
ఫస్ట్‌టైమ్ ఫండ్ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు.
అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు.