
జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ గురువారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమయ్యాడు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్బంగా గాయపడిన హసరంగా ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు ఆసియాకప్-2025 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశమున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అసలంక సారథ్యంలోని లంక జట్టు ఇప్పటికే జింబాబ్వేకు చేరుకుంది.
ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో లంకేయులు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్నారు. శుక్రవారం నుంచి హరారే వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం సెప్టెంబర్ 3 నుంచి 7 మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఆసియాకప్ సన్నాహాకంగా శ్రీలంకకు ఉపయోగపడనుంది.
ఈ సిరీస్ ముగిశాక శ్రీలంక జట్టు నేరుగా జింబాబ్వే నుంచి దుబాయ్‌కు చేరుకోనుంది. ఈ ఏడాది ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 13న అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ ఖండంత టోర్నీ కోసం తమ జట్టును శ్రీలంక క్రికెట్ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.
జింబాబ్వే సిరీస్‌కు లంక జట్టు
చరిత్ అసలంక(కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, నువానీదు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశ్రా, విషెన్ హలంబాగే, దాసున్ షనక, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్న, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, మతీషా పతిరాన, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో
చదవండి: నేను ఆడడం ఎవరికైనా సమస్యా? నా రిటైర్మెంట్ అప్పుడే: షమీ