ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకోలేని వారంతా ఇప్పుడు, టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ మీ జ్ఞాపకాలను జాగృతం చేసే గ్యారంటీ ఇస్తున్నాయి.
చంద్రుడి వెలుగులా!
చీకట్లో బెడ్‌మీద పుస్తకం చదవాలంటే ఒకవైపు లైట్ కోసం పోరాటం, మరోవైపు ‘స్విచ్ ఆఫ్ చెయ్యి!’ అనే డిస్టర్బ్ చేసే డైలాగులు! ఇవన్నీ దూరం చేయడానికి ఇప్పుడు ఒక హీరో వచ్చేశాడు. అదే గ్లోకుసెంట్ బుక్ లైట్! చిన్నగా కనిపించే ఈ లైట్ పనిలో మాత్రం బాస్ లెవెల్! మూడు కలర్ మోడ్‌లు, ఐదు బ్రైట్‌నెస్ లెవెల్స్‌తో కళ్లకు ఇబ్బంది లేకుండా సాఫ్ట్‌గా వెలిగిస్తుంది. పుస్తకానికి క్లిప్‌లా తగిలించుకుని చీకట్లో చంద్రుడి వెలుగులో చదివేయొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎనభై గంటల వరకు నిరంతరామంగా వెలుగుతుంది. యూఎస్‌బీ రీచార్జబుల్, ఫ్లెక్సిబుల్, పోర్టబుల్, క్యూట్ పుస్తకప్రియుల రాత్రుల కోసం పర్‌ఫెక్ట్ స్నేహితుడు! దీని ధర రూ. 1,449.

మాయా ట్యాగ్!
తాళాలు ఎక్కడో, వాలెట్ ఏ సోఫా కిందో, బ్యాగ్ ఎవరో తీసుకెళ్లారో? ఇలా మీ రోజూ వివిధ వస్తువుల ‘సర్చ్ మిషన్’లా మొదలవుతుందా? ఇకపై ఏది పోయినా కంగారు పడాల్సిన పని లేదు! ఎందుకంటే నీ వస్తువులకి ఇప్పుడు బాడీగార్డ్ వచ్చేశాడు. అదే అమెజాన్ బేసిక్స్ ఏరో ట్యాగ్! ఇది మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్తుంది, అది కూడా ఒక్క బీప్‌తోనే! ఈ చిన్న తెల్ల ట్యాగ్‌లో బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, ఆపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్ సపోర్ట్, 80 డెసిబెల్స్ సౌండ్ అలర్ట్ ఉన్నాయి. వాలెట్, కీస్, బ్యాగ్ ఇలా దేనికైనా తగిలించుకొని వాడుకోవచ్చు. అవి కనిపించనప్పుడు, ఒక్కసారి ఫోనులో యాప్ ఓపెన్ చేసి బటన్ నొక్కితే చాలు, ఆ వస్తువు ఎక్కడుందో చెప్తుంది. తేలికగా ఉంటుంది, సిమ్ అవసరం లేదు, బ్యాటరీతో పనిచేస్తుంది. ధర రూ. 537 మాత్రమే!

టచ్‌తోనే తెలిసిపోతుంది
చల్లని నీళ్లు తాగాలనుకుని బాటిల్ ఓపెన్ చేస్తే లోపల మరిగిన నీరు! చేతికి వేడి, ముఖానికి షాక్! ఇక ఆ కన్ఫ్యూజన్ స్టోరీకి ఎండ్! ఎందుకంటే ఎల్‌ఈడి స్మార్ట్ టెంపరేచర్ బాటిల్ నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా ముందే చెప్తుంది. ఈ బాటిల్‌లోని డిస్‌ప్లేను టచ్ చేస్తే వెంటనే నీళ్ల ఉష్ణోగ్రత చూపిస్తుంది. చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా అన్నది సెకన్లలో బాటిల్ ఓపెన్ చేయకుండానే తెలుసుకోవచ్చు. హాట్ డ్రింక్స్‌ను పన్నెండు గంటలు, కూల్ డ్రింక్స్‌ను ఇరవై నాలుగు గంటల వరకు అదే టెంపరేచర్‌లో ఉంచుతుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ బాటిల్ తేలికగా, క్యూట్‌గా, ఫ్యాన్సీగా ఉంటుంది. ధర రూ. 295 మాత్రమే!


