breaking news
Cyclone Ditwah
-
శ్రీలంకకు రూ. 4 వేల కోట్ల ఆర్థిక సాయం
కొలంబో: దిత్వా తుపానుతో కలావికలమైన శ్రీలంకను పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం రూ.4,000 కోట్ల ఆర్థికసాయంతో ఆదుకునేందుకు భారత్ ముందుకొచి్చంది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్సదా అండగా నిలబడుతుందని ఈ 45 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు విచ్చేసిన మంత్రి జైశంకర్ మంగళవారం శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకె, ఆ దేశ మహిళా ప్రధానమంత్రి హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు.‘‘శ్రీలంక పునర్నిర్మాణానికి 45 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. దిత్వా తుపాను నుంచి తేరుకుని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్న హస్తంఅందించేందుకు మేమున్నామని భారత్ తరఫున ప్రధాని మో దీ రాసిన లేఖను అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకేకు అందించా’’అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్‌తో కలిసి సంయుక్త మీడియా స మావేశంలో జైశంకర్ చెప్పారు. 45 కోట్ల డాలర్లలో 35 కోట్ల డాలర్లను రుణాలరూపంలో, 10 కోట్ల డా లర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది. పునర్నిర్మాణం కోసం నిధుల వినియోగం తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలికవసతుల పునరుద్ధరణకు ప్రధానంగా నిధులను ఖర్చుచేయనున్నారు. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్ల పునర్నిర్మాణం, రైల్వే ట్రాక్‌లు, వంతెనల మరమ్మతులు, కుప్పకూలిన ఇళ్లను నిర్మించడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు తోడ్పాటునందించడం, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు తగు ఆర్థికసాయం అందించడం వంటి కీలక పనులను నిధులను సది్వనియోగం చేయనున్నారు. ‘‘నిధుల సత్వర విడుదలతోపాటు ఆయా పనుల కోసం సమన్వయంతో పనిచేసేలా ‘ప్రభావవంత సహకార వ్యవస్థ’ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’అని జైశంకర్ చెప్పారు.అంతకుముందు స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలీ రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్‌లోని కొలినోచ్ఛి జిల్లాలో జైశంకర్ ప్రారంభించారు. 110 టన్నుల బరువైన ఈ వంతెనను విడిభాగాలుగా భారత్ నుంచి విమానంలో తీసుకొచ్చి శ్రీలంకలో బిగించారు. ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమంలో భాగంగా బేటీ వంతెనను శ్రీలంకకు భారత్ సరఫరాచేసింది. ఆపరేషన్ సాగర్ బంధు సహాయక మిషన్‌లో భాగంగా భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున టెంట్లు, టార్పాలిన్లు, శుభ్రతా కిట్లు, నిత్యావసర వస్తువులు, నీటి శుద్ధి యంత్రాలను అందించింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలనూ ద్వీపదేశానికి సరఫరాచేసింది. -
Cyclone Ditwah: వణికిస్తున్న దిత్వా తుఫాన్ డేంజర్ లో నెల్లూరు!
-
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.దిత్వా తుపాను (Cyclone Ditwah) ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్ సరఫరా కూడా కొన్ని చోట్ల నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికార యంత్రాగం తెలిపింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని.. వర్షాల సమయంలో వాగులు, చెరువుల దగ్గరికి వెళ్లకూడదని సూచించారు.గూడురులో భారీ వర్షం కారణంగా.. నాలుగు కాలనీల్లోకి వరద నీరు చేరింది. చిల్లకూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. గూడూరు, విందూరులకు పూర్తిగా రాకపోకలకు నిలిచిపోయాయి. పంబలేరు, ఉప్పుటేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాకాడు బ్యారేజ్ 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రైతులు తమ పంటలను రక్షించుకోవాలని సూచించింది. వర్షాల ప్రభావం వల్ల రవాణా, విద్యుత్ వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. తెలంగాణలో చలి తీవ్రతఈ నెల 9వ తేదీ తర్వాత తెలంగాణ అంతటా చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)
-
ఏపీలో కుండపోత వర్షం.. మునిగిన రహదారులు
-
ఏపీకి హెచ్చరిక.. నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు!
సాక్షి, అమరావతి: దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాపై దిత్వా ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా, తాజాగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.దిత్వా తుపాను ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు.. నైరుతి-పశ్చిమ బంగాళాఖాతం ఆనుకొని వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కదలుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు వెల్లడించారు. తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా వాయుగుండం కదులుతోంది. మరో 12 గంటల్లో బలమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది. గంటకు 45-55 కి.మీ. మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో గాలుల ప్రభావానికి కోతకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల వరి పంట నేల వాలింది. గాలుల ప్రభావం పెరిగితే చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల ప్రభావంతో నిజాంపట్నం హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లే బోట్లు అన్ని జెట్టికే పరిమితం అయ్యాయి.తమిళనాడులో కొనసాగుతున్న వర్షాలుబలహీనపడ్డ దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం చెన్నై, శివారులలో 30 చోట్ల భారీగా వర్షం పడింది. ఉత్తర చెన్నై పరిధిలోని ఎన్నూరులో 26 సెం.మీ., బ్రాడ్వేలో 25 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరదలు పోటెత్తాయి. నీటి తొలగింపు పనులను వేగవంతం చేశారు. 40కి పైగా ప్రాంతాలలో ఈదురు గాలుల ధాటికి చెట్లు నేల కొరగడంతో వాటిని తొలగించారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండం కదలుతుందని భావిస్తే.. అది వచ్చిన దారిలో మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడం గమనార్హం. బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో చెన్నై, శివారులలో చిరు జల్లులతో వర్షం పడుతోంది. ఇక అలాగే, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
#CycloneDitwah : తమిళనాడులో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో చెన్నై (ఫొటోలు)
-
ఇండియా సాయం కోరిన పాక్.. భారత్ గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్ అనుమతించలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్ క్లారిటీ ఇచ్చింది.వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్.. భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్‌ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఈ సందర్బంగా భారత్.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దిత్వా తుపాను.. శ్రీలంక అతలాకుతలం
కొలంబో: దిత్వా తుపాను బీభత్సం ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (డీఎంసీ) వెల్లడించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది.దిత్వా తుపాను ప్రభావం శ్రీలంకపై కొనసాగుతోంది. తుపాను కారణంగా లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా.. 150 మంది కనిపించకుండా పోయారు. బదుల్లాలో 71 మంది మృతి చెందారు. డీఎంసీ ప్రకారం ఈ తుపాను.. దేశవ్యాప్తంగా 3,09,607 కుటుంబాలను ప్రభావితం చేసింది. ఇక, ఇటీవలి కాలంలో శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలలో ఈ తుపాను నిలిచింది. వరదల కారణంగా పలు పట్టణాలు మునిగిపోయాయని, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయని, మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు.🚨🇱🇰 CYCLONE DITWAH just tore through Sri Lanka. Death toll hits 153, half a million flooded, 191 missing, entire tea estates buried, suburbs turned into death traps. 44,000 crammed in shelters, 15,000 homes gone, 1.75 million without power. The Air Force rescued 121 in 50mph… pic.twitter.com/fsLDducOss— TheCommonVoice (@MaxRumbleX) November 30, 2025మరోవైపు.. దిత్వా నేపథ్యంలో ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో శ్రీలంకలో భారత్ చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, రెండు చేతక్ హెలికాప్టర్లతో పాటు 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని శ్రీలంకకు పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. అంతకు ముందురోజు వాయుసేనకు చెందిన సీ-130జే, ఐఎల్ 76 విమానాలు 21 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించాయి.Cyclone ‘Ditwah’ Batters Sri Lanka; Government Appeals for International Aid pic.twitter.com/oGwmHUb5gA— Indian News Network (@INNChannelNews) November 29, 2025కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 323 మంది భారతీయులను ఆదివారం రవాణా విమానాల్లో స్వదేశానికి తరలించారు. 247 మంది తిరువనంతపురానికి, 76 మంది దిల్లీకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల్లో 45 మందిని భారత వాయుసేన (ఐఏఎఫ్) హెలికాప్టర్లు కొలంబోకు తరలించాయి. ప్రభావిత ప్రాంతాలకు 57 మంది శ్రీలంక సైనికుల్ని కూడా ఐఏఎఫ్ తరలించింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులెవరైనా అత్యవసర హెల్ప్‌డెస్క్‌ను +94 773727832 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. -
తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్
-
ఏపీకి ‘దిత్వా’ అలర్ట్.. మూడు జిల్లాల్లో పాఠశాలలు బంద్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కరైకాల్‌కు 120, పుదుచ్చేరికి 90, చెన్నైకు 150 కి.మీ. దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.తుపాన్ ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.నేడు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయి. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.మంగళవారం వర్షాలు ఇలా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అన్నారు. తీరం వెంట గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా
-
ఏపీ వైపు దూసుకొస్తున్న ‘దిత్వా’ తుపాను..
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 120 కి. మీ, పుదుచ్చేరికి 90 కి.మీ, చెన్నైకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు (డిసెంబర్ 1, సోమవారం) సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
వాయువేగంతో ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాను
-
తమిళనాడుకు దిత్వా పెనుప్రమాదం
-
వణికిస్తున్న ‘దిత్వా’ తుపాను (ఫొటోలు)
-
Cyclone Ditwah: బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను
-
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి రెడ్ అలర్ట్
-
దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రెండు రోజులు భారీ వర్షాలు
-
శ్రీలంకలో తీవ్ర తుఫాను
కొలంబో: శ్రీలంకను శుక్రవారం దిత్వాహ్ తుఫాను అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మతాలె, పొలన్నరువా, యువ ప్రావిన్స్‌లను కలిపే వంతెనలు కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో రెండు పవర్ ప్లాంట్లను మూసివేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. రాజధాని కొలంబోతోపాటు అత్యధిక జనాభా కలిగిన గంపాహా జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెలనీ, అట్టనగలు నదులు పొంగిపొర్లాయి. మొత్తం 80 మంది చనిపోగా 34 మంది జాడ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 14 వేల మందిని 195 అత్యవసర కేంద్రాలకు తరలించామన్నారు. ‘ఆపరేషన్ సాగర్ బంధు’భారత ప్రభుత్వం శ్రీలంకకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా మొదటి విడత తుఫాను సాయంగా ఆహార పదార్థాలను పంపించింది. ఇలా ఉండగా, తుఫాను ప్రభావం గత పది రోజుల వ్యవధిలోనే 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో కొండప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వాన కురిసిందని వివరించింది. -
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్
-
దిత్వా తుఫాన్ బీభత్సం.. 56 మంది మృతి
-
80 కిలోమీటర్ల దూరంలో ముంచుకొస్తున్న మృత్యువు
-
తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా
-
ఏపీకి దిత్వా ముప్పు!
విశాఖపట్నం: సెన్యార్ ముప్పు తొలగిందని అనుకునేలోపే మరో తుపాను దూసుకొస్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం.. శ్రీలంక వైపు కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను భారత వాతావరణ శాఖ(IMD) అప్రమత్తం చేసింది. దిత్వా ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలింది. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో.. ఏపీలో రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిత్వా తుపాను నేపథ్యంలో అన్ని పోర్టులలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.మరోవైపు దిత్వా ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై కూడా ఉండనుంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తుపానుకు దిత్వాగా యెమెన్ నామకరణం చేసింది. దీనర్థం పువ్వు అని.


