాత మళ్లీ ఆ టీమ్‌ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. ఒక్క ఆటగాడు కూడా ఫామ్‌లో కనిపించడం లేదు. కెపె్టన్‌ నజు్మల్‌ గత 10 టెస్టుల్లో 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగా, సీనియర్‌ బ్యాటర్‌ ముషి్ఫకర్‌ గత 13 ఇన్నింగ్స్‌లలో కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. గాలే పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు స్పిన్‌పై బాగా దృష్టి పెట్టాయి. మెహదీ హసన్‌ మిరాజ్, తైజుల్‌ ఇస్లామ్‌ జట్టుకు కీలకం కానున్నారు. మ్యాచ్‌కు వర్షం కొంత అంతరాయం కలిగించవచ్చు.   
 

Advertisement
 
Advertisement
Advertisement