ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందా? ఇక భయపడాల్సిన పని లేదు! ఎందుకంటే, ఈ ‘హిలిటాండ్ స్మార్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ పెన్’ మీకు కొత్త భాషలు నేర్పే తెలివైన గురువులా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ పెన్ వాక్యాలు, పదాలను స్కాన్ చేసి వెంటనే మీకు కావాల్సిన భాషలోకి అనువదిస్తుంది. చదువులో, ప్రయాణంలో లేదా పరభాషా మిత్రులతో మాట్లాడే సమయంలోనూ ఇలా ఎక్కడైనా సరే దీని సహాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. చిన్నదిగా, తేలికగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. లోపలే డిజిటల్ నిఘంటువు ఉండటంతో తెలియని పదాలకు అర్థాన్ని వెంటనే చూపిస్తుంది. బటన్లు, టచ్ రెండు విధాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఎప్పుడూ రెడీగా ఉండే ఈ పెన్ ధర కేవలం రూ. 3,160 మాత్రమే!

జేబులోనే థియేటర్!
సినిమా మూడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా! కావాలంటే మీ దగ్గర ‘కోడాక్ అల్ట్రా మినీ ప్రొజెక్టర్’ తప్పక ఉండాల్సిందే! చిన్న సైజ్‌లో ఉన్నా, ఇది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ నలుపు రంగు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ వంద అంగుళాల వరకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తుంది. చిన్నది, తేలికైనది, చేతిలో సరిపోయేంత సైజ్‌లో ఉండే ఈ పరికరం లోపలే స్పీకర్ కలిగి ఉంటుంది. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ దేనితోనైనా సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చీకటి గదిలో చూస్తే రంగులు మరింత మెరిసిపోతాయి, చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వీడియోలు, ఫోటోలు ఏదైనా సరే అధిక నాణ్యతతో మీ ముందే ప్రత్యక్షం అవుతాయి. ధర రూ. 30,863 మాత్రమే!

ఖుషీ ఖుషీగా.. కుషన్!
లాంగ్ ట్రావెల్ అంటే మెడ నొప్పి, వెన్నునొప్పి గ్యారంటీ! కాని, ఇక ఆ బాధలకు ఎండ్! ది స్లీప్ కంపెనీ ట్రావెల్ కాంబో! ఈ సెట్‌లో నెక్ కుషన్, సీటు కుషన్ రెండూ లభిస్తాయి. ఇందులోని స్మార్ట్ నెక్ కుషన్ మెత్తగా మసాజ్ చేస్తూ, మెడ నొప్పిని తగ్గిస్తుంది. హీట్ థెరపీ ఉండటంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మార్ట్ సీట్ కుషన్ మీ వెన్నునొప్పికి సౌకర్యవంతమైన రిలీఫ్ ఇస్తుంది. జపాన్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ కుషన్ మీ శరీరాకారానికి సరిపడేలా ఒదిగి, ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి సరిగా ప్రసరిస్తూ చల్లగా, సౌకర్యంగా ఉంచుతుంది. ఇంట్లోనైనా, విమానంలోనైనా, కారు ప్రయాణంలోనైనా ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ పార్టనర్! తేలికైన డిజైన్‌తో తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ధర రూ. 4,198 మాత్రమే!


