చిన్న చిన్న వాటితోనే!అందం అంటే కేవలం మేకప్ కాదు, మన వ్యక్తిత్వం అని చెప్పే అనుపమ సినిమాల్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ సింపుల్, క్లాసీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఆ అందం వెనక ఉన్న చిన్న చిన్న రహస్యాలు మీకోసం..
జ్యూవెలరీలో నాకు సిల్వర్ ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చిన్న నెక్‌పీస్‌లు అంటే చాలా ఇష్టం! డ్రెస్ ఏదైనా, ఇలాంటి చిన్న చిన్న వాటితోనే లుక్ పూర్తవుతుంది. ఇక చర్మం కాంతిమంతంగా ఉండాలంటే నిద్ర, ఆహారం రెండూ సమతౌల్యంగా ఉండాలి. ఈ నియమాలనే నేను ఫాలో అవుతానని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్.
గోల్డ్ గ్రేస్!
చిన్న చైన్ అయినా, లుక్‌కి రాయల్టీ టచ్! అదే ఈ సింగిల్ లైన్ గోల్డ్ నెక్‌పీస్ మ్యాజిక్. ఈ సున్నితమైన గోల్డ్ చై నెక్‌లైన్‌పై మెరుస్తూ, మీ మొత్తం లుక్‌కి టైమ్‌లెస్ ఎలిగెన్స్ జోడిస్తుంది. ట్రెడిషనల్ చార్మ్‌తో పాటు, మోడర్న్ టచ్ ఉండటమే దీని ప్రత్యేకత.
ప్యూర్ గోల్డ్ ఫినిష్, సాఫ్ట్ షైన్ , మినిమల్ డిజైన్‌తో ఏ డ్రెస్సుకైనా ఈ నెక్‌పీస్ సహజంగా బ్లెండ్ అవుతుంది. దీనిని ఓపెన్ హెయిర్, లైట్ మేకప్ కాంబినేషన్‌తో పెయిర్ అప్ చేస్తే ఈ చైన్ లుక్‌కి రిచ్‌నెస్, సాఫ్ట్ గ్లామ్ టచ్ గ్యారంటీ! చిన్న డీటైల్, కానీ పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఓవర్ కాకుండా, పర్‌ఫెక్ట్‌గా మెరిసిపోతుంది!
దీపిక కొండి
(చదవండి: చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?)


