
దుమ్మురేపుతున్న నిస్సంక, పెరీరా.. లక్ష్యం దిశగా సాగుతున్న శ్రీలంక
203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు పథుమ్ నిస్సంక, కుసాల్ పెరీరా దుమ్మురేపుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శ్రీలంకను లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. పెరీరా 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 52.. నిస్సంక 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 114/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో లంక గెలవాలంటే 60 బంతుల్లో 89 పరుగులు చేయాలి.
భారీ లక్ష్య ఛేదన.. ధాటిగా ఆడుతున్న శ్రీలంక
203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ధాటిగా ఆడుతుంది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయినా (కుసాల్ మెండిస్ డకౌట్).. పథుమ్ నిస్సంక (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుసాల్ పెరీరా (9 బంతుల్లో 14; 2 ఫోర్లు) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా శ్రీలంక 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.
అభిషేక్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు.
ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.
భారీ స్కోర్ దిశగా టీమిండియా
టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 179/5గా ఉంది. తిలక్ వర్మ (42), అక్షర్ పటేల్ (9) క్రీజ్‌లో ఉన్నారు.
నిరాశపరిచిన హార్దిక్
16.1వ ఓవర్- హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
15.3వ ఓవర్- 39 పరుగులు చేసి సంజూ శాంసన్ ఔటయ్యాడు. షనక బౌలింగ్‌లో అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (61) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 94/3గా ఉంది. తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
6.5వ ఓవర్- హసరంగ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్‌తో పాటు తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నాడు.
వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్
ప్రస్తుత ఆసియా కప్‌లో అభిషేక్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 71/1గా ఉంది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్‌లో ఉన్నాడు.
దుమ్మురేపుతున్న అభిషేక్ శర్మ
ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకాండ కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లోనూ అతను దుమ్మురేపుతున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 59/1గా ఉంది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్‌లో ఉన్నాడు.
టీమిండియాకు ఆదిలోనే షాక్
1.3వ ఓవర్- టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. తీక్షణ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (4) ఔటయ్యాడు.
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బుమ్రా, శివమ్ దూబే స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక ఓ మార్పు చేసింది. చమిక కరుణరత్నే స్థానంలో లియనాగే జట్టులోకి వచ్చాడు.
ఈ టోర్నీలో ఇదివరకే ఫైనల్ బెర్త్‌లు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. ఆదివారం జరుగబోయే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), కుసల్ పెరెరా, చరిత్ అసలంక (c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, జనిత్ లియనాగే, దుష్మంత చమీర, మహీశ తీక్షణ, నువాన్ తుషార