అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.
విండ్హోక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్ లచ్‌మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు.
ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు.
కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది.


