breaking news
Two Test
-
శ్రీలంక @ బంగ్లాదేశ్
గాలే: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) తాజా విజేత దక్షిణాఫ్రికా సంబరాలు ఇంకా ముగియక ముందే తర్వాతి డబ్ల్యూటీసీకి తెర లేచింది. 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. గాలే వేదికగా నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొన్నాళ్ల క్రితమే సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో 0–2తో చిత్తయిన లంక కోలుకొని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ కోసం లంక ఏకంగా ఆరుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేయగల తరిందు రత్ననాయకే ఈ టెస్టుతో అరంగేట్రం చేయడం ఖాయమైంది. టీమ్‌లో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిస్థితి ఎప్పటిలాగే బలహీనంగా కనిపిస్తోంది. జింబాబ్వేతో సిరీస్‌ను 1–1తో ముగించిన తర్వాత మళ్లీ ఆ టీమ్ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. ఒక్క ఆటగాడు కూడా ఫామ్‌లో కనిపించడం లేదు. కెపె్టన్ నజు్మల్ గత 10 టెస్టుల్లో 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగా, సీనియర్ బ్యాటర్ ముషి్ఫకర్ గత 13 ఇన్నింగ్స్‌లలో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గాలే పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు స్పిన్‌పై బాగా దృష్టి పెట్టాయి. మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్ జట్టుకు కీలకం కానున్నారు. మ్యాచ్‌కు వర్షం కొంత అంతరాయం కలిగించవచ్చు. -
న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్
చివరి టెస్టులో పాకిస్తాన్ చిత్తు హామిల్టన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టులో కివీస్ 138 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. 369 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మంగళవారం తమ రెండో ఇన్నింగ్సలో 92.1 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌట్ అరుు్యంది. 1985 అనంతరం పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం కివీస్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఓపెనర్లు సమీ అస్లామ్ (238 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), అజహర్ అలీ (161 బంతుల్లో 58; 4 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో తొలి వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. టీ విరామానికి వికెట్ నష్టానికి 158 పరుగులతో పాక్ పటిష్టంగానే కనిపించింది. అప్పటికి 204 బంతుల్లో 211 పరుగులు చేయాల్సి ఉంది. అరుుతే కివీస్ బౌలర్ల ధాటికి పాక్ ఇన్నింగ్స అనూహ్యంగా కుప్పకూలింది. చివరి 8 వికెట్లను కేవలం 49 పరుగుల వ్యవధిలోనే కోల్పోరుు పరాజయం పాలైంది. వాగ్నర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే ఆఖరి మూడు వికెట్లు తీశాడు. సౌతీ, సాన్‌ట్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు. -
జడేజా... వచ్చాడు
* టెస్టు జట్టులోకి పునరాగమనం * హర్భజన్‌కు విశ్రాంతి * వన్డే జట్టులో అరవింద్ స్థానం న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో... చుట్టుముట్టిన విమర్శలతో భారత జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... ఘనంగా పునరాగమనం చేయబోతున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు తిరిగి జట్టులోకి ఆహ్వానించారు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 16 మంది సభ్యుల బృందంలో జడేజాకు చోటు దక్కింది. ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోబోతున్న హర్భజన్‌కు విశ్రాంతి ఇచ్చి జడేజాను జట్టులోకి తీసుకున్నారు. చివరిసారిగా 14 నెలల క్రితం జడేజా భారత్ తరఫున టెస్టు ఆడాడు. కోహ్లి సారథ్యంలో శ్రీలంకలో సిరీస్ గెలిచిన జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. గాయం కారణంగా ఆ సిరీస్‌లో చివరి టెస్టుకు దూరమైన కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు మురళీ విజయ్, శిఖర్ ధావన్ కూడా జట్టులోకి ఎంపికయ్యారు. నవంబరు 5 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. ఇందులో తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు. గాయం కారణంగా అశ్విన్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేని స్థితి ఉన్నందున... ప్రస్తుతానికి తన పేరునూ ప్రకటించారు. మ్యాచ్‌ల సమయానికి ఫిట్‌గా ఉంటే జట్టులోకి తీసుకుంటారు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, భువనేశ్వర్, ఉమేశ్, రాహుల్, బిన్నీ, ఆరోన్, ఇషాంత్. ఉమేశ్‌పై వేటు దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు జట్టులో ఒక్క మార్పు చేశారు. పేలవ ఫామ్ కారణంగా ఉమేశ్ యాదవ్‌ను తొలగించి అరవింద్‌ను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టి20 ద్వారా అరవింద్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇది మినహా ప్రస్తుతం ఉన్న జట్టులో మార్పులేమీ లేవు. చివరి రెండు వన్డేలకు జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, అక్షర్, హర్భజన్, మిశ్రా, మోహిత్, భువనేశ్వర్, అరవింద్, బిన్నీ, రాయుడు, గుర్కీరత్.