
అదానీ గ్రూప్ స్టాక్‌లు ఈ రోజు మార్కెట్ సెషన్ ప్రారంభం నుంచి భారీగా పుంజుకున్నాయి. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతోపాటు అదానీ పోర్ట్స్, అదానీ పవర్ వంటి గ్రూప్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొట్టిపారేయడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
నేటి మార్కెట్ ప్రారంభ సెషన్ నుంచి అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం లాభపడింది.
అదానీ ఎంటర్ ప్రైజెస్ 4.3 శాతం లాభపడింది.
అదానీ పవర్ 7.4 శాతం పెరిగింది.
అదానీ పోర్ట్స్ 2 శాతం పుంజుకుంది.
అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పెరిగాయి.
జనవరి 2023లో హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ సంస్థలు డబ్బు మళ్లించడానికి మూడు కంపెనీలు - అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్, రెహ్వార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను ఉపయోగించిందని ఆరోపించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.
ఇదీ చదవండి: ఇండియా ఏఐ మిషన్‌లోకి ఎనిమిది కంపెనీలు