
సెబీ తాజా అనుమతులు
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ) ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తృతపరిచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎస్‌ఎస్‌ఈ ద్వారా నిధుల సమీకరణకు మరిన్ని చారిటబుల్ ట్రస్ట్‌లను అనుమతించనుంది. ఈ బాటలో లిస్టింగ్ పరిధిని పెంచుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందుకు లాభాపేక్షలేని సంస్థ(ఎన్‌పీవో)ల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. దీంతో ఎస్‌ఎస్‌ఈ లిస్టింగ్ పరిధిలోకి మరిన్ని సంస్థలు చేరనున్నాయి.
ఇందుకు అనుగుణంగా 1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం, సంబంధిత రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1956 కంపెనీల చట్టంలో భాగంగా సెక్షన్ 25కింద రిజిస్టరైన కంపెనీలను తాజా మార్గదర్శకాలలోకి చేర్చింది. అయితే ఈ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతూ సంబంధిత నిబంధనలను సైతం ప్రకటించింది. ఎలాంటి సెక్యూరిటీలను లిస్ట్‌చేయని ఎన్‌పీవోలు ఏఐఆర్ నివేదికను సొంతంగా రూపొందించి దాఖలు చేయవలసి ఉంటుంది. తద్వారా ఎన్‌పీవో ప్రధాన కార్యకలాపాలతోపాటు ఏడాది పొడవునా చేపట్టిన ప్రోగ్రామ్‌లు, మధ్యవర్తిత్వాలు, ప్రాజెక్టులను వివరణలతో తెలియజేయవలసి ఉంటుంది. ఆయా సంస్థల ప్రాధాన్యతను గుర్తించేలా వీటిని రూపొందించవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!