
వాలెడిక్టరీ వేడుకలో రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు, పీ.వీ.కే.ప్రసాద్‌లతో శ్రీలంక పోలీసులు
‘డిజిటల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్’లో శ్రీలంకన్ పోలీసులకు శిక్షణ
సీడీటీఐలో ముగిసిన వారం రోజుల కోర్సు
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంక మధ్య చట్టాల అమలుతోపాటు సైబర్–భద్రతా రంగంలో సామర్థ్య పెంపు, దర్యాప్తులో సమన్వయం పెంచేందుకు ఐటీఈసీ (ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) కోర్సు ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్’అంశంపై శ్రీలంక సీనియర్ పోలీస్ అధికారులకు ఐటీఈసీ కోర్సులో శిక్షణ ఇచ్చారు. జూన్ 30 నుంచి జూలై 11 వరకు రామంతపూర్‌లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీటీఐ)లో శిక్షణ నిర్వహించారు.
ఈ కోర్సు ముగింపు సందర్భంగా శనివారం నిర్వ హించిన వాలెడిక్టరీ వేడుకకు ముఖ్యఅతిథిగా రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు, గౌరవ అతిథిగా ఉత్తరాఖండ్ హోంగార్డ్స్ డీజీ డాక్టర్ పీ.వీ.కే.ప్రసాద్ హాజరయ్యారు. సీడీటీఐ డైరెక్టర్ సల్మంతాజ్ పాటిల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కార్తికేయన్ ఈ కోర్సు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. కోర్సు కోఆర్డినేటర్, సీడీఐటీ డీఎస్పీ కేకేవీరెడ్డి కోర్సు నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ, శ్రీలంక పోలీసు అధికారులు ఈ కోర్సు నుంచి పొందిన జ్ఞానం వారి దేశంలో పోలీసు వ్యవస్థను మెరుగ–శ్రీలంకల మధ్య లా ఎన్‌ఫోర్స్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సామర్థ్య నిర్మాణం, సమాచార వినిమయంలో బలమైన సహకారాన్ని ఏర్పరుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా అధికారుల వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడడమే కాకుండా, ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు విశ్వాసం, బలమైన బంధాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. కోర్సులో పాల్గొన్న శ్రీలంక అధికారులకు సరి్టఫికెట్లు, స్మారక చిహ్నాల పంపిణీతో కార్యక్రమం ముగిసింది.