
కొలంబో: శ్రీలంకలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 500 అడుగుల లోయలో పడి 15మంది ప్రయాణికులు దుర్మరణ పాలయ్యారు. 15మంది త్రీవంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల మేరకు గురువారం రాత్రి (సెప్టెంబర్4)తంగల్లే మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులు విహారయాత్రకు బయల్దేరారు. అయితే ఈ విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ఎల్లా-వెల్లావాయ ప్రధాన రహదారిలోని 24వ కి.మీ పోస్ట్ సమీపంలోని లోయలో బస్సు పడింది. ఈ దుర్ఘటనలో 15మంది ఉద్యోగులు మరణించారు.
దుర్ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు,పోలీసులు బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. బాధితుల్ని బదుల్లా టీచింగ్ హాస్పిటల్‌లో చేర్చారు. 500 అడుగుల లోయ కారణంగా వెలుతురు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్రం ఆటంకం కలిగింది.
