జై శంకర్‌తో శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య
కొలంబో: దిత్వా తుపానుతో కలావికలమైన శ్రీలంకను పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం రూ.4,000 కోట్ల ఆర్థికసాయంతో ఆదుకునేందుకు భారత్ ముందుకొచి్చంది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్‌సదా అండగా నిలబడుతుందని ఈ 45 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు విచ్చేసిన మంత్రి జైశంకర్ మంగళవారం శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకె, ఆ దేశ మహిళా ప్రధానమంత్రి హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు.
‘‘శ్రీలంక పునర్‌నిర్మాణానికి 45 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. దిత్వా తుపాను నుంచి తేరుకుని పునర్‌నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్న హస్తంఅందించేందుకు మేమున్నామని భారత్ తరఫున ప్రధాని మో దీ రాసిన లేఖను అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకేకు అందించా’’అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్‌తో కలిసి సంయుక్త మీడియా స మావేశంలో జైశంకర్ చెప్పారు. 45 కోట్ల డాలర్లలో 35 కోట్ల డాలర్లను రుణాలరూపంలో, 10 కోట్ల డా లర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది.
పునర్‌నిర్మాణం కోసం నిధుల వినియోగం
తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలికవసతుల పునరుద్ధరణకు ప్రధానంగా నిధులను ఖర్చుచేయనున్నారు. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్ల పునర్‌నిర్మాణం, రైల్వే ట్రాక్‌లు, వంతెనల మరమ్మతులు, కుప్పకూలిన ఇళ్లను నిర్మించడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు తోడ్పాటునందించడం, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు తగు ఆర్థికసాయం అందించడం వంటి కీలక పనులను నిధులను సది్వనియోగం చేయనున్నారు. ‘‘నిధుల సత్వర విడుదలతోపాటు ఆయా పనుల కోసం సమన్వయంతో పనిచేసేలా ‘ప్రభావవంత సహకార వ్యవస్థ’ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’అని జైశంకర్ చెప్పారు.
అంతకుముందు స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలీ రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్‌లోని కొలినోచ్ఛి జిల్లాలో జైశంకర్ ప్రారంభించారు. 110 టన్నుల బరువైన ఈ వంతెనను విడిభాగాలుగా భారత్ నుంచి విమానంలో తీసుకొచ్చి శ్రీలంకలో బిగించారు. ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమంలో భాగంగా బేటీ వంతెనను శ్రీలంకకు భారత్ సరఫరాచేసింది. ఆపరేషన్ సాగర్ బంధు సహాయక మిషన్‌లో భాగంగా భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున టెంట్లు, టార్పాలిన్లు, శుభ్రతా కిట్లు, నిత్యావసర వస్తువులు, నీటి శుద్ధి యంత్రాలను అందించింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలనూ ద్వీపదేశానికి సరఫరాచేసింది.


