ఎండ్‌టు ఎండ్ డిజిటైజేషన్‌పై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన చర్యలకు శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా ఎండ్‌టు ఎండ్ డిజిటైజేషన్‌కు తెరతీయాలని ప్రణాళికలు వేస్తోంది. డిజిటల్ సిగ్నేచర్‌లను వినియోగించుకోవడం ద్వారా పూర్తిగా పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ సమయాన్ని భారీగా కుదించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం నెలలపాటు కొనసాగుతున్న ప్రక్రియను రోజులలోకి తగ్గించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదేసమయంలో డేటా ప్రైవసీ ఆందోళనలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. సర్వీసుల నాణ్యతను పెంచే బాటలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్‌కు రెండో ప్లాట్‌ఫామ్‌ను సైతం తీసుకురానున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం సీడీఎస్‌ఎల్ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు కీలక పాత్రధారులని గోల్డ్‌మన్ శాక్స్ నిర్వహించిన 14వ భారత సీఐవో సదస్సు సందర్భంగా పాండే అభివరి్ణంచారు.


