Hindenburg
-
బెదిరింపులకు భయపడి మూసేయలేదు
న్యూఢిల్లీ: దిగ్గజ కార్పొరేట్ సంస్థలపై సంచలన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్(Hindenburg) మూసివేతపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ మరోసారి పెదవి విప్పారు. ఎవరి బెదిరింపులకో లేదంటే కేసులకో భయపడి సంస్థను మూసేయలేదని, పని భారం కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.అదానీ(Adani) గ్రూప్‌తో సహా పలు సంస్థలపై తాము ఇచ్చిన రిపోర్టులన్నింటికీ కట్టుబడి ఉన్నామని కూడా పేర్కొన్నారు. అదానీపై పలు మీడియా రిపోర్టుల్లో లేవనెత్తిన ఆరోపణల ఫలితంగానే తాము ఆ గ్రూప్‌నకు సంబంధించి ‘కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని’ వెలికితీశామని ఆయన చెప్పారు. కాగా, రిపోర్ట్‌లో పేర్కొన్న ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్ ఏర్పాటు చేస్తే సపోర్ట్ చేస్తా... భారత్ వ్యతిరేక శక్తులైన ఓసీసీఆర్పీ, జార్జ్ సోరోస్ వంటి గ్రూపులతో హిండెన్‌బర్గ్‌కు లింకులు అంటగట్టేందుకు కొంతమంది చేసిన ప్రయత్నాలపై స్పందిస్తూ.. అదో ‘పనికిమాలిక కుట్ర’గా అభివర్ణించారు. అలాంటి తెలివితక్కువ కుట్ర సిద్ధాంతాలకు మరింత ఆజ్యం పోయకూడదనే.. తమ సంస్థ వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవల సంస్థగా ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన హిండెన్‌బర్గ్... ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థల్లోని లొసుగులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదికలు రాజకీయంగా, కార్పొరేట్ ప్రపంచంలో దుమారం సృష్టించడం తెలిసిందే.కాగా, ట్రంప్ పగ్గాలు చేపట్టనున్న తరుణంలో సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించి ఆండర్సన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రంప్ సర్కారుకు భయపడే ఆయన మూసివేత నిర్ణయం తీసుకున్నారన్న గుసగుసలు వినిపించాయి. కంపెనీ పగ్గాలు వేరెవరికైనా అప్పగించకుండా ఎందుకు మూసేయాల్సి వచి్చందన్న ప్రశ్న కు ‘ఆ బ్రాండ్ నుండి నన్ను ఎవరూ వేరు చేయలేరు. హిండెన్‌బర్గ్ అనే పేరు నాతో పెనవేసుకుపోయింది. ఎవరికైనా అమ్మేయడానికి అది సాఫ్ట్వేర్ అప్లికేషన్, సైకిళ్ల ఫ్యాక్టరీ కాదు. నా టీమ్ కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తానంటే తప్పకుండా మద్దతిస్తా. వారు ఆ పని చేస్తారనే అనుకుంటున్నా’ అని ఆండర్సన్ వ్యాఖ్యానించారు. -
హిండెన్ బర్గ్ సంస్థ మూసివేత.. ఫౌండర్ నాథన్ అండర్సన్ ప్రకటన
-
హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసం చేసిందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. -
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి గుడ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల సమయంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రమోటర్ల షేర్ల తనఖా తగ్గడంతోపాటు.. లెవరేజ్ కనిష్టస్థాయికి చేరినట్లు యూఎస్ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. గత రెండేళ్ల కాలంలో గ్రూప్ లెవరేజ్, షేర్ల తనఖా, రుణ చెల్లింపులు, బిజినెస్ విలువలు తదితరాల విశ్లేషణతో నివేదికను విడుదల చేసింది. కాగా.. 2023 జనవరిలో అదానీ ఖాతాలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన కారణంగా గ్రూప్ కంపెనీలోని పలు షేర్లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. తదుపరి అదానీ గ్రూప్ వీటిని ఆధార రహితాలుగా కొట్టిపారేసింది. దీంతో తిరిగి గ్రూప్ కంపెనీలు బలపడటంతోపాటు నిధులను సైతం సమీకరించగలిగాయి.ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే రిసు్కలు తగ్గినట్లు బెర్న్‌స్టీన్ అభిప్రాయపడింది. కాగా.. గత నెల 21న యూఎస్ అధికారికవర్గాలు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సంబంధిత ఉన్నతాఅధికారులపై లంచాల ఆరోపణలు చేసింది. వీటిని సైతం అదానీ గ్రూప్ తోసిపుచి్చంది. -
ప్రతి దాడీ బలోపేతం చేస్తుంది
జైపూర్: అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికాలో దాఖలైన అభియోగాలపై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. చట్టాలు, నిబంధనల అమలుకు తమ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి దాడీ తమను మరింత బలోపేతమే చేస్తుందన్నారు. ఆయన శనివారం ఇక్కడ 51వ జెమ్స్, జువెల్లరీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘నిబంధనల అమలుకు సంబంధించి ఇటీవలే అమెరికా నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం మాకిది మొదటిసారేమీ కాదు. ప్రతి దాడీ మమ్మల్ని మరింత బలోపేతమే చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి మీడియాలో మాపై పుంఖానుపుంఖాలుగా వివక్ష, విద్వేషపూరిత కథనాలు వచ్చాయి. ఇంతా చేస్తే మా సంస్థకు సంబంధించిన వారెవరిపైనా అమెరికాలో ఎఫ్‌సీపీఏ చట్టాలను ఉల్లంఘించినట్టు గానీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోజూసినట్టు గానీ ఒక్క అభియోగమూ నమోదు కాలేదు’’ అని అదానీ గుర్తు చేశారు. నియంత్రణ సంస్థల నియమ నిబంధనలన్నింటికీ కట్టుబడి ఉండటంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ‘‘నేటి సమాజంలో వాస్తవాల కంటే పుకార్లే వేగంగా వ్యాపిస్తాయి. ఇన్నేళ్లలో అదానీ గ్రూప్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రంగాల్లో మార్గదర్శకంగా నిలిచినందుకు మేం చెల్లించిన మూల్యమది. ఆ సవాళ్లే మమ్మల్ని తీర్చిదిద్దాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే వస్తున్నాం. సవాళ్లను తట్టుకుని నిలుస్తూ కొత్త దారి వెదుక్కుంటూ ధైర్యంగా సాగడమే మాకు తెలుసు’’ అని అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా చర్యలు తమ గ్రూప్‌పై గతేడాది హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కూడా అదానీ తోసిపుచ్చారు. ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘మాపై హిండెన్‌బర్గ్ చేసింది ఆరోపణలు నిజానికి మా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయడంతో పాటు సంస్థను రాజకీయ వివాదంలోకి కూడా లాగేందుకు చేసిన భారీ కుట్ర. ఆ ఆరోపణలను ఒక వర్గం మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చేసింది. అంతటి సంక్షోభంలో కూడా మేం విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. అదే ఏడాది సంస్థను ఆర్థికంగా సమున్నత శిఖరాలకు చేర్చి తలెత్తుకు నిలిచాం. మేం ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చివరికి సుప్రీంకోర్టే తేల్చింది’’ అని చెప్పారు. -
ఒకేరోజు అదానీ షేర్ల నష్టం రూ.2.6 లక్షల కోట్లు!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దాంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన సమయం నుంచి కేవలం అదానీ గ్రూప్ లిస్ట్‌డ్ కంపెనీల నుంచే దాదాపు రూ.2.6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతిషేరు సుమారు 20 శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. దాంతో అదానీ గ్రూప్ సంస్థల సంపద రూ.12.3 లక్షల కోట్లకు చేరినట్లు తెలిసింది.ఏయే కంపెనీలు ఎంతే నష్టపోయాయంటే..అదానీ ఎంటర్ప్రైజెస్: 20 శాతంఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్: 20 శాతంఅదానీ గ్రీన్ ఎనర్జీ: 18 శాతంఅదానీ పవర్: 14 శాతంఅదానీ టోటల్ గ్యాస్: 14 శాతంఅంబుజా సిమెంట్స్: 18 శాతంఏసీసీ: 15 శాతంఅదానీ విల్మార్: 10 శాతంఎన్డీటీవీ: 14 శాతంసంఘీ ఇండస్ట్రీస్: 6 శాతంఅసలు కేసేంటి?20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల(రూ.16,890 కోట్లు) లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇవ్వచూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్‌ల్లో అమెరికా ఇన్వెస్టరల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు.డాలర్ డినామినేటెడ్ బాండ్లపై అదానీ ప్రకటనఅమెరికా కేసు అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్‌లో ముందుకువెళ్లకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం ఎక్స్ఛేంజీలకు ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, యూఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజీ కమిషన్(ఎస్ఈసీ)లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు చేశాయి. కాబట్టి ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. ఈ ఆఫర్ విలువ సుమారు రూ.3,960 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు‘అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే సహించబోం’ఈ వ్యవహారంపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందించారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్ట్‌ల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఈ అంశంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ కేసును ఎఫ్‌బీఐ న్యూయార్క్ కార్పొరేట్, సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దర్యాప్తు చేస్తున్నాయి. -
సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు
సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పనితీరుపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. 2017-23 మధ్యకాలంలో రూ.36.9 కోట్ల విలువైన లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఆమె సంస్థ పూర్తికాల డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత ఈ వ్యవహారం జరిగిందని చెప్పారు. ఇది సెబీ నిబంధనలను బేఖాతరు చేయడమేనన్నారు. మాధబి సెబీ నియమాలను ఉల్లంఘించడంతోపాటు చైనీస్ ఫండ్ల్లో పెట్టుబడులు, విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.‘2017-21 సంవత్సరాల మధ్య మాధబి పురీ బచ్‌కి విదేశీ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మొదటిసారిగా ఆమె ఏ ప్రభుత్వ సంస్థకు ఎప్పుడు తెలియజేసిందో ప్రకటించాలి. సింగపూర్‌లోని అగోరా పార్ట్‌నర్స్‌తో మాధబి బ్యాంక్ అకౌంట్‌పై సంతకం చేసింది నిజమో కాదో చెప్పాలి. వాన్గార్డ్ టోటల్ స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్, ఏఆర్కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్, గ్లోబల్ ఎక్స్ ఎంఎస్సీఐ చైనా కన్స్యూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌ల్లో ఈమె పెట్టుబడులు పెట్టారు. సెబీ ఛైర్పర్సన్ స్థాయిలో ఉన్న వ్యక్తి చైనాలో పెట్టుబడులు పెట్టడం నిజంగా ఆందోళనకరం’ అని చెప్పారు. భారత్, చైనా సంబంధాలపై స్పందిస్తూ చైనా ఉత్పత్తులను వాడకూడదని ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాని చైనా నుంచి పీఎం కేర్స్ విభాగం ఎందుకు నిధులు పొందుతోందో చెప్పాలన్నారు.అదానీ కంపెనీలో పెట్టుబడులుసింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని ఇటీవల హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.ఇదీ చదవండి: ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగంఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు. -
అవన్నీ అబద్దాలే.. హిండెన్‌బర్గ్ ఆరోపణపై అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న 310 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను స్విస్ అధికారులు స్తంభింపజేసారని ఆరోపించింది. ఈ ఆరోపణలను నిరాధారమని సంస్థ తిరస్కరించింది.స్విస్ కోర్టు విచారణలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, అలాగే కంపెనీ ఖాతాలు ఏ అధికారం ద్వారా సీక్వెస్ట్రేషన్‌కు గురికాలేదని అదానీ గ్రూప్ పేర్కొంది. తమ మార్కెట్ విలువను తగ్గించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించింది. మా విదేశీ హోల్డింగ్ నిర్మాణం పారదర్శకంగా, పూర్తిగా బహిర్గతం జరుగుతోంది. అంతే కాకుండా సంస్థ సంబంధిత చట్టాలకు అనుగుణంగా ఉందని వివరించింది.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్దాలనీ.. అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇది మా పరువును, మార్కెట్ విలువను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని వివరించింది.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలుఅదానీ గ్రూప్పైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జనవరిలో కూడా 106 పేజీల నివేదికలను విడుదల చేసి.. అదానీ గ్రూప్‌లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ భారీగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో అదానీ సంపద ఏకంగా 60 బిలియన్ డాలర్ల వరకు తగ్గిపోయింది. ఆ తరువాత కంపెనీ షేర్స్ క్రమంగా పెరిగాయి.Swiss authorities have frozen more than $310 million in funds across multiple Swiss bank accounts as part of a money laundering and securities forgery investigation into Adani, dating back as early as 2021.Prosecutors detailed how an Adani frontman invested in opaque…— Hindenburg Research (@HindenburgRes) September 12, 2024 -
సెబీ చైర్మన్‌ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) విచారణకు ఆమోదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పీఏసీ ఈ నెలాఖరులో సెబీ పనితీరును సమీక్షించనుందని చెప్పారు.ఆగస్టు 29న జరిగిన పీఏసీ ప్యానెల్ సమావేశంలో సెబీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలకు అనుగుణంగా సంస్థ పనితీరుపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. దాంతో కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే పీఏసీకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నాయకత్వం వహించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్డీఏ పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటారు.పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరుపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ క్షణమైనా విచారణ జరిపే అధికారం కలిగి ఉంది. అందుకోసం ఆయా సంస్థలకు ముందుగా సమాచారం అందించాల్సిన అవసరం ఉండదు. సెబీ కూడా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థ. పీఏసీ తన తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ 10న నిర్వహించనుంది. ఆ తేదీన సెబీ విచారణ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సెబీ చీఫ్ పనితీరుపై ఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’అదానీ కంపెనీలో పెట్టుబడులుఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. -
పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురీ బుచ్ పనితీరుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పని సమయాల్లో కిందిస్థాయి సిబ్బందితో పరుష పదజాలాన్ని వాడుతున్నారని, అవాస్తవ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని సెబీ అధికారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు.అందులో 500 మంది ‘గ్రీవెన్స్ ఆఫ్ సెబీ ఆఫీసర్స్-ఎ కాల్ ఫర్ రెస్పెక్ట్’ అనే శీర్షికతో రాసిన ఫిర్యాదు లేఖపై సంతకం చేసినట్లు తెలిసింది. స్నేహపూర్వక విధానాలు, పని సమయంలో వేధింపుల వంటి అంశాలపై సెబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ఇది తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని లేఖలో తెలిపారు. సెబీ ఉన్నతాధికారులకు గతంలో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు అధికారులు పేర్కొన్నారు. పని సామర్థ్యాన్ని పెంచే పేరుతో మేనేజ్మెంట్ వ్యవస్థలను సమూలంగా మార్చేసి తిరోగమన విధానాలను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. దాంతో సంస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు.ఈ ఏడాదికి సంబంధించి ‘కీ రిజల్ట్ ఏరియా(కేఆర్ఏ)’ లక్ష్యాలను మేనేజ్మెంట్ 20-50% పెంచిందని లేఖలో తెలిపారు. డిసెంబర్ నాటికి ఉద్యోగులు ఆ లక్ష్యాలను సాధించాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి దరిదాపుల్లో కూడా లేదని, దాంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సెబీ మెయిల్ ద్వారా స్పందించింది. ఉద్యోగులతో ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. చాలా సంప్రదింపుల తర్వాత కేఆర్‌ఏలను రూపొందించామని కొందరు అధికారులు తెలిపారు. ఉద్యోగులు సమస్యను లేవనెత్తిన తర్వాత అన్ని విభాగాలతో సమీక్షించామన్నారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల్లో చిన్న సర్దుబాట్లు జరిగాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదంఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
సెబీ చీఫ్‌పై కేంద్రం దర్యాప్తు..?
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్ర ఆర్థికశాఖ దర్యాప్తు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఈ సంఘంలో సెబీ ప్రతినిధులు సైతం ఉండబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో సెబీ చీఫ్ మాధబి, ఆమె భర్త పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!ఇదిలాఉండగా, సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగడంతో సెబీ తాజాగా దర్యాప్తునకు ఆమోదిస్తున్నట్లు సమాచారం. -
రాహుల్.. అదానీపై రేవంత్‌ను డిమాండ్ చేస్తారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో సెబీపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదానీ దేశానికి తప్పు అయితే.. తెలంగాణకు ఎలా కరెక్ట్ అని ప్రశ్నించారు.కాగా, ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఆగస్టు 22న అదానీ-సెబీ బంధంపై హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చినందున కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చినందుకు సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెండు విధాల ధోరణి అవలంబించటాన్ని మేము గమనిస్తున్నాం. Glad that the Congress had called for a nationwide protest in light of Hindenburg Report on Adani-SEBI nexus on Aug 22, but we at BRS see through their double standardsIf Adani is wrong for India, why and how is he right for Telangana? Will @RahulGandhi demand CM Revanth…— KTR (@KTRBRS) August 13, 2024 అదానీ భారతదేశానికి తప్పు అయితే, తెలంగాణకు ఎందుకు, ఎలా సరైనది?. అదానీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తారా?. ఇది కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కానీ.. నమ్మకం గురించి కాదా?. తెలంగాణ భవిష్యత్‌కు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. మరి కాంగ్రెస్ నిలుస్తుందా? అని ప్రశ్నించారు. -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. దేశమంతటికీ విస్తరించిన ఆందోళనలు..
