ఆ తర్వాతే స్వదేశానికి తిరిగివెళ్తా..
అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలి
స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్
భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని యూనస్‌కు హితవు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం’పునరుద్ధరణ జరిగితేనే తాను అక్కడికి తిరిగి వెళ్తానని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా చెప్పారు. తమ అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పదవిచ్యుతురాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో గుర్తు తెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు.
ఆమె తాజాగా ఓ వార్తా సంస్థకు ఈ–మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై స్పందించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజల చేత ఎన్నిక కాని మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. భారత్‌తో సంబంధాలు తెంచేసుకోడానికి ప్రయత్నిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు తీవ్రవాద శక్తులకు ప్రభుత్వం అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. తీవ్రవాదులు బలపడితే ప్రజలకు ముప్పు తప్పదని తేలి్చచెప్పారు.
భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు
తమ ప్రభుత్వ హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య విస్తృతమైన, లోతైన సంబంధాలు ఉండేవని షేక్ హసీనా గుర్తుచేశారు. యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం వచి్చన తర్వాత ఆ సంబంధాలు నానాటికీ బలహీనపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాతో మెరుగైన సంబంధాలు ఉంటేనే బంగ్లాదేశ్ ప్రజలకు భరోసా లభిస్తుందని పరోక్షంగా స్పష్టంచేశారు. అనవసరమైన రిస్క్ చేయొద్దని యూనస్‌కు హితవు పలికారు. తనకు ఆశ్రయం కలి్పస్తున్నందుకు భారత ప్రభుత్వానికి హసీనా ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఇక్కడ చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయని, భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఎల్లప్పుడు కృతజు్ఞరాలినై ఉంటానని వ్యాఖ్యానించారు.
ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇవ్వలేదు
తాను స్వదేశానికి తిరిగి వెళ్లాలంటే అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాల్సిందేనని షేక్ హసీనా తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ ప్రజ లంతా అదే కోరుకుంటున్నారని స్పష్టంచేశా రు. అత్యధిక కాలం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన నేతగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, హింసాకాండ నేపథ్యంలో 2024 ఆగస్టు 5న పదవికి రాజీనామా చేసి, దేశం వీడి వెళ్లాల్సి వచి్చంది. అప్పటి హింసాకాండను నియంత్రించ డంలో తాము విఫలమైన మాట నిజమేనని షేక్ హసీనా అంగీకరించారు. అందుకు విచా రిస్తున్నామని చెప్పారు. ఆ దురదృష్టకర సంఘటనల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యా ర్థి సంఘాల నాయకులమని చెప్పుకొంటున్న కొందరు దుర్మార్గులు కుట్రపూరితంగా హింసను ప్రేరేపించారని మండిపడ్డారు.
వారు బాధ్యతలేకుండా ప్రవర్తించారని విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికలను బహిష్కరించాలంటూ తాను పిలుపునిచి్చనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి పిలుపు తాను ఇవ్వలేదని పేర్కొన్నారు. అవామీ లీగ్ ప్రమేయం లేకుండా ఏ ఎన్నికలు జరిగినా వాటికి చట్టబద్ధత ఉండదని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తమకు కోట్లాది మంది మద్దతు పలుకుతున్నారని గుర్తుచేశారు. అసలైన ప్రజాబలం ఉన్న పార్టీయే అధికారంలోకి రావాలన్నారు. అవామీ లీగ్‌పై నిషేధాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తేలి్చచెప్పారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీ లీగ్ పాత్ర ఉండాల్సిందేనని అన్నారు.
బలహీన పాలకుడు యూనస్
బంగ్లాదేశ్‌కు భారత్ అత్యంత కీలకమైన అంతర్జాతీయ భాగస్వామి అని షేక్ హసీనా వివరించారు. భారత్ ఎప్పటికీ విశ్వసనీయ మిత్ర దేశమేనని చెప్పారు. మహ్మద్ యూనస్ దౌత్య విధానాలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తనన తాను ఓడించుకొనే విధానాలను ఆయన తలకెత్తుకున్నారని విమర్శించారు. యూనస్ ఒక బలహీన పాలకుడు అని తేలి్చచెప్పారు. తీవ్రవాదుల మద్దతుపై ఆధారపడి పాలన సాగిస్తున్నారని ఆక్షేపించారు. విదేశాలతో దౌత్యం విషయంలో తప్పులు చేయడం ఇకనైనా మానుకోవాలని యూనస్‌కు సూచించారు. పొరుగు దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అన్నారు.
బంగ్లాదేశ్ పరిణామాలు భారత్‌కు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడం లేదని, భారత్ ఎప్పటికీ మిత్రదేశంగానే ఉంటుందని షేక్ హసీనా వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. న్యాయం తనవైపే ఉందని, నిర్దోíÙగా బయటపడతానని ధీమా వ్యక్తంచేశారు. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో తనపై విచారణ ప్రారంభించడాన్ని ఆమె తప్పుపట్టారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై కుట్రలకు వేదికగా ఆ ట్రిబ్యునల్‌ను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తనను, తన పార్టీని అంతం చేయాలన్నదే వారి ఆసలు అజెండా అని మండిపడ్డారు. ప్రత్యర్థుల ఆటలు సాగవని స్పష్టంచేశారు.


