
సెబీ ఎస్క్రో ఖాతాలో డిపాజిట్
న్యూఢిల్లీ: యూఎస్ హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తాజాగా సెబీ పేరున ఎస్క్రో ఖాతాలో దాదాపు రూ. 4,844 కోట్లు డిపాజిట్ చేసింది. దీంతో సంస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని అభ్యరి్థంచింది. మార్కెట్ మ్యానిప్యులేషన్ ద్వారా భారీ ఆర్జనకు తెరతీసిందన్న ఆరోపణలతో జేన్ స్ట్రీట్‌పై సెబీ కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ. 4,843.57 కోట్లు జమ చేయవలసిందిగా ఆదేశించింది.
ఈ నేపథ్యంలో జేన్స్ స్ట్రీట్ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎఫ్‌అండ్‌వో, నగదు విభాగాలలో పొజిషన్లు తీసుకోవడం ద్వారా జేన్ స్ట్రీట్ ఇండెక్సులను మ్యానిప్యులేట్ చేసిందని, తద్వారా భారీగా సంపాదించిందని ఈ నెల 3న జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలలో సెబీ పేర్కొంది. 2023 జనవరి– 2025 మే నెల మధ్య రూ. 36,671 కోట్లు ఆర్జించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. ఫలితంగా హెడ్జ్ ఫండ్‌ను మార్కెట్ కార్యకలాపాల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది.