
ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరికలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్(ఎస్‌ఎంపీలు) ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల సంబంధిత కుట్రపూరిత కార్యకలాపాలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. ఎస్‌ఎంపీల ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల మోసాలు అధికమయ్యాయని తెలియజేసింది. కేవలం సెబీ వద్ద రిజిస్టరైన ఇంటరీ్మడియరీల ద్వారా లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వమంటూ పబ్లిక్‌కు సూచించింది.
పెట్టుబడులు చేపట్టేందుకు అ«దీకృత ట్రేడింగ్ యాప్స్‌ను మాత్రమే వినియోగించుకోమంటూ సలహా ఇచ్చింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్(ట్విటర్), టెలిగ్రామ్, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ తదితర సుప్రసిద్ధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇటీవల మోసపూరిత సలహాలు, లావాదేవీలు అధికమైన నేపథ్యంలోసెబీ తాజా హెచ్చరికలు జారీ చేసింది.
వీటి ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆఫర్ చేస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీనిలో భాగంగా తప్పుదారి పట్టించే కాల్స్, మోసపూరిత డాక్యుమెంట్లు, తప్పనిసరిగా లేదా రిస్‌్కలేని లాభాల అక్రమ హామీలు వంటివి ఇన్వెస్టర్లకు ఎరగా వేస్తున్నట్లు వివరించింది. అంతేకాకుండా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడి సలహాలు, సెబీ నకిలీ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్లు వంటివి వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.
మరికొన్ని సందర్భాలలో సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్స్ పేరిట మోసాలకు తెరతీస్తూ అధిక రిటర్నుల ఆశ చూపుతూ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ప్రయతి్నస్తున్నట్లు వివరించింది. ఇందుకు వాట్సాప్, టెలిగ్రామ్ చానళ్లలో తప్పుడు గ్రూప్‌లను సైతం సృష్టించడం ద్వారా మోసపుచ్చుతున్నట్లు పేర్కొంది. వెరసి నకిలీ సలహాదారులపట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి సెబీ హెచ్చరించింది!