
ఫ్లోర్ ధర నిబంధనలను సరళీకరించిన సెబీ
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్చందంగా వైదొలగేందుకు(డీలిస్టింగ్) వెసులుబాటు కల్పిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వానికి 90 శాతం లేదా అంతకుమించి వాటా ఉన్న పీఎస్‌యూలను ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేసేందుకు వీలు చిక్కనుంది.
డీలిస్టింగ్‌కి మెజారిటీ సాధారణ వాటాదారులు అనుమతి పొందాల్సిన నిబంధనలను కూడా సెబీ సడలించింది. అలాగే, ఫ్లోర్ ధర మదింపులోనూ మార్పులకు తెరతీసింది. వెరసి ఫ్లోర్ ధరకంటే కనీసం 15 శాతం ప్రీమియంతో, ఫిక్స్‌డ్ ధర ద్వారా డీలిస్టింగ్‌కు అవకాశం ఏర్పడనుంది. ఇందుకు లావాదేవీల పరిమాణం తదితరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వానికి 90 శాతం పైగా వాటా గల పీఎస్‌యూలకు ఈ వెసులుబాటును వర్తింపచేసేలా సెపె్టంబర్ 1న సెబీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, బీమా కంపెనీలను దీన్నుంచి మినహాయించింది.
ఇన్విట్స్‌లో కనీస లాట్ తగ్గింపు
ప్రయివేట్ ప్లేస్‌మెంట్ ద్వారా ఐపీవోలో కేటాయించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) కనీస లాట్ పరిమాణాన్ని సెబీ తాజాగా కుదించింది. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ లాట్‌తో సమానం చేస్తూ రూ. 25 లక్షలకు తగ్గించింది. ఇందుకు నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రయివేట్ ప్లేస్‌మెంట్ చేసే ఇన్విట్‌లకు అసెట్ మిక్స్ ఆధారంగా కనీస లాట్ రూ. కోటి లేదా రూ. 25 కోట్లుగా అమలవుతోంది. అయితే ఇప్పటికే అసెట్ మిక్స్‌తో సంబంధంలేకుండా సెబీ సెకండరీ మార్కెట్లో లాట్ పరిమాణాన్ని రూ. 25 లక్షలకు కుదించింది. దీంతో ఐపీవో ప్లేస్‌మెంట్ లాట్‌ను అలైన్ చేసింది.
ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం