
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరుగబోయే 'డూ ఆర్ డై' మ్యాచ్‌కు (సూపర్-4) ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మతీష పతిరణ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. పతిరణ గాయం కారణంగా శ్రీలంక ఆడిన గత రెండు మ్యాచ్‌లకు కూడా దూరం ఉన్నాడు.
అయితే అతను కీలకమై పాక్ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని లంక మేనేజ్‌మెంట్ భావించింది. అతని గాయం ఇంకా తగ్గకపోవడంతో నేటి పాక్ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు అధికారికంగా ప్రకటించింది.
అబుదాబీలో నేడు పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌కు పతిరణ లంక మేనేజ్‌మెంట్ పరిశీలనలో ఉన్నాడు. అబుదాబీ పిచ్‌కు పేసర్లకు సహకరించే స్వభావం ఉండటంతో వారు పతిరణపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే పతిరణ గాయం మానకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.
నేటి మ్యాచ్ శ్రీలంకతో సహా పాక్‌కు కూడా అత్యంత కీలకం. ఇరు జట్లు సూపర్-4లో తమ తొలి మ్యాచ్‌ల్లో (పాక్ భారత్ చేతిలో, శ్రీలంక బంగ్లాదేశ్ చేతిలో ఓడాయి) పరాజయాలపాలయ్యారు. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ఫైనల్స్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు జట్లకు నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టు దాదాపుగా ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే.