
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన ఇంకో అయిదు సంస్థలు
లిస్టులో రన్వాల్ డెవలపర్స్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్ మొదలైనవి
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్‌టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్‌వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్‌బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్‌నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్‌బోర్డులో 77 కంపెనీలు లిస్ట్‌కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్‌మెంట్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది.
రూ. 2,000 కోట్లపై కన్ను
రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది.
1,500 కోట్ల సమీకరణ ..
రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్‌తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్‌గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది.
లాల్‌బాబా ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్‌బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్‌బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్‌లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్
సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్‌హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.
జెరాయ్ ఫిట్‌నెస్
జిమ్ ఎక్విప్‌మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్‌నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్‌లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్‌మెంట్‌ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లు ఉన్నాయి.