
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా యూఎస్ ప్రొప్రయిటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. తద్వారా సెక్యూరిటీస్ మార్కెట్లో తిరిగి లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతించింది. ఎఫ్‌అండ్‌వో లావాదేవీల్లో మార్కెట్ మ్యానిప్యులేషన్‌కు పాల్పడిందంటూ ఈ నెల 3న జారీ చేసిన మధ్యంతర ఆదేశాలలో జేన్ స్ట్రీట్‌పై సెబీ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: టైర్.. రయ్ రయ్!
నిషేధం విధించిన సమయంలో దాదాపు రూ.4,843 కోట్ల జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. అయితే సెబీ సూచించిన విధంగా ఎస్క్రో ఖాతాలో గత వారమే జేన్ స్ట్రీట్ రూ.4,843 కోట్లకుపైగా జమ చేయడంతో తాజాగా సెబీ నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా.. ఇకపై అక్రమంగా లేదా మ్యానిప్యులేటివ్‌గా లేదా మోసపూరితంగా లావాదేవీలు చేపడితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చర్యలు తీసుకోనున్నట్లు సెబీ హెచ్చరించింది.