జయం మనదే | India wins Women ODI Tri-Series: India Defeat Sri Lanka By 97 Runs | Sakshi
Sakshi News home page

జయం మనదే

May 12 2025 4:05 AM | Updated on May 12 2025 4:05 AM

India wins Women ODI Tri-Series: India Defeat Sri Lanka By 97 Runs

మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నీ విజేత భారత్‌

ఫైనల్లో 97 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం

స్మృతి మంధాన సెంచరీ

రాణించిన హర్లీన్, జెమీమా, హర్మన్‌

మెరిసిన స్నేహ్‌ రాణా, అమన్‌జ్యోత్‌  

కొలంబో: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో విజేతగా అవతరించింది. ఆతిథ్య శ్రీలంక జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గత మ్యాచ్‌లో ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచి్చన స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన తుదిపోరులో వీరోచిత శతకంతో భారత్‌కు ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీస్కోరు చేసింది.

 వైస్‌ కెప్టేన్‌ స్మృతి మంధాన  (101 బంతుల్లో 116; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... హర్లీన్‌ డియోల్‌ (56 బంతుల్లో 47; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (29 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టేన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. కెప్టేన్‌ చమరి ఆటపట్టు (66 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌), నీలాక్షిక సిల్వా (58 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా 4, పేసర్‌ అమన్‌జ్యోత్‌ కౌర్‌ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన స్మృతి మంధానకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, సిరీస్‌లో 15 వికెట్లు తీసిన స్నేహ్‌ రాణాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.  

సూపర్‌ స్మృతి... 
ఓపెనర్లు స్మృతి, ప్రతీక రావల్‌ (30; 2 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 70 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత హర్లీన్‌ జతయ్యాక 55 బంతుల్లో స్మృతి అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఇద్దరు నిలదొక్కుకోవడంతో 22వ ఓవర్లో భారత్‌ 100 పరుగులకు చేరింది. మరోవైపు లంక శిబిరం ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలయ్యాయి. చమరి వేసిన 31వ ఓవర్లో వరుసగా 4, 4, 4, 4లతో స్మృతి వన్డేల్లో 11వ సెంచరీని 92 బంతుల్లో పూర్తి చేసుకుంది. 

కాసేపటికి జట్టు స్కోరు 190 వద్ద ఆమె ని్రష్కమించింది. తర్వాత వచి్చన హర్మన్‌ప్రీత్, జెమీమాలు కూడా లంక బౌలర్లపై యథేచ్చగా పరుగులు సాధించడంతో భారత్‌ స్కోరు దూసుకెళ్లింది. ముఖ్యంగా జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టడంతో భారత జట్టు చివరి 10 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆఖర్లో దీప్తి (14 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు), అమన్‌జ్యోత్‌ (12 బంతుల్లో 18; 2 ఫోర్లు) వేగంగా పరుగులు జతచేశారు.  

ఆరంభం నుంచే తడబాటు... 
ఆరంభం నుంచి ఇన్నింగ్స్‌ ముగిసేదాకా లంక జట్టు ఏ దశలోనూ లక్ష్యఛేదనవైపు నడవ లేదు. మీడియం పేసర్‌ అమన్‌జ్యోత్‌ వైవిధ్యమైన బంతులతో లంక ఓపెనర్లను హడలెత్తించింది. ఖాతా తెరువక ముందే హాసిని (0) డకౌట్‌ కాగా, కాసేపటికి విష్మీ గుణరత్నే (36; 5 ఫోర్లు)ని కూడా అమన్‌జ్యోతే క్లీన్‌»ౌల్డ్‌ చేసింది. కెప్టేన్‌ చమరి, నీలాక్షిక కాసేపు భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్నారే తప్ప లక్ష్యానికి అవసరమైన వేగాన్ని అందిపుచ్చుకోలేదు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న చమరి 121 స్కోరు వద్ద పెవిలియన్‌ చేరింది. తర్వాత హర్షిత నిలబడేందుకు ప్రయత్నం చేసినా... స్నేహ్‌ రాణా, అమన్‌జ్యోత్, శ్రీచరణి చావుదెబ్బ తీశారు. దీంతో 173/2తో పటిష్టంగా కనిపించిన లంక 19 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయి 192/7 వద్ద కుదేలైంది. సుగందిక (27; 5 ఫోర్లు) చేసిన ఆ మాత్రం స్కోరుతో జట్టు 240 పైచిలుకు స్కోరు చేయగలిగింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: ప్రతీక (సి) వత్సల (బి) ఇనోక 30; స్మృతి (సి) హర్షిత (బి) విహంగ 116; హర్లీన్‌ (సి అండ్‌ బి) విహంగ 47; హర్మన్‌ప్రీత్‌ (సి) మాల్కి మదర (బి) సుగంధిక 41; జెమీమా (సి) నీలాక్షిక (బి) సుగంధిక 44; రిచా ఘోష్‌ (సి) సబ్‌–కరుణరత్నే (బి) మాల్కి మదర 8; అమన్‌జ్యోత్‌ (సి) సబ్‌–కరుణరత్నే (బి) మాల్కి మదర 18; దీప్తి శర్మ (నాటౌట్‌) 20; క్రాంతి గౌడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 342. వికెట్ల పతనం: 1–70, 2–190, 3–219, 4–267, 5–294, 6–304, 7–341.
బౌలింగ్‌: మాల్కి మదర 10–0–74–2, దేమి విహంగ 10–0–69–2, సుగంధిక 10–0–59–2, ఇనొక రణవీర 10–0–62–1, చమరి 8–0–61–0, పియుమి వత్సల 2–0–17–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: హాసిని (బి) అమన్‌జ్యోత్‌ 0; విష్మీ గుణరత్నే (బి) అమన్‌జ్యోత్‌ 36; చమరి (బి) స్నేహ్‌ రాణా 51; నీలాక్షిక (సి) హర్లీన్‌ (బి) స్నేహ్‌ రాణా 48; హర్షిత (సి) స్మృతి (బి) అమన్‌జ్యోత్‌ 26; దేమి విహంగ (సి) స్నేహ్‌ రాణా (బి) శ్రీ చరణి 4; అనుష్క (సి) అమన్‌జ్యోత్‌ (బి) స్నేహ్‌ రాణా 28; వత్సల రనౌట్‌ 9; సుగంధిక (రనౌట్‌) 27; మాల్కి మదర (బి) స్నేహ్‌ రాణా 0; ఇనోక (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్‌) 245. వికెట్ల పతనం: 1–0, 2–68, 3–121, 4–173, 5–178, 6–178, 7–192, 8–243, 9–244, 10–245. 
బౌలింగ్‌: అమన్‌జ్యోత్‌ కౌర్‌ 8–0–54–3, క్రాంతి 5–0–22–0, దీప్తి శర్మ 10–0–43–0, శ్రీచరణి 10–0–55–1, స్నేహ్‌ రాణా 9.2–1–38–4, ప్రతీక రావల్‌ 5–0–18–0, హర్లీన్‌ డియోల్‌ 1–0–12–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement