సెబీ నిబంధనల్లో వెసులుబాటు | SEBI Allows Liquid Mutual Funds For IA RA Deposits, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సెబీ నిబంధనల్లో వెసులుబాటు

Jun 22 2025 1:03 PM | Updated on Jun 22 2025 3:47 PM

Sebi Allows Liquid Mutual Funds for IA RA Deposits

పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులకు (ఆర్‌ఏలు) సెబీ నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది. తమ డిపాజిట్‌ అవసరాలకు అనుగుణంగా వారు ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్‌డీలకు అదనంగా లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్, ఓవర్‌నైట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సైతం సెబీ అనుమతించింది.

ఏదేనీ షెడ్యూల్డ్‌ బ్యాంకులో ఎఫ్‌డీ చేసి, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ సూపర్‌వైజరీ బాడీ (ఏఎస్‌బీ) పేరిట లీన్‌మార్క్‌డ్‌ (హక్కులు కల్పించడం) చేయాల్సి వచ్చేది. ఎఫ్‌డీ ఖాతాల ప్రారంభం విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు సెబీ దృష్టికి తీసుకెళ్లారు.ఎఫ్‌డీకి ప్రత్యామ్నాయంగా ఏఎస్‌బీకి అనుకూలంగా మార్క్ చేసిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కూడా అనుమతించవచ్చని వారు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సెబీ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదనను ఆమోదించిన సెబీ బోర్డు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లను తక్కువ రిస్క్, తక్కువ అస్థిర సాధనాలుగా పరిగణించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ పై కూడా లైను మార్క్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై లీన్ నిర్వహణ, లీన్ అమలు సెక్యూరిటీస్ మార్కెట్ ఎకోసిస్టమ్ పరిధిలోనే ఉందని, ఇది మరింత సమర్థతను తీసుకువస్తుందని సెబీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement