
ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీ స్టీమ్‌హౌస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500–700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. మెయిన్‌బోర్డులో లిస్టింగ్‌పై కన్నేసిన కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించింది. 2014లో ఏర్పాటైన సంజూ గ్రూప్ కంపెనీ సూరత్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు విస్తరించింది. 167 క్లయింట్లకు సర్వీసులు అందిస్తోంది.
ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’
పిరానా, దహేజ్ సెజ్‌సహా.. వపీ, అంకలేశ్వర్, నందెశారీ, పనోలీ ఫేజ్–2, 3లలో విస్తరణ చేపట్టింది. ఈ బాటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా, రాజస్తాన్‌లలోనూ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. 2023–24లో రూ. 292 కోట్ల ఆదాయం, రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల రహస్య పద్ధతిలో ఫైలింగ్‌కు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా క్యాపిటల్, ఫిజిక్స్‌వాలా, ఇమేజిన్ మార్కెటింగ్(బోట్)తోపాటు.. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్‌రాకెట్ ఇదే బాటలో సాగాయి. 2024 చివర్లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి.