పాకిస్తాన్ వేదికగా ఇవాల్టి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌కు (Pakistan Tri Series) ముందు శ్రీలంక జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలుత అనారోగ్యం కారణంగా కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో ఈ టోర్నీకి దూరమయ్యారు.

తాజాగా స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయం (హామ్‌స్ట్రింగ్) కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అసలంక స్థానంలో దసున్ షనకకు కెప్టెన్‌గా నియమించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. హసరంగకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్పిన్ ఆయుధాన్ని (విజయకాంత్ వియాస్‌కాంత్) జట్టులోకి తీసుకుంది.
23 ఏళ్ల వియాస్‌కాంత్ (Vijayakanth Viyaskanth) ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20నే ఆడినప్పటికీ.. ఐపీఎల్ సహా దేశవాలీ టోర్నీల్లో తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన వియాస్‌కాంత్‌ను స్వదేశంలో భవిష్యత్ హసరంగగా కీర్తిస్తుంటారు. పాక్ ట్రై సిరీస్‌లో వియాస్‌కాంత్ ప్రమాదకర బౌలర్‌గా మారే అవకాశముంది.
కాగా, పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో శ్రీలంకతో పాటు జింబాబ్వే పాల్గొంటుంది. ఇవాళ జరిగే టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడనున్నాయి. శ్రీలంక తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న జింబాబ్వేతో ఆడనుంది.
పాక్ చేతిలో చిత్తు
ట్రై సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ముగిసిన చివరి మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పాక్ ట్రై సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..
పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, విజయ్‌కాంత్ వియాస్‌కాంత్, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.


