
ఇన్సూరెన్స్ టెక్నాలజీ సంస్థ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ప్రీ–ఫైలింగ్ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా తదితర సంస్థలు ఈ ఇష్యూకి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.
2015లో ధీరేంద్ర మాహ్యవంశి, ఆనంద్ ప్రభుదేశాయ్ కలిసి టర్టిల్‌మింట్‌ను ప్రారంభించారు. బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణ ప్రక్రియను సరళతరం చేసే లక్ష్యంతో కంపెనీ ఏర్పాటైంది. అయిదు లక్షల మంది పైగా అడ్వైజర్లతో సంస్థ దాదాపు 1.6 కోట్ల పాలసీలను విక్రయించింది. ఇందులో అమాన్సా క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ మొదలైన సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి.
రూ. 499 కోట్ల సుప్రీత్ కెమికల్స్ ఐపీవో
సుప్రీత్ కెమికల్స్ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 499 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 310 కోట్లను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, మరో రూ. 65 కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లింపునకు సంస్థ వినియోగించుకోనుంది. 2025 మార్చి ఆఖరు నాటికి కంపెనీ మొతత్తం రుణభారం రూ. 200 కోట్లుగా ఉంది. ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్ ద్వారా సుప్రీత్ కెమికల్స్ రూ. 99 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అలా సమీకరిస్తే తాజా షేర్ల జారీ తగ్గుతుంది.
గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుప్రీత్ కెమికల్స్ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్ ఇంటరీ్మడియట్స్‌ను తయారు చేస్తోంది. టెక్స్‌టైల్స్, ఫార్మా, ఆగ్రో–కెమికల్స్ తదితర పరిశ్రమలకు అవసరమయ్యే ఉత్పత్తులను అందిస్తోంది. 2024లో 1,309 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ స్పెషాలిటీ కెమికల్స్ ఇంటరీ్మడియట్స్ మార్కెట్ 2029 నాటికి 1,802 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.