
జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ ఇటీవలికాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో దారుణంగా విఫలమైన బ్రెండన్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని తాకి మరోసారి వార్తల్లోకెక్కాడు.
ఈసారి అతడు జింబాబ్వే తరఫున చారిత్రక మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇవాళ (ఆగస్ట్ 31) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బ్రెండన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
జింబాబ్వే క్రికెట్ చరిత్రలో బ్రెండన్‌కు ముందు ఆండీ ఫ్లవర్ (320 ఇన్నింగ్స్‌ల్లో 11580 పరుగులు), గ్రాంట్ ఫ్లవర్ (337 ఇన్నింగ్స్‌లోల 10028 పరుగులు) మాత్రమే ఈ ఘనత సాధించారు. జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడైన బ్రెండన్ తన కెరీర్‌లో 320 ఇన్నింగ్స్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనతను ఓ వంద మాత్రమే సాధించారు. జింబాబ్వే తరఫున అత్యధిక వన్డే సెంచరీలు (11) చేసిన ఆటగాడిగా రికార్డు కలిగిన బ్రెండన్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య తర్వాత అత్యధిక వన్డే కెరీర్ (21 ఏళ్లు) కలిగిన ఆటగాడిగానూ రికార్డుల్లో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బ్రెండన్ టేలర్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బెన్ కర్రన్ (79), సికందర్ రజా (59 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో పర్యాటక శ్రీలంక 7 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.