-
హిండెన్‌బర్గ్ వివాదం.. ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ తాజా నివేదికకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, దాని చైర్పర్సన్ మాధవీ పురీ బుచ్ ఇప్పటికే ప్రకటనలు చేశారని, దీనిపై తాము చెప్పడానికి ఇంకేమీ లేదని ఆర్థిక శాఖ సోమవారం పేర్కొంది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ డొల్ల కంపెనీల్లో సెబీ చీఫ్, ఆమె భర్త ధవళ్ బుచ్‌కు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఇది పూర్తిగా నిరాధారమని, తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కోసం ఇలాంటి అవాస్తవ నివేదికను హిండెన్‌బర్గ్ ఇచి్చందని బుచ్ దంపతులు ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెబీ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలన్నింటినీ సెబీ చీఫ్ వెల్లడించారని స్పష్టం చేసింది. ‘సెబీతో పాటు చైర్పర్సన్ కూడా ఇప్పటికే స్పష్టంగా ప్రకటనలు చేశారు. ఈ ఉందంతపై ప్రభుత్వం చెప్పడానికేమీ లేదు’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యాఖ్యానించారు. కాగా, అదానీ గ్రూప్ కూడా ఈ నివేదిక దురుద్దేశపూరితమని, సెబీ చీఫ్‌తో తమకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని ఖండించింది.బచ్‌కు రీట్స్ అసోసియేషన్ మద్దతుహిండెన్బర్గ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ బుచ్‌కు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్స్), ఆల్టర్నేట్ క్యాపిటల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పరిశ్రమ చాంబర్లు మద్దతుగా నిలిచాయి. కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా సెబీ రీట్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు ‘నిరాధారం, తప్పుదోవ పట్టించేవి’గా ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) పేర్కొంది. ఈ కఠిన పరిస్థితు ల్లో తాము సెబీ చీఫ్ బుచ్ వెన్నంటే ఉన్నామని, మార్కె ట్ సమగ్రత, నియంత్రణపరమైన నియమావళి, ఇన్వెస్టర్ల రక్షణ విషయంలో సెబీ తిరుగులేని నిబద్ధతను కనబరిచిందని ఇండియన్ వెంచర్, ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసో సియేషన్ (ఐవీసీఏ) తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ చాంబర్ యాంఫీ కూడా ఇప్పటికే బుచ్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పు చేయలేదని నిరూపించుకోవాలి: హిండెన్‌బర్గ్ సెబీ చీఫ్ బుచ్‌పై హిండెన్‌బర్గ్ తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. సెబీ పదవిలో కొనసాగుతున్న సమయంలో కూడా అదానీతో లింకులున్న ఫండ్స్‌లో వాటాలను కలిగి ఉండటంపై తాను ఎలాంటి తప్పు చేయలేదని బుచ్ నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తమపై హిండెన్‌బర్గ్ కావాలనే బురదజల్లుతోందని, సెబీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఇలా రాద్ధాంతం చేస్తోందని బుచ్ ఈ ఆరోపణలను తిప్పికొట్టిన నేపథ్యంలో హిండెన్‌బర్గ్ ఇలా స్పందించింది. ‘బెర్ముడా/మారిషస్ విదేశీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని బుచ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, సంబంధిత ఫండ్‌ను తన భర్త చిన్ననాటి స్నేహితుడు నిర్వహించారని, దానిలో వినోద్ అదానీ అప్పుడు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు’ అని కూడా హిండెన్‌బర్గ్ పేర్కొంది. -
అదానీపై దర్యాప్తు సీబీఐకి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు షేర్ల అవకతవకలపై దర్యాప్తును సెబీ నుంచి సీబీఐకి లేదా సిట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ సోమవారం సుప్రీంకోర్టును కోరింది. లేదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ‘‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలి. ‘మోదానీ (మోదీ + అదానీ) మెగా కుంభకోణం’పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘అదానీపై దర్యాప్తును రెండు నెలల్లో ముగించాలని సుప్రీంకోర్టు 2023 మార్చి 3న ఆదేశాలు ఇచ్చింది. కానీ 18 నెలలు గడిచినా కొలిక్కి రాలేదు’’ అన్నారు.తోసిపుచ్చిన బీజేపీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ డిమాండ్‌ను బీజేపీ తోసిపుచి్చంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, పెట్టుబడుల వాతావరణాన్ని చెడగొట్టడమే కాంగ్రెస్ ఉద్దేశమని మండిపడింది. -
ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు కాంగ్రెస్ కుట్ర: రవిశంకర్ ప్రసాద్
ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్షలు తీవ్రంగా మండిపడిపడుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఆమె పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అస్థిరత, ద్వేషం సృష్టించడానికి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ‘‘మూడోసారి (2024 లోక్‌సభ ఎన్నికలు) కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావటంతో ఆ పార్టీ, టూల్‌కిట్ గ్యాంగ్ భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో ద్వేషాన్ని పెంచాలని భావిస్తోంది. నేడు భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండటం మేము పట్ల గర్వపడుతున్నాం. చిన్నమొత్తాల పెట్టుబడిదారులకు సల్యూట్ చేస్తున్నా. పెట్టుబడిదారులకు టూల్‌కిట్, హిండెన్‌బర్గ్ నివేదికలపై నమ్మకం లేదు’’ అని అన్నారు. -
రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: కంగనా
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్పర్సన్ మాధవీ బుచ్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశాన్నికూడా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఎక్స్‌లో.. ‘రాహుల్ గాంధీ చాలా విషపూరితమైన, ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ప్రధాని కాలేదనే నిరాశలో దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని అస్థిరపరిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత రాత్రి రాహుల్.. స్టాక్ మార్కెన్‌ను లక్ష్యంగా చేసుకొని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికకు వత్తాసు పలికారు. దేశ ప్రజల కీర్తిని, ఎదుగుదలను చూసి మీరు బాధపడుతున్న తీరు చూస్తుంటే మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ తమ నేతగా గెలిపించరు. రాహుల్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉండాలి’ చురకలంటించారు.Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can't be the Prime Minister then he might as well destroy this nation.Hindenberg report targeting our stock market that Rahul Gandhi was endorsing last night has turned out…— Kangana Ranaut (@KanganaTeam) August 12, 2024 కాగా హిండెన్‌బర్గ్ నివేదికపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..‘ ఛైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేస్తున్నారు. సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఒకవేళ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే..ఎవరిది బాధ్యత? ప్రధాని మోదీనా? సెబీ ఛైర్‌పర్సనా? లేదా అదానీనా? ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా విచారణ చేపడుతుందా?’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. -
రాహుల్ గాంధీ.. యమా డేంజర్ : కంగనా రనౌత్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నారు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ భారత్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మధబి బుచ్‌పై పలు ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు మద్దతిస్తూ..ప్రధాని మోదీ, సెబీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కంగనా స్పందించారు.ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీ దేశ భద్రత,ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి. అతను ప్రధానమంత్రి కాలేకపోతే తను ఈ దేశాన్ని కూడా నాశనం చేయాలనుకోవడమే అతని ఎజెండా’ అని కంగనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can't be the Prime Minister then he might as well destroy this nation.Hindenberg report targeting our stock market that Rahul Gandhi was endorsing last night has turned out…— Kangana Ranaut (@KanganaTeam) August 12, 2024 -
‘బహిరంగ విచారణ జరగాలి’
సెబీ చీఫ్ మాధబి పురి బచ్, తన భర్త ధవల్ బచ్‌ల పెట్టుబడులపై పారదర్శకంగా, బహిరంగ విచారణ జరగాలని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కోరింది. బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దానిపై సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది.ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది.సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. ఇలా బచ్ ఇన్వెస్ట్మెంట్లపై తమ ఒరిజినల్ నివేదికలోనూ తెలిపామని హిండెన్‌బర్గ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024Buch’s response now publicly confirms her investment in an obscure Bermuda/Mauritius fund structure, alongside money allegedly siphoned by Vinod Adani. She also confirmed the fund was run by a childhood friend of her husband, who at the time was an Adani director.SEBI was…— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024ఇదీ చదవండి: మెరుగైన సమాచార లభ్యతపై దృష్టిమాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.Buch’s statement also claims that the two consulting companies she set up, including the Indian entity and the opaque Singaporean entity “became immediately dormant on her appointment with SEBI” in 2017, with her husband taking over starting in 2019.Per its latest shareholding… pic.twitter.com/gh7jS3zJKZ— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024 -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం
సెబీ చైర్పర్సన్ మాధవీ పురీ బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ఈ వారం స్టాక్ సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాలు విడుదల చేసే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న(గురువారం) ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకు పరిమితం కానుంది. నిపుణులు అంచనాల ప్రకారం..ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. క్రూడాయిల్ ధరలు తగ్గడం కలిసొచ్చే అంశమే. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వృద్ధి ఆధారిత షేర్లకు బదులుగా వాల్యూ స్టాకులను కొనుగోలు చేయడం మంచిది. నిఫ్టీ ఎగువ సాంకేతికంగా 24,400 వద్ద కీలక నిరోధం కలిగి ఉంది. ఆ స్థాయిని చేధిస్తే తిరిగి 25,000 పాయింట్లను అందుకోవచ్చు. దిగువ స్థాయిలో 24,000 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా మాంద్య భయాలు, యెన్ అనూహ్య ర్యాలీ, లాభాల స్వీకరణతో పాటు ఆర్బీఐ కఠినతర వైఖరి అమలు యోచనల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,276 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హిండెన్‌బర్గ్ – సెబీ వివాదం సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధావల్ బచ్‌లకు అదానీకి చెందిన విదేశీ ఫండ్లలో వాటాలున్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దలాల్‌స్ట్రీట్ స్పందన కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా పాటు జూన్ పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. భారత జూలై డబ్ల్యూపీ(హోల్‌సేల్) ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు అమెరికా ద్రవ్యల్బోణ డేటా ఆగస్టు 14న(బుధవారం) వెల్లడి కానుంది. అదేరోజున యూరోజూ క్యూ2 వృద్ధి డేటా, జూన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, బ్రిటన్ జూల్ ద్రవ్యోల్బణం, రిటైల్ ప్రైజ్ ఇండెక్స్ డేటా వెల్లడి కానుంది. ఆగస్టు 15న చైనా, జపాన్, అమెరికా బ్రిటన్ల జూన్ మాసపు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ డేటాలు విడుదల కానున్నాయి. వారాంతాపు రోజున ఆగస్టు 9 వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ ప్రకటించనుంది. ఆదే రోజున బ్రిటన్ జూలై రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ జూన్ వాణిజ్య లోటు గణాంకాలు విడుదల కానున్నాయి. చివరి దశకు ఫలితాల సీజన్ కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరి దశకు చేరింది. నిఫ్టీ 50 సూచీలోని 50 కంపెనీల్లో 46 కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను విడుదల చేశాయి. వొడాఫోన్ ఐటీ, హిందాల్కో, హీరో మోటోకార్ప్, నైకా, హెచ్ఏఎల్, అపోలో హాస్పిటల్ ఈ వారం ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. వాటితో పాటు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, బలరామ్‌పుర్ చినీ మిల్స్, డూమ్స్ ఇండస్ట్రీస్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, హిందుస్థాన్ కాపర్ కంపెనీలూ ఇదే వారంలో తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వృద్ధి ఆధారిత షేర్లకు బదులుగా వాల్యూ స్టాకులను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. -
అదానీ–సెబీ చైర్పర్సన్ ఉదంతంపై... జేపీసీతో దర్యాప్తు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బచ్ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్‌లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌వర్గ్ తాజాగా ఆరోపించడం తెలిసిందే. అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్ సింగ్ (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్) ఆరోపించారు. అదానీ గ్రూప్‌ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. విపక్షాల కుట్ర: బీజేపీ దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు... నిరాధారం
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ సైతం బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టంచేసింది. కాగా, అదానీ మార్కెట్ అక్రమాల్లో సెబీ చీఫ్ బచ్‌తో పాటు ఆమె భర్త ధవళ్ బచ్‌కు ప్రమేయం ఉందంటూ హిండెన్‌బర్గ్ పెద్ద బాంబ్ పేలి్చన సంగతి తెలిసిందే. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఆ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ దొడ్డిదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారనేది హిండెన్‌బర్గ్ ఆరోపణ. స్వయంగా మార్కెట్ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్ దంపతులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ‘‘నిరాధారమైనవి, ఊహాగానాలు’’ అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం... హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలను కొట్టిపారేస్తూ... ‘‘మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి, షోకాజ్ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం‘ అని బచ్ దంపతులు పేర్కొన్నారు. తమ ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని, అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు తేల్చిచెప్పారు. కాగా, అదానీల అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్‌కు సంబంధాలుండటం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందని హిండెన్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అదానీ గ్రూప్‌పై ఆరోపణలన్నింటినీ తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచి్చందని తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చైర్పర్సన్ మాధవీ పురి బచ్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఏం చేస్తుంది?హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల తరఫున గొంతెత్తే చిన్న రీసెర్చ్ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని నాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా నికోలా, క్లోవర్ హెల్త్, బ్లాక్ ఇంక్, కాండీ, లార్డ్స్టౌన్ మోటార్స్ వంటి కంపెనీలను ఇది టార్గెట్ చేసింది. బిజినెస్ మోడల్ ఇదీ.. అవకతవకలపై రీసెర్చ్ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లిక్‌గా బహిర్గతం చేయడానికి ముందే క్లయింట్లు, హిండెన్‌బర్గ్ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు (ముందుగా షేర్లను అమ్మేసి, బాగా పడిన తర్వాత తిరిగి కొనుగోలు చేయడం ద్వారా సొమ్ము చేసుకోవడం) తీసుకుంటారు. రిపోర్ట్ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, అదానీ ఉదంతంలో తమకు కేవలం 4.1 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయని, రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ రీసెర్చ్, విచారణ కోసం వెచి్చంచిన భారీ మొత్తంతో పోలిస్తే తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని హిండెన్‌బర్గ్ చెప్పడం విశేషం! బ్లాక్‌స్టోన్‌లో ధవళ్ పదవిపై...బ్లాక్‌స్టోన్ రియల్టీ కార్యకలాపాలతో ధవళ్ బచ్‌కు ఎలాంటి సంబంధం లేదని బచ్ దంపతుల ప్రకటన పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌గా బచ్ నియామాకానికి ముందే 2019లో ధవళ్ బచ్ను బ్లాక్‌స్టోన్ తమ సీనియర్ అడ్వయిజర్‌గా నియమించుకుందని ప్రకటన స్ప ష్టం చేసింది. సప్లయి చైన్ మేనేజ్మెంట్లో ధవళ్ నైపుణ్యం ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కిందని పేర్కొంది. రియల్టీ, రీట్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలు, సంప్రదింపుల ప్రక్రియ అనంతరం బోర్డు ఆమోదం మేరకే జరిగాయని, చైర్పర్సన్ ఒక్కరే ఆ నిర్ణయాలు తీసుకోలేదని కూడా వారు వివరణ ఇచ్చారు. బచ్‌పై ఆరోపణలు ఇవీ... ‘2017లో సెబీలో హోల్‌టైమ్ మెంబర్‌గా బచ్ నియమాకానికి ముందే 2015లో బచ్ దంపతులు ఈ అదానీ డొల్ల కంపెనీల్లో (బెర్ముడాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) ఇన్వెస్ట్ చేశారు. సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో (ఇది మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్) వారు తొలుత ఖాతా తెరిచారు. దీనికి సంబంధించిన సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో ట్రేడింగ్ చేస్తుండేవి. ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్ఎల్) మేనేజ్ చేసిన ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఫండ్స్‌లో వినోద్ అదానీకి కూడా పెట్టుబడులు ఉన్నాయి. అందులో ఆయన డైరెక్టర్ కూడా. 2022లో బచ్ సెబీ చైర్పర్సన్ అయ్యారు. దీంతో అదానీకి చెందిన మారిషస్, ఇతరత్రా డొల్ల కంపెనీలపై దర్యాప్తును సెబీ పెద్దగా పట్టించుకోలేదు. అదానీ గ్రూప్‌నకు పవర్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో ఇన్వాయిస్లను పెంచి చూపడం ద్వారా విదేశీ డొల్ల కంపెనీలకు పక్కదారి పట్టించిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ భారత్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కాగా, తమ ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అదానీ గ్రూప్ షేర్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) స్పష్టం చేసింది. 2013 అక్టోబర్–2019 అక్టోబర్ మధ్య నిర్వహించిన తమ ఫండ్‌లో బచ్ దంపతులు చేసిన పెట్టుబడులు మొత్తం నిధుల్లో 1.5 శాతం కంటే తక్కువేనని, పెట్టుబడి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ల ప్రమేయం ఏదీ లేదని కూడా పేర్కొంది.దురుద్దేశపూరితం: అదానీ హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా తీవ్రంగా తోసిపుచ్చింది. ‘చట్టాలు, వాస్తవాలను బేఖాతరు చేస్తూ, స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచి్చ, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని దురుద్దేశపూరితంగా, ఊహాజనితంగా, తారుమారు చేసే విధంగా మార్చిన నివేదిక’ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో అదానీ గ్రూప్ పేర్కొంది. మా ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్న వ్యక్తులతో గానీ, అంశాలతో గానీ అదానీ గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరమైన, నియంత్రణ సంస్థల నిబంధలనకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తేలి్చచెప్పింది. ‘పూర్తిగా దర్యాప్తు చేసిన, నిరాధారమని నిరూపితమైన, 2023లో సుప్రీం కొట్టేసిన అవే ఆరోపణలను హిండెన్‌బర్గ్ పదేపదే తిరగదోడుతోంది. భారతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించేలా ఆ సంస్థ కావాలనే ఈ ఆరోపణలు గుప్పిస్తోంది’ అని పేర్కొంది.జరిగింది ఇదీ... అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు భారీ వాటాలపై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో సెబీ 2020 అక్టోబర్‌లో దర్యాప్తు మొదలుపెట్టింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్ షేర్‌హోల్డర్లా.. లేదంటే ప్రమోటర్లకు సంబంధించి బినామీలుగా వ్యవహరిస్తున్నారా అనేది తేల్చడమే ఈ దర్యాప్తు ప్రధానోద్దేశం. కాగా, గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ తొలిసారిగా అదానీ అక్రమాలపై విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకోవడమే కాకుండా, అకౌంటింగ్ మోసాలకు కూడా పాల్పడిందని ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలడం, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరయ్యేందుకు దారితీసింది. కాగా, షేర్ల ధరల భారీ పతనం, అవకతవకలపై సుప్రీం కోర్టు సెబీతో మరో దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు నియంత్రణపరమైన ఉల్లంఘనల నిగ్గు తేల్చాల్సిందిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో సెబీ చేస్తున్న దర్యాప్తు సరిపోతుందని, సీబీఐ, సిట్ వంటి సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత కోల్పోయిన మార్కెట్ విలువను అదానీ గ్రూప్ షేర్లు పూర్తిగా తిరిగి చేజిక్కించుకుని దూసుకుపోతుండం విశేషం. గత నెలలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను సైతం హిండెన్‌బర్గ్ ఈ వివాదంలోకి లాగింది. అదానీ డొల్ల కంపెనీలతో ఆ బ్యాంకుకు సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే, కోటక్ బ్యాంక్ కూడా దీన్ని ఖండించింది. కాగా, వాస్తవాలను దాచిపెడుతూ, సంచలనం కోసమే హిండెన్‌బర్గ్ అదానీపై అరోపణలు చేసిందని, అదానీ షేర్ల పతనం ద్వారా లాభపడేందుకు అది న్యూయార్క్ హెడ్జ్ ఫండ్‌తో కుమ్మక్కయిందని పేర్కొంటూ గత నెల 26న సెబీ హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా సెబీ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడం కొత్త ట్విస్ట్. -
హిండెన్ బర్గ్ ఆరోపణలు.. మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు
అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన తాజా ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ తాజాగా నివేదిక స్పష్టంగా తెలుపుతుందని అన్నారు.చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ సెబీ.. సమగ్రత, దాని చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో రాజీ పడింది అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతేకాదు,సెబీ చైర్పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.The integrity of SEBI, the securities regulator entrusted with safeguarding the wealth of small retail investors, has been gravely compromised by the allegations against its Chairperson.Honest investors across the country have pressing questions for the government:- Why… pic.twitter.com/vZlEl8Qb4b— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2024 -
హిండెన్‌బర్గ్‌కు మాధబి పురి షోకాజు నోటీసులు
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై మాధబిపురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్‌లు సంయుక్తంగా హిండెన్ బర్గ్‌కు నోటీసులు జారీ చేశారు. భారత్ చట్టాల్ని ఉల్లంఘించి హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని, అందుకే ఈ షోకాజు నోటీసులు జారీచేసినట్లు ధవల్ బచ్ దంపతులు తెలిపారు. హిండెన్ బర్గ్ ఆగస్ట్ 10న సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన ఆఫ్‌షోర్ సంస్థల్లో మాధబి పురికి, ఆమె భర్త ధవల్ బచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024 ఆ ట్వీట్‌కు మాధబి పురి స్పందించారు. హిండెన్ బర్గ్ తమ వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా వ్యహరిస్తోందని మండిపడ్డారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌లో పేర్కొన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సెబీలో చేరడానికి రెండేళ్ల ముందు అంటే 2015లో జరిగిందని గుర్తు చేశారు. ఆ ఫండ్స్‌లో తాము పెట్టుబడులు పెట్టడానికి కారణం..ఆ ఫండ్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్(సీఐఓ) అనిల్ అహుజా తన స్నేహితుడని ధవల్ బచ్ తెలిపారు. అనిల్ అహుజా నా చిన్న నాటి స్నేహితుడు. పైగా ఇన్వెస్ట్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, 3ఐ గ్రూప్ పీఎల్సీ వంటి సంస్థల్లో పనిచేశారు’ అని చెప్పారు. -
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. మోదీ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చిన ఖర్గే!
ఢిల్లీ: సెబీ ఛైర్పర్సన్ మాధబి పూరీ, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వీరిద్దరూ దోహదపడ్డారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ హయాంలో సెబీ బండారం బట్టబయలైందని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక, ఖర్గే తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ భారీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలి. దీనిపై విచారణ జరగనంతవరకు ప్రధాని మోదీ తన స్నేహితుడు(అదానీ)కి సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్ విషయంలో జనవరి 2023లో సుప్రీంకోర్టు.. సెబీ, అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశాడు. నేడు ఆర్ధిక సంబందాలకు అధినేతగా చెప్పుకునే అదే సెబీ అసలు బండారం బయటకు వచ్చింది. దేశంలో మధ్యతరగతికి చెందిన చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులు.. వారు కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు. వారు సెబీని విశ్వసిస్తున్నందున వారికి రక్షణ అవసరం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, అంతకముందు కాంగ్రెస్ నేతలు హిండన్‌బర్గ్ రీసెర్చ్ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. అదానీ గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. SEBI had previously cleared Adani, a close associate of PM Modi, before the Supreme Court following the January 2023 Hindenburg Report revelations.However, new allegations have surfaced regarding a quid-pro-quo involving the SEBI Chief.The small & medium investors belonging…— Mallikarjun Kharge (@kharge) August 11, 2024 -
హిండెన్‌బర్గ్‌కు కాంగ్రెస్ సహకరిస్తోంది: రాజీవ్ చంద్రశేఖర్
ఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదానీ గ్రూప్ సంస్థల పేర్ల విలువలు కృత్రిమంగా పెచేందుకు వినివియోగించిన మారిషస్ ఫండ్లలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్‌పై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.తాజాగా కాంగ్రెస్ విమర్శలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు హిండెన్‌బర్గ్‌కు కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు. ‘హిండెన్‌బర్గ్, కాంగ్రెస్ మధ్య ఉన్న భాగస్వామ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ భాగస్వామ్యంతోనే హిండెన్ బర్గ్ ఇటువంటి నివేదిక విడుదల చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచటం, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యం. ఇది కాంగ్రెస్ అసత్య ఆరోపణలకు నిదర్శనం. ఈ నివేదిక అసత్యాలు, అబద్ధాలతోనింపబడింది’’ అని అన్నారు. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీ గ్రూప్ రియాక్షన్
అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఇటీవల నాలుగు పదాల ట్వీట్ చేసింది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపైన అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ ఇద్దరూ స్పదించారు.హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మా హోల్డింగ్ మొత్తం పారదర్శకంగా ఉందని చెబుతూ.. అనేక పబ్లిక్ డాక్యుమెంట్లలో సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తూనే ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది.అదానీ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తులను లేదా మా స్థితిని కించపరచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పేర్కొన్న వ్యక్తులతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. మేము పారదర్శకత మరియు అన్ని చట్టపరమైన, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా కట్టుబడి ఉంటామని కంపెనీ వివరించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు భారతీయ చట్టాలను పూర్తిగా దిక్కరిస్తున్నాయని అదానీ గ్రూప్ ప్రతినిధి అన్నారు.హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ చీఫ్ కూడా స్పందించారు. 2024 ఆగష్టు 10న హిండెన్‌బర్గ్ నివేదికలో మాపై చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మా జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం వంటివి. అవసరమైన అన్ని విషయాలను ఇప్పటికే సెబీకి అందించాము. వారు కోరే అన్ని ఆర్థిక పత్రాలను ప్రతి అధికారానికి బహిర్గతం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. -
Hindenburg Research: అదానీ అక్రమాల్లో సెబీ చీఫ్‌కు భాగస్వామ్యం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబు పేలి్చంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సాక్షాత్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది! అందుకే అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడింది. బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్‌బర్గ్ వెల్లడించింది. ‘‘ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు ‘పెట్టుబడులు’ పెట్టినట్టు చూపారు. పెట్టుబడులకు భారత్‌లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరం. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా తమ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది’’ అని పేర్కొంది. అదానీల విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేలి్చందేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని హిండెన్‌బర్గ్ గుర్తు చేసింది. అంతకుముందు, ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అంటూ సంస్థ శనివారం ఉదయమే ఎక్స్‌లో పోస్టు పెట్టింది. నాటినుంచీ దుమారమే అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుందంటూ 2023 జనవరి 23న హిండెన్‌బర్గ్ ఇచి్చన నివేదిక దుమారం రేపడం తెలిసిందే. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి భారీ రుణాలు పొందిందని, అకౌంటింగ్ మోసాలకూ పాల్పడిందని నివేదిక పేర్కొంది. బెర్ముడా, మారిషస్ దేశాల్లో అదానీ కుటుంబం డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా అవినీతికి, నగదు అక్రమ బదలాయింపుకు పాల్పడుతోందని ఆరోపించింది. చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ వీటిని నియంత్రిస్తున్నట్టు పేర్కొంది. ఈ నివేదిక దెబ్బకు అప్పట్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్ల మేరకు హరించుకుపోయింది. ఈ ఉదంతం రాజకీయంగా కూడా ఇప్పటికీ జాతీయ స్థాయిలో పెను ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అధికార బీజేపీ, విపక్ష ఇండియా కూటమి మధ్య పరస్పర ఆరోపణలకు కారణమవుతూ వస్తోంది. అయితే హిండెన్‌బర్గ్ నివేదిక వెనక కుట్ర దాగుందన్న వాదనలూ ఉన్నాయి. -
ఇన్వెస్టర్లను భయపెడుతున్న నాలుగు పదాల ట్వీట్
ఇటీవల కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' చేసిన ఓ ట్వీట్ చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిండెన్‌బర్గ్ మరోసారి భారతీయ మార్కెట్లలో బాంబు పేల్చనుందా.. అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏ కంపెనీ మీద నివేదికల విడుదల చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్ తమ కంపెనీ కంపెనీ షేర్స్ కృత్రిమంగా పెంచినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఆరోపణలు సరైనవి కాదని, అదానీ గ్రూప్ ఖండించింది. ఆ తరువాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. మొత్తానికి అదానీ గ్రూప్ మళ్ళీ యధాస్థితికి వచ్చింది.ఇప్పుడు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నాలుగు పదాల ట్వీట్.. మళ్ళీ అదానీ గ్రూపును ఉద్దేశించి చేసిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ అంతరార్ధం మాత్రం అవగతం కావడం లేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది 2017లో ప్రారంభమైన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 10మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.Something big soon India— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024 -
‘అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం’
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే అదానీ షేర్లలో కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్(కేఐఓఎఫ్) ద్వారా షార్ట్ పొజిషన్లను తీసుకున్నట్లు చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా వ్యక్తుల హస్తం ఉందన్నారు. అదానీ గ్రూప్‌పై నివేదికను సిద్ధం చేసేందుకే అమెరికా వ్యాపారవేత్త మార్క్ కింగ్డన్ హిండెన్‌బర్గ్‌ను ఆశ్రయించారని చెప్పారు.సెబీ ఇటీవల హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ ఆ నోటీసుల్లో ఎలాంటి నిజం లేదని హిండెన్‌బర్గ్ వాటిని కొట్టిపారేసింది. అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి ట్రేడ్ చేసినట్లు సెబీ నోటీసుల్లో ఉంది. నివేదిక విడుదలకు ముందే కింగ్డన్తో హిండెన్‌బర్గ్ అనుబంధం మొదలైందని సెబీ పేర్కొంది. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపింది. ఇదిలాఉండగా, అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే స్టాక్స్ ధరను షార్ట్ చేశామని హిండెన్‌బర్గ్ తెలిపింది. కింగ్డన్ షార్ట్ పొజిషన్ల గురించి తమకు సమాచారం లేదని సెబీ నోటీసుల తర్వాత హిండెన్‌బర్గ్ తన వివరణలో పేర్కొంది.ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ..‘అమెరికా వ్యాపారవేత్త కింగ్డన్ అదానీ గ్రూప్‌పై నివేదికను రూపొందించడానికే హిండెన్‌బర్గ్‌ను ఆశ్రయించారు. అదానీ షేర్లలో ట్రేడింగ్ కోసం ఆఫ్‌షోర్ ఫండ్ ఏర్పాటుకు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ (కేఎంఐఎల్)ని కింగ్డన్ సంప్రదించారు. అలా కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ (కేఐఓఎఫ్)ను సిద్ధం చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే మారిషస్ ద్వారా అదానీ షేర్లలో కేఐఓఎఫ్ షార్ట్ పొజిషన్లను తీసుకుంది. దీని కోసం కింగ్డన్ మాస్టర్ ఫండ్ నిధులు అందించింది. ఇందులో కింగ్డన్ భార్య అన్లాచెంగ్‌తో సహా ఆయన కుటుంబానికి భారీగా వాటాలున్నాయి’ అని చెప్పారు.ఎవరీ అన్లా చెంగ్..?అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్. అమెరికాలో చైనీయుల హక్కులు, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఆమె ‘సుప్‌చైనా’ అనే మీడియా సంస్థకు సీఈఓగా వ్యవహరించారు. ఇది అమెరికాలో చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు అక్కడి కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఆరోపణలు రావటంతో దాన్ని మూసివేశారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన‘హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా వర్గాల హస్తం ఉంది. అసలు కేఎంఐఎల్‌ను కింగ్డన్కు ఎవరు పరిచయం చేశారు? హిండెన్‌బర్గ్ నివేదిక రూపకల్పనలో సహకరించిన భారత ఆర్థిక సంస్థలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు చైనా వర్గాల గురించి ముందే తెలుసా? షార్ట్ ట్రేడింగ్ వల్ల వారికి ఏమేరకు లాభం చేకూరింది? వీటన్నింటిపై సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని జెఠ్మలానీ డిమాండ్ చేశారు. -
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
కోటక్ బ్యాంక్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు
అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకుగాను అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ స్పందిస్తూ కొత్తగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను వివాదంలోకి లాగింది.సెబీ నోటీసులు అందుకున్న హిండెన్‌బర్గ్ స్పందిస్తూ..‘భారత క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. అదానీ స్టాక్స్‌పై పెట్టుబడుల్లో మేము నిబంధనల్ని పాటించలేదని అందులో ఉంది. సెబీ వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజంలేదు. అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే ఆయా కంపెనీల స్టాక్స్ ధరను షార్ట్ చేశామని సెబీకి ఇదివరకే స్పష్టం చేశాం. కానీ నోటీసుల్లో మాత్రం షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్ చేసినట్లు ఉంది. ఈ నోటీసులకు అర్థం లేదు. భారత్‌లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపితే ఇలా నోటీసులు పంపడం సరికాదు’ అని చెప్పింది.‘అదానీ గ్రూప్ అవకతవకల వ్యవహారం భయటకు వచ్చే సమయంలో కోటక్ బ్యాంకు ఆఫ్‌షోర్ ఫండ్(విదేశాల్లో ఏర్పాటు చేసిన ఫండ్ కంపెనీ) ఏర్పాటు చేసింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేశారు. దీనివల్ల కోటక్ బ్యాంకుకు పెద్దగా లాభాలు ఏమి రాలేదు. కానీ, సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన లేదు. సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని హిండెన్‌బర్గ్ తెలిపింది.అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో నిబంధనలు పాటించామని పేర్కొంది. తన ఇన్వెస్టర్లతో ఉన్న సంబంధాలతోనే స్టాక్స్‌ను షార్ట్ చేసి 4.1 మిలియన్ డాలర్ల(రూ.34 కోట్లు) ఆదాయం పొందినట్లు తెలిపింది. అయితే సంస్థ ఖర్చులు, ఇతర వ్యయాలను లెక్కిస్తే తమకు ఏమీ మిగలలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రూప్ సంస్థల స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచారని హిండెన్‌బర్గ్ తెలిపింది. అందుకోసం కంపెనీకు చెందిన కొన్ని విదేశీ పెట్టుబడిదారుల సహాయం తీసుకున్నారని చెప్పింది. ఈమేరకు 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందిందని ఆరోపించింది. ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినట్లు తెలిపింది. యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని చెప్పింది. వీటిద్వారా అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఆ ఆరోపణలు వచ్చిన వెంటనే కంపెనీ స్పందించి ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు ఎస్బీఐలోని అప్పులను కొంత తీర్చింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ సైతం జరిగింది.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ధర మంగళవారం 3.5 శాతం మేర నష్టపోయి రూ.1,745 వద్ద ట్రేడవుతోంది. -
హిండెన్‌బర్గ్‌ను ఎదురొడ్డి.. నష్టాల నుంచి బయటపడ్డ అదానీ
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.హిండెన్‌బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’
అదానీ గ్రూప్ స్టాక్స్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో గతేడాది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో పెద్దమొత్తంలో స్టాక్ ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఆ నివేదిక వెలువడినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద భారీగా పతనమైంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అదానీ ఇటీవల తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని ఎలా కట్టడిచేశామో తెలిపారు. ‘హిండెన్‌బర్గ్ ఆరోపణలను వచ్చాక తొలుత వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పూర్తిగా పాత సమాచారాన్నే ఆ సంస్థ కొత్త రూపంలో పేర్కొంది. ఆ వివాదం వెంటనే తొలగిపోతుందనుకున్నాను. ప్రపంచంలో ఓ కార్పొరేట్ కంపెనీపై జరిగిన అతిపెద్ద దాడి అది. సాధారణంగా షార్ట్‌సెల్లర్లు చేసే దాడులకు వ్యాపార కోణమే ఉంటుంది. కానీ, మాపై జరిగినది కేవలం ఫైనాన్షియల్ మార్కెట్లకే పరిమితం కాలేదు.. రాజకీయ కోణం కూడా సంతరించుకుంది. చాలా సమన్వయంతో మమ్మల్ని దెబ్బకొట్టాలనుకున్నారు. చాలా తొందరగానే హిండెన్‌బర్గ్ కుట్రను అర్థం చేసుకున్నాను. గతంలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. దాంతో మా సొంత ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లు విలువైన ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకొన్నాం. రూ.75,000 కోట్ల నగదు, రూ.17,500 కోట్ల ప్రీపెయిడ్ మార్జిన్ లింక్డ్ ఫైనాన్సింగ్‌తో నిధి ఏర్పాటు చేశాం. సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లను వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలని సూచించాం. ఖావ్డ, ధారావి వంటి కొత్త ప్రాజెక్టుల రూపంలో వ్యాపార విస్తరణను కొనసాగించాం. వార్‌రూమ్ ఏర్పాటు చేశాం. దాంతో ఇన్వెస్టర్లకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాం. ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. ఈ వ్యవహారం నుంచి ఓ విషయం నేర్చుకొన్నాం. మంచి పనిచేయడమే కాదు.. మన గురించి అందరికీ తెలియాలి. కమ్యూనికేషన్ మరింత పెంచుకోవాలి. హిండెన్‌బర్గ్ వ్యవహారం మొత్తంలో చిన్న వాటాదారులు దెబ్బతినడమే నన్ను బాధించింది. మా కంపెనీలు తిరిగి పుంజుకొన్నాక హిండెన్‌బర్గ్ నివేదికలో నిజం లేదని తేలింది’ అని గౌతమ్ అదానీ వివరించారు. -
హిండెన్ బర్గ్ వివాదం నుంచి తేరుకుని.. అదానీ మరో కీలక నిర్ణయం!
హిండెన్ బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం తన బిజినెస్ జెట్ ఫ్లైట్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి రవాణా సౌకర్యం కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 12కి చేరిన బిజినెస్ జెట్లు ఈ ఆరు పిలాటస్ పీసీ-24 జెట్లను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ మొత్తం బిజినెస్ జెట్ల సంఖ్య 12 అవుతుంది. అదానీతో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపార కార్యకలాపాల కోసం చేసే జర్నీ సజావుగా, సమర్థంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినందున మొత్తం ఆరు విమానాలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని సమాచారం. సుప్రీం తీర్పుతో కోలుకున్న అదానీ 2023లో జరిగిన నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు తన కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 80 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి 2023 జనవరిలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీ, అతని సంస్థ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా అదానీ తన గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోవడంతో సుమారు 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అత్యంత ధనవంతుడిగా అయితే, ఏడాది తర్వాత సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై అదనపు దర్యాప్తు అవసరం లేదని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.దీంతో అదానీ కంపెనీ నష్టాల నుంచి త్వరగా కోలుకొని, తన సంపదను తిరిగి పొంది ముకేశ్ అంబానీని అధిగమించి స్వల్పకాలం పాటు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. -
సుప్రీంకోర్టు తీర్పు.. కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ కార్పొరేట్ సంస్థ అదానీ గ్రూప్ స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు పూర్తిగా సెబీకి అనుకూలంగా ఉందని తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీలపై ఆరోపణలు వచ్చిన తర్వాత కోర్టు సమగ్ర విచారణ చేయమని ఆదేశించి పది నెలలు అయిందని గుర్తుచేసింది. అయినా సెబీ తన దర్యాప్తును పూర్తి చేయడంలో విఫలమైందని పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన 24 పిటిషన్లకుగాను 22 పిటిషన్ల దర్యాప్తు పూర్తి చేసిన నిపుణుల కమిటీ మరో మూడు నెలల్లో సమగ్ర విచారణ పూర్తి చేయాలని సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే. దానిపై కాంగ్రెస్‌పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జీ జైరాం రమేష్ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం తప్పా రాబోయే మూడు నెలల్లో ఏమార్పురాదన్నారు. అయితే సెబీను ప్రశ్నించేందుకు వార్తా నివేదికలు, మీడియా కథనాలు ప్రత్యామ్నాయం కాదనే విషయంపట్ల అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఏకీభవించారు. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే.. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పులో సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని చెప్పింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. -
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!
గడచిన వారంలో స్టాక్‌మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్‌బర్గ్ నివేదికతో కుప్పకూలిన స్టాక్‌లు తిరిగి మార్కెట్ జీవితకాల గరిష్ఠాలను తాకింది. దాంతో అదానీ స్టాక్ల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది. కేవలం ఐదు రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగడంతో అటు గ్రూప్ కంపెనీలకు, ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు. జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్‌లోని ఏడు షేర్లలో ఎల్ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే.. ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏసీసీ మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. గతవారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. -
జెట్ స్పీడ్‌తో తన సంపదను పెంచుకుంటూ పోతున్న గౌతమ్ అదానీ!
భారత బిలియనీర్ గౌతమ్ అదానీ జెట్ స్పీడ్‌తో తన సంపదను పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలో తొలి 20 ధనవంతుల జాబితాలో 19వ స్థానాన్ని దక్కించుకున్నారు. మంగళవారం అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత కంపెనీల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దీంతో ఆ ఒక్కరోజే అదానీ గ్రూప్ మొత్తం కంపెనీల మార్కెట్ కేపిటల్ వ్యాల్యూ లక్ష కోట్లకు చేరింది. అదే రోజు అదానీ వ్యక్తిగత సంపద సైతం 6.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోని ఇతర బిలియనీర్లు జూలియా ఫ్లెషర్ కోచ్ అండ్ ఫ్యామిలీ (64.7 బిలియన్ డాలర్లు), చైనాకు చెందిన జాంగ్ షన్షాన్ (64.10 బిలియన్ డాలర్లు), అమెరికాకు చెందిన చార్లెస్ కోచ్ (60.70 బిలియన్ డాలర్లు)లను వెనక్కి నెట్టారు. ఒక్క రోజులో లక్ష కోట్లు నవంబర్ 28,2023 నాటికి అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల మొత్తం విలువ రూ.11,31,096కి చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ మంగళవారం ఒక్కరోజే మార్కెట్ విలువ రూ.1.04లక్షల కోట్లకు పెరిగింది. అయితే, గ్రూప్ మార్కెట్ క్యాప్ జనవరి 24న గరిష్ట స్థాయి రూ.19.19 లక్షల కోట్ల నుంచి 41 శాతం తగ్గింది.ఇక స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీలు భారీ ర్యాలీ చేయడానికి కారణం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలే కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సెబీని అనుమానించలేం హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు పై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ‘సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్‌బర్గ్ నివేదికలోని అంశాలన్నిటినీ వాస్తవాలుగా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేదని పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్ అంశంలో దాఖలైన పలు కేసులపై వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. -
అదానీ–హిండెన్‌బర్గ్ అంశంపై సుప్రీం కోర్టు ఆరా
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరత నుండి పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు క్యాపిటల్ మార్కెట్ల రెగ్యులేటర్ ఏమి చేయాలనుకుంటోందని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదానీ–హిండెన్‌బర్గ్ వ్యవహారానికి సంబంధించి దాఖలైన బ్యాచ్ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సెబీకి ఈ ప్రశ్న సంధించింది. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతించడానికి ప్రధాన కారణాలలో స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరతి ఒకటని తెలిపింది. ‘‘పెట్టుబడిదారుల తన పెట్టుబడి విలువను భారీగా కోల్పోయే ఈ తరహా అస్థిరతనుండి ఇన్వెస్టర్‌ను రక్షించడానికి సెబీ ఏమి చేయాలనుకుంటోంది. నిబంధనలను కఠినతరం చేసే దిశలో ఆలోచన చేస్తోందా?’’ అని జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు కూడా ఉన్న త్రిసభ్య ధర్మాసనం సెబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. అన్ని స్థాయిల్లో నిబంధనల పటిష్టతకు సెబీ తగిన చర్యలు తీసుకుంటోందని మెహతా ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెబీ తీసుకుంటున్న చర్యలను అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనితో ఈ అంశంపై తన ఉత్తర్వులను బెంచ్ రిజర్వ్ చేసుకుంది. 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు పూర్తి! కాగా, అదానీ గ్రూపుపై ఆరోపణలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు ముగిసిందని సొలిసిటర్ జనరల్ తొలుత ధర్మాసనానికి తెలియజేశారు. మిగిలిన రెండింటి కోసం విదేశీ నియంత్రణ సంస్థల నుండి సమాచారం అవసరమని తెలిపారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించారు. షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించినంత వరకు తప్పు జరిగినట్లు సెబీ ఏదైనా గుర్తించిందా అని బెంచ్ అడిగిన ప్రశ్నకు మెహతా సమాధానం చెబుతూ తప్పు ఎక్కడ జరిగినట్లు గుర్తించినా, సెబీ చట్టం ప్రకారం రెగ్యులేటర్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించినంతవరకు, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ నుండి సూచనలు అందినట్లు తెలిపారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నియంత్రణ వైఫల్యం లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ మేలో సమర్పించిన మధ్యంతర నివేదికలో పేర్కొంది. అయితే 2014 నుంచి 2019 మధ్య చేసిన పలు సవరణలు నియంత్రణ సంస్థ దర్యాప్తు సామర్థ్యాన్ని నిరోధించిందని అలాగే విదేశీ సంస్థల సంస్థల నుండి వచ్చిన నిధుల విషయంలో ఉల్లంఘనలపై దర్యాప్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు వంటి ఆరోపణలతో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇవి సత్యదూరాలని స్పష్టం చేసింది. గ్రూప్ కార్యకలాపాలనీ చట్టప్రకారం, పారదర్శకంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. -
అదానీ గ్రీన్‌లో టోటల్ ఎనర్జీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది. మరో 250 మె.వా సోలార్, విండ్ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీతో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ తొలిసారి పబ్లిక్ డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్.. 2,353 మె.వా. పోర్ట్‌ఫోలియోగల ఏజీఈ23ఎల్(జేవీ)లో అదానీ గ్రీన్‌తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను టోటల్ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
హిండెన్‌బర్గ్ 2.0: అదానీ గ్రూప్‌పై మరో పిడుగు.. ఓసీసీఆర్పీ సంచలన ఆరోపణలు
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్‌బర్గ్ తర్వాత వెల్లడించాడు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ గ్రూప్‌కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి. ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ.. ఇదిలా ఉండగా ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే అదానీ గ్రూప్ స్టాక్‌లు రెడ్ జోన్లోకి జారిపోయాయి. అదానీ పవర్ షేర్లు 3 శాతానికి పైగా నస్టపాయాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ ధర 3.3 శాతానికి పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 2.50 శాతం మేర నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ 2.25 శాతం మేర నష్టపోయాయి. -
కార్పొరేట్లకు ‘హిండెన్‌బర్గ్’ తరహా షాక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలల క్రితం పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తరహాలో మరో సంస్థ దేశీ కార్పొరేట్ గ్రూప్‌ల అవకతవకలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాక్‌ఫెలర్ బ్రదర్స్ ఫండ్, జార్జ్ సొరోస్ వంటి దిగ్గజాల దన్ను గల ఓసీసీఆర్పీ (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు) సన్నద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా ఉన్న 24 లాభాపేక్షరహిత ఇన్వెస్టిగేటివ్ సంస్థలు కలిసి ఈ పరిశోధనాత్మక రిపోరి్టంగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. అవి త్వరలోనే ఏదైనా నివేదిక లేదా వరుస కథనాలను ప్రచురించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ముందుగా ఒక నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీలో విదేశీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించిన అవకతవకలను బయటపెట్టవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే సదరు కార్పొరేట్ సంస్థ పేరును మాత్రం వెల్లడించలేదు. 2006లో ఏర్పాటైన ఓసీసీఆర్పీ వెబ్సైట్ ప్రకారం సంఘటిత నేరాలను శోధించడం సంస్థ ప్రత్యేకత. ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్‌కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఫోర్డ్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ మొదలైనవి దీనికి నిధులు సమకూరుస్తున్నాయి. -
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు : కీలక పరిణామం
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై చేసిన ఆరోపణలపై విచారణను ముగించేందుకు గడువును 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు గడువును పొడిగించాలని కూడా సెబీ కోరింది. ఈ ఏడాది మేలో, ఈ అంశంపై అప్డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. సెబీ 15 రోజుల పొడిగింపును ఎందుకు కోరింది? అదానీ గ్రూప్‌పై యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు సంబంధించి తాను దర్యాప్తు చేస్తున్న 24 లావాదేవీలలో 17 విచారణను పూర్తి చేసినట్లు సెబి తెలిపింది. మిగిలిన అంశాలపై విచారణ త్వరలోనే పూర్తి చేయనుంది. అయితే తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి ఇతర నియంత్రణ సంస్థలు , విదేశీ అధికార పరిధి నుండి మరింత సమాచారం కోరినట్లు సెబీ సుప్రీంకు తెలియజేసింది. విదేశీ లావాదేవీల ప్రమేయం కారణంగా కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు తీరని సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏర్పాటు సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణల మేరకు నిబంధనలకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ తన గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేసిందా? సంబంధిత-పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైందా? అనే విషయాలపై సెబీ విచారణ చేపట్టింది. మరోవైపు అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ అదానీ పోర్ట్స్ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్‌తో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కాగా తమ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో చేసిన తప్పుడు ఆరోపణలని హిండెన్‌బర్గ్ వాదనను గౌత అదానీ గట్టిగా తోసిపుచ్చారు. కేవలం తమ స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని, కుట్రపూరితంగానేకంపెనీ ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ముందు ఈ తప్పుడు నివేదికను వెల్లడించారని 2023 వార్షిక సాధారణ సమావేశంలో స్పష్టం చేశారు. -
అదానీ పోర్ట్స్ నుంచి నిష్క్రమణ యోచనలో డెలాయిట్
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఆడిటర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలాయిట్ తప్పుకోవడానికి కారణమేంటనేది నిర్దిష్టంగా వెల్లడి కాలేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించిన నిర్దిష్ట లావాదేవీలపై డెలాయిట్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022–23 ఆర్థిక ఫలితాల నివేదికలో మూడు సంస్థలతో లావాదేవీల గురించి డెలాయిట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతర్గతంగా ఖాతాల మదింపు చేయడం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ చేస్తుండటం వంటి అంశాల కారణంగా హిండెన్‌బర్గ్ ఆరోపణల విషయంలో బైటి ఆడిటర్‌తో పరీక్ష చేయించడం అవసరమని అదానీ గ్రూప్ భావించలేదని పేర్కొంది. బైటి ఏజెన్సీ ద్వారా మదింపు జరగకపోవడం, సెబీ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం వల్ల కంపెనీ అన్ని నిబంధనలనూ పాటిస్తోందా లేదా అనేది తాము ధృవీకరించే పరిస్థితి లేదని తెలిపింది. -
తప్పుడు సమాచారంతో దెబ్బ కొట్టాలని చూశారు
-
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ
అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూపు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారంతో, తమను అపఖ్యాతి చేయాలన్న దురుద్దేశంతో చేసిన ఆరోపణలని పునరుద్ఘాటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. తాజాగా గ్రూప్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతం అదానీ మంగళవారం మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కావాలనే తమ పబ్లిక్ ఆఫర్‌కు ముందు విడుదల చేశారనీ, ఇది ఉద్దేశపూర్వకంగా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. అయినా ఎఫ్‌పీవో సక్సెస్ అయినప్పటికీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అదానీ చెప్పారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఈ సందర్బంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన వాటాదారులకు స్థిరమైన వృద్ధి , విలువ సృష్టికి హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచ స్థాయి ఆస్తులను నిర్మించేందుకు గ్రూప్ కట్టుబడి ఉందని బిలియనీర్ చెప్పారు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) కాగా అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసం, స్టాక్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది అదానీ గ్రూప్ స్టాక్‌ల భారీ పతనానికి దారితీసింది. ఫలితంగా గ్రూపు మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. అలాగే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్‌ల వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించ లేదని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) #WATCH | "...The report was a combination of targeted misinformation and discredited allegations. The majority of them dating from 2004 to 2015. They were all settled by authorities at that time. This report was a deliberate and malicious attempt aimed at damaging our… pic.twitter.com/yEH5r3Duff — ANI (@ANI) July 18, 2023 -
అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.1,250 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,250 కోట్లు సమీకరించినట్టు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల అయిన తర్వాత, అదానీ గ్రూప్ కంపెనీ తొలిసారి రుణ మార్గంలో నిధులు సమీకరించడం గమనార్హం. రూ.లక్ష ముఖ విలువ కలిగిన 1,25,000 సెక్యూర్డ్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ ఎంటర్ప్రైజెస్ సమాచారం ఇచి్చంది