హీరో ఫిన్‌కార్ప్‌ ఐపీవోకు వచ్చేస్తోంది.. | Hero FinCorp Gets SEBI Nod for Rs 3668 Crore IPO | Sakshi
Sakshi News home page

హీరో ఫిన్‌కార్ప్‌ ఐపీవోకు వచ్చేస్తోంది..

May 29 2025 7:13 AM | Updated on May 29 2025 7:20 AM

Hero FinCorp Gets SEBI Nod for Rs 3668 Crore IPO

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం హీరో ఫిన్‌కార్ప్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.

వీటికి జతగా మరో రూ. 1,568 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 3,668 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. లిస్టింగ్‌కు వీలుగా 2024 ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది.

ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్‌ మూలధన అవసరాలకు ఎన్‌బీఎఫ్‌సీ హీరో ఫిన్‌కార్ప్‌ వినియోగించనుంది. తద్వారా రుణ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 2024 మార్చికల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 51,281 కోట్లుగా నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement