ఢాకా: బంగ్లాదేశ్‌లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. వరుస దాడి ఘటనల కారణంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రముఖ రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై మూక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌లోని ఫరీదాపూర్‌లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాల పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది అక్కడికి వచ్చారు. అయితే, ఈ కాన్సర్ట్ ప్రారంభానికి ముందు(రాత్రి తొమ్మిది గంటల సమయంలో).. ఉన్నట్టుండి ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో, వారిని భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. కాన్సర్ట్‌కు వచ్చిన వారిపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.
Once again, a concert by Bangladesh’s leading band music artist James has been shut down.
In Faridpur, just before the concert was set to begin, extremist groups stormed the stage and carried out an attack. Following intervention by law enforcement agencies, the organizers were… pic.twitter.com/NfmLRjL2OF— Sahidul Hasan Khokon (@SahidulKhokonbd) December 26, 2025
కాగా, ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్ తృటిలో తప్పించుకున్నారు. ఉద్రిక్తతలు మొదలవగానే భద్రతా సిబ్బంది ఆయన్ను అక్కడినుంచి తరలించారు. కానీ, మూక దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఈ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం, భద్రతా కారణాల రీత్యా కాన్సర్ట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


