ఇప్పటి తరం పిల్లలు ట్యాబ్, మొబైల్ చేతిలో పెట్టుకొని పెద్దలకంటే ముందే టెక్నాలజీని వాడేస్తున్నారు. అలాంటి డిజిటల్ యుగంలో చిన్నారులు డిజిటల్ వేదికగా సరైన విషయాలను నేర్చుకోవడానికి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ ‘లెర్న్ విత్ భీమ్’ పేరుతో కొత్తగా యాప్ విడుదల చేసింది. ఈ యాప్ పిల్లల అభ్యసనా ప్రపంచానికి సరికొత్త రంగులు అద్దుతోంది. నేటి బాలల దినోత్సవం నేపథ్యంలో ఈ యాప్ చిన్నారులకు అద్భుత వేదికగా మారింది. ఈ యాప్‌లో చోటా భీమ్, మైటీ లిటిల్ భీమ్ వంటి మనసుకు దగ్గరైన పాత్రలతో పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవచ్చు.
2 నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం రూపొందించిన ఈ యాప్ ద్వారా రంగులు, ఆకారాలు, అక్షరాలు, సంఖ్యలు మొదలైనవి సరదాగా నేర్చుకునే వీలు కల్పిస్తుంది. దీంతో పాటు గేమ్స్, పజిల్స్, కథల రూపంలో పాఠాలు అందుబాటులో ఉంచారు. దీనివల్ల పిల్లలకు ఇది పాఠశాల మాదిరిగా కాకుండా ఓ ఆటలా అనిపిస్తుందని గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు రాజీవ్ చిలకా తెలిపారు. చోటా భీమ్ ప్రపంచాన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్‌లోకి తీసుకువస్తున్నాం.
పిల్లలు భీమ్ వంటి ఫ్రెండ్లీ క్యారెక్టర్స్‌తో నేర్చుకోనున్నారు. ముఖ్యంగా వయసు ఆధారంగా లెరి్నంగ్ మాడ్యూల్స్ డిజైన్ చేసిన ఈ యాప్‌లో 2–3 ఏళ్ల పిల్లల కోసం బేసిక్ కాన్సెప్ట్స్, 4–5 ఏళ్ల పిల్లలకు లాంగ్వేజ్ – మ్యాథ్స్ బేసిక్స్, 6–7 ఏళ్ల పిల్లలకు క్రియేటివ్ యాక్టివిటీస్, 8 ఏళ్లు పైబడిన వారికి లాజిక్ పజిల్స్, క్విజ్, క్రికెట్–బాస్కెట్‌బాల్ వంటి గేమ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఎడ్యుటైన్‌మెంట్ (ఎడ్యుకేషన్–ఎంటర్‌టైన్మెంట్) దిశగా భారతీయ యానిమేషన్ ఇండస్ట్రీ ముందుకు సాగుతున్న తరుణంలో ఇదో ముందడుగు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్న ‘లెర్న్ విత్ భీమ్’ యాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌తో పాటు యాడ్–ఫ్రీ ఆప్షన్ కూడా కలిగి ఉంది. చైల్డ్–సేఫ్ డిజైన్‌తో రూపొందించిన ఈ యాప్ ద్వారా పిల్లలు సురక్షితంగా, సరదాగా నేర్చుకోవచ్చు.
(చదవండి: చిరుప్రాయంలో చిగురిస్తున్న ఆలోచనలు..!


