ఫిన్‌టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్ తమ పబ్లిక్ ఇష్యూ (IPO) కోసం సిద్ధమైంది. ఈ ఇష్యూ నవంబర్ 7న ప్రారంభమై 11న ముగియనుంది. దీని ద్వారా కంపెనీ రూ. 2,080 కోట్లు సమీకరించనుంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద 8.23 కోట్ల షేర్లను పీక్ ఫిఫ్టీన్ పార్ట్‌నర్స్, పేపాల్, మాస్టర్‌కార్డ్ ఏషియా/పసిఫిక్, ఇన్వెస్కో మొదలైన ఇన్వెస్టర్లు, సహ వ్యవస్థాపకుడు లోక్‌వీర్ కపూర్ విక్రయించనున్నారు.
ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించి నిధులను రుణాల చెల్లింపు, ఐటీ అసెట్స్‌లో పెట్టుబడులకు, క్లౌడ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు మొదలైన వాటికి కంపెనీ వినియోగించుకోనుంది. తాజా ఇష్యూ ద్వారా కంపెనీ ముందుగా రూ. 2,600 కోట్లు సమీకరించాలని భావించింది. డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్ సేవలందించే పైన్ ల్యాబ్స్‌కి భారత్‌తో పాటు మలేషియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు ఉన్నాయి.
సెబీకి షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ ప్రాస్పెక్టస్..
లాజిస్టిక్స్ సేవల సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి అప్‌డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్ట్స్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ కింద రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మరో రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకుంటుంది.


