తొలి టెస్ట్‌లో హిట్‌.. రెండో టెస్ట్‌లో ఫట్‌ | Bangladesh Scored 220 Runs For 8 Wickets On First Day Of Second Test Against Sri Lanka | Sakshi
Sakshi News home page

తొలి టెస్ట్‌లో హిట్‌.. రెండో టెస్ట్‌లో ఫట్‌

Jun 25 2025 6:36 PM | Updated on Jun 25 2025 7:32 PM

Bangladesh Scored 220 Runs For 8 Wickets On First Day Of Second Test Against Sri Lanka

కొలొంబో వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య ఇవాళ (జూన్‌ 25) రెండో టెస్ట్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం (46), మొమినుల్‌ హక్‌ (21), ముష్ఫికర్‌ రహీం (35), లిటన్‌ దాస్‌ (34), మెహిది హసన్‌ మిరాజ్‌ (31), నయీమ్‌ హసన్‌ (25) రెండంకెల స్కోర్లు చేయగా.. అనాముల్‌ హక్‌ 0, కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో 8 పరుగులకు ఔటయ్యారు. 

ఆట ముగిసే సమయానికి తైజుల్‌ ఇస్లాం (9), ఎబాదత్‌ హోసేన్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌ను అశిత ఫెర్నాండో (14-2-43-2), విశ్వ ఫెర్నాండో (16-3-35-2), సోనల్‌ దినుష (9-3-22-2), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (16-1-63-1) దెబ్బకొట్టారు.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో రెండు ఇన్నింగ్స్‌ల్లో (148, 125 నాటౌట్‌) సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో బంగ్లా బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం (163), శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (187) సెంచరీలు చేశారు.

తొలి టెస్ట్‌లో హిట్‌.. రెండో టెస్ట్‌లో ఫట్‌
తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు  చేసి అదరగొట్టాడు. అయితే ఇవాళ ప్రారంభమైన రెండో టెస్ట్‌లో మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు. తొలి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన ముష్ఫికర్‌.. రెండో టెస్ట్‌లో ఓ మోస్తరు స్కోర్‌ (35) చేసి ఔటయ్యాడు. తొలి టెస్ట్‌లో ట్విన్‌ సెంచరీలు చేసి హిట్‌ అయిన నజ్ముల్‌ హసన్‌.. రెండో టెస్ట్‌లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే ఔటై ఫట్‌ అనిపించాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement