
రూ. 450 కోట్ల నిధుల సమీకరణ
ముంబై: విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ విభాగం ఇండిగో వెంచర్స్ తొలి ఫండ్ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతితో గతేడాది ఆగస్ట్‌లో రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యంగా తొలిసారి ఫండ్‌కు తెరతీసింది. తొలి దశలో రూ. 450 కోట్లు సమకూర్చుకున్నట్లు ఇండిగో వెంచర్స్ తెలియజేసింది.
కాగా.. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఏరోస్పేస్ స్టార్టప్ జే ఏరోస్పేస్‌లో తొలి పెట్టుబడికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. నిధులను అడ్వాన్స్‌డ్ డిజిటల్ తయారీ మౌలికసదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపు(ప్రొడక్షన్ ఆప్టమైజేషన్), సరఫరా చైన్ వ్యవస్థలను ఏకంచేసే ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ నిపుణులను ఆకట్టుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ఇండిగో వెంచర్స్ వివరించింది. విమానయానం, తత్సంబంధిత రంగాలలో స్టార్టప్‌లకు ప్రాథమిక దశలో పెట్టుబడులను సమకూర్చేందుకు ఇండిగో వెంచర్స్ ఫండ్‌కు తెరతీసింది.
బీఎస్‌ఈలో ఇండిగో షేరు 0.8 శాతం బలపడి రూ. 5,847 వద్ద ముగిసింది.