
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ మరోసారి పబ్లిక్ ఇష్యూకి రానుంది. ప్రాప్‌షేర్ టైటానియా కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. దేశీయంగా తొలి చిన్న, మధ్యతరహా(ఎస్‌ఎం) రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్)గా లిస్టయిన ప్రాపర్టీ షేర్ రెండో ఎస్‌ఎం రీట్ ఐపీవో చేపట్టనుంది.
ఇష్యూలో భాగంగా ప్రాప్õÙర్ టైటానియా రూ. 472 కోట్ల విలువైన యూనిట్లను తాజాగా జారీ చేయనుంది. టైటానియా ముంబైలోని జీ కార్ప్ టెక్ పార్క్‌లో 4,37,973 చదరపు అడుగుల గ్రేడ్–ఏ ఆఫీస్ సౌకర్యాలను కలిగి ఉంది. డిసెంబర్‌లో ప్రాప్õÙర్ ప్లాటినా ఐపీవో ద్వారా ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ రూ. 353 కోట్లు సమీకరించింది. ఇది తొలి ఎస్‌ఎం రీట్ పథకంకాగా.. రూ. 50–500 కోట్ల మధ్య విలువైన ఆస్తులుగల సంస్థలకు సెబీ ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. కాగా.. యూనిట్స్ బీఎస్‌ఈలో లిస్ట్‌కానున్నాయి.