ఫ్రిజ్ అంటే కేవలం చల్లగా ఉంచే పెట్టెగా మాత్రమే కాదు. ఇప్పుడది స్మార్ట్, ఫ్రెష్, ఫన్నీ అసిస్టెంట్‌గా కూడా మారింది.
రోలింగ్ ఎగ్స్!
ఫ్రిజ్ నుంచి గుడ్లను పగిలిపోకుండా బయటకు తీసేటప్పుడు పడే టెన్షన్ కోడి గుడ్డు పెట్టేటప్పుడు కూడా పడి ఉండదేమో అని అనిపిస్తుంటుంది! ఎందుకంటే, ఫ్రిజ్‌లో గుడ్లను పెట్టడం, తీయటం ఒక పెద్ద పని, పైగా వాటికి స్థలం కూడా చాలా కావాలి. ఇక ఆ కష్టాలు మర్చిపోండి! రింకిఫై ఆటోమాటిక్ ఎగ్ రోల్‌డౌన్ వచ్చింది. ఇది నాలుగు లేయర్ల ఆటోమాటిక్ రోల్‌డౌన్ సిస్టమ్, గ్రావిటీ ఫీడ్ డిజైన్‌తో వస్తుంది. అందుకే, ఒక చివరి గుడ్డు తీసుకున్న వెంటనే మరో గుడ్డు మీ ముందుకు వస్తుంది. కాబట్టి గుడ్లను తీసుకోవడం చాలా సులభం. ఇందులో ముప్పై గుడ్ల వరకు భద్రంగా నిల్వ చేస్తుంది. వర్టికల్ స్టాక్ డిజైన్ వల్ల ఫ్రిజ్‌లో స్థలం ఎక్కువ సేవ్ అవుతుంది. హై–క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారవడంతో, దీన్ని క్లీనింగ్ చేయడం కూడా సులభం. ధర: రూ. 300.
స్మార్ట్ ఫ్రిజ్!
రోజూ ఉదయాన్నే పాలు అయిపోయాయి అని ఫ్రిజ్ డోర్ తెరిస్తే కాని తెలియడం లేదా? దీంతో, ఉదయం పాలకోసం వాకింగ్ తప్పడం లేదా. బాధ పడకండి. ఇప్పుడు ఈ విషయాన్ని ఫ్రిజ్ గమనిస్తుంది. ‘బ్రో, ఉదయం కాఫీకి పాలు లేవు!’ అని ఎప్పటికప్పుడు మీకు ఫోన్‌లో నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇంకా పెరుగు, గుడ్లు, కూల్ డ్రింక్స్ అన్నీ చెక్ చేసి, ఏవి లేవో వాటన్నింటితో కలిపి షాపింగ్ జాబితాను కూడా పంపిస్తుంది. ఇలా ఫ్రిజ్ తలుపు తెరవకుండానే, లోపల ఏముందో అన్నది ఫోన్లోనే చూసుకోవచ్చు! అంతేకాదు, ఎవరు చివరి చాక్లెట్ తిన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందంటే? ఇందులో వై–ఫై, టచ్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్ ఉన్నాయి. ‘ఫ్రిజ్, కూల్ చెయ్!’ అని చెబితే అది వినేస్తుంది కూడా! వివిధ బ్రాండ్ల ఆధారంగా ధర రూ. 50,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండొచ్చు.
ఫ్రెష్.. ఫ్రెష్‌గా!
ఫ్రిజ్ తెరిస్తే కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇలా ఆకుకూరలు వాడిపోతున్నాయా? పైగా ఎప్పుడూ కొత్త ఆకులు కొనుకోవడం మర్చిపోతుంటారా? టెన్షన్ వద్దు! వేకిజ్ హెర్బ్ కీపర్ తీసుకోండి. ఎందుకంటే ఇది సాధారణ కంటైనర్ కాదు. వేకిజ్ హెర్బ్ కీపర్ ఏబీఎస్ గ్రేడ్ ప్లాస్టిక్ తో తయారైంది, స్ట్రాంగ్ అండ్ సేఫ్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏదైనా ఆకుకూర పెట్టి, కొంచెం నీరు వేసి మూత పెట్టండి అంతే! ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్ల లోపల ఏముందనేది స్పష్టంగా చూడొచ్చు. పైగా, ఎయిర్ గ్రూవ్ ఉన్న మూత వల్ల ఆకులు తడిగా, పచ్చగా, ఫ్రెష్‌గా ఉంటాయి. ప్రతి మూడు నుంచి ఐదు రోజుల్లో నీరు మార్చినపుడు, ఆకులు మూడు వారాల వరకు పచ్చగా ఉంటాయి. ధర రూ. 350.


