
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్‌లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్‌లను ఫైల్ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.
దీనిపై సహాయం కోసం ఎన్‌ఎస్‌ఈని సంప్రదించవచ్చని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 266 0050కి కాల్ చేయొచ్చని (ఐవీఆర్ ఆప్షన్ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్‌బీఎల్ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే.