
ఇంట్లో కుటుంబం మొత్తానికి ఆనంద కేంద్రం టీవీ. కాని, దాని వలన ఎక్కువసార్లు సంతోషం కంటే సమస్యలే ఎదురవుతాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ఇచ్చే అద్భుతమైన గాడ్జెట్లు ఇవీ!
కామ్‌గా చూడొచ్చు!
రాత్రి హాయిగా పిల్లలు పడుకొని ఉంటే, అప్పుడే పేరెంట్స్ ‘ఇప్పుడు మనం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు’ అనుకుంటారు. కాని, టీవీలో వచ్చే ఒక్క మాస్ సీన్ సౌండ్‌తో మొత్తం ఇంటి సీనే రివర్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా, బ్లూటూత్ అడాప్టర్‌తో టీవీని హెడ్‌సెట్ సాయంతో చూడవచ్చు. దీనిని టీవీకి జత చేస్తే, ఇక మీరు ఏ హెడ్‌సెట్‌నైనా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఒకేసారి నాలుగు హెడ్‌సెట్లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు సీరియస్‌గా సీరియల్ లేదా సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాళ్లని ‘షుష్..’ అని చెప్పాల్సిన అవసరం లేదు. బటన్లతో వాల్యూమ్‌ను తక్కువ లేదా ఎక్కువ చేయడం సులభం. ధర రూ. 1,799 మాత్రమే!

అన్ని పరికరాకలకూ ఒక్కటే రిమోట్
సోఫాలో హాయిగా కూర్చుని, పక్కన స్నాక్స్ పెట్టుకుని, ఫ్యామిలీతో సినిమా చూడటానికి సిద్ధమయ్యే క్షణంలో ‘రిమోట్ ఎక్కడ?’ అనే ప్రశ్న! ఆ తర్వాత ఏసీ ఆన్ అవ్వకపోయినా, సెటప్‌బాక్స్ సిగ్నల్ రాకపోయినా, సేమ్ ప్రశ్నే రిపీట్! ఇలా పలు రకాల రిమోట్ల కోసం అవసరం లేకుండా చేస్తుంది. ‘సోఫా బటన్ ఎక్స్‌వన్ యూనివర్సల్ రిమోట్’. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్ని పరికరాల రిమోట్లకు గుడ్‌బై చెప్పేయొచ్చు. టీవీ, ఏసీ, సెటప్ బాక్స్, లైట్స్ అన్నీ ఒక్క బటన్తోనే నియంత్రించవచ్చు. వాయిస్ కంట్రోల్‌తో కూడా ఆపరేట్ చేయవచ్చు. అంటే చేతులు బిజీగా ఉన్నపుడు ‘రిమోట్, టీవీ ఆన్ చేయి’ అని చెప్తే చాలు, వెంటనే చేసేస్తుంది. ఇన్ఫ్రారెడ్ కనెక్టివిటీతో అతి తక్కువ సమయంలో సులభంగా అమర్చుకోవచ్చు. ఒకేసారి ఐదు లక్షల పరికరాల వరకు కనెక్ట్ చేసుకునే వీలుంది. ధర రూ. 3,999 మాత్రమే!

ఎక్కడినుంచైనా చూడొచ్చు!
ఇక టీవీ చూడటానికి మెడ తిప్పే రోజులు పోయాయి! వంటగదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, టీవీనే మీ వైపు తిరిగి ‘కనిపిస్తునున్నానా, ఇంకొంచెం జరగాలా?’ అంటుంది. ఇదే ‘రోబోస్టు టీవీ వాల్ మౌంట్ బ్రాకెట్’ మ్యాజిక్. గోడపై తిప్పుతూ, వంచుతూ, టీవీని మీ చూపు కోణానికి సరిపడేలా సర్దేస్తుంది. ఇక వంట చేసేటప్పుడు సీరియల్ మిస్ కానివ్వదు, క్రికెట్ స్కోర్ కూడా బాల్కనీలో కాఫీతో కలిపి చూడొచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఏ టీవీ అయినా, ఇది తన భుజాల మీద సేఫ్‌గా మోస్తుంది. మెటల్ బాడీ, తుప్పు, ధూళి భయం లేదు. ఇన్స్టాలేషన్ కూడా చాలా సులభం. ధర కేవలం రూ. 568 మాత్రమే!