
ఎడ్‌టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్‌వాలా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి తాజా ముసాయిదా పత్రాలను అందించింది. రూ. 3,820 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ తొలుత 2025 మార్చిలో గోప్యతా విధానంలో సెబీకి దరఖాస్తు చేసింది.
దీనిలో భాగంగా మరోసారి అప్‌డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికితోడు మరో రూ. 720 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లు అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ విడిగా రూ. 360 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు.
ప్రస్తుతం కంపెనీలో ఇరువురుకీ విడిగా 40.35 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 461 కోట్లు ఆఫ్‌లైన్, హైబ్రిడ్ సెంటర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 548 కోట్లు ప్రస్తుత కేంద్రాల లీజ్ చెల్లింపులకు వినియోగించనుంది.