
కొలంబో: శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని జాఫ్నా వద్ద ఆదివారం ఆ దేశ నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్ట్ చేయడంతోపాటు, వారి బోటును స్వాదీనం చేసుకుంది. ఆదివారం ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లో డెల్ఫ్‌ట్ దీవి పక్కన అక్రమంగా చేపలు పడుతుండగా పట్టుకున్నామని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.
కంకసేతురై హార్బర్‌కు మత్స్యకారులతోపాటు బోటును తరలించామంది. భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలలో మత్స్యకారుల అంశం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక నేవీ పాక్ జలసంధిలో భారత మత్స్యకారులపై కాల్పులు జరిపి, వారి పడవలను స్వా«దీనం చేసుకోవడం పరిపాటిగా మారింది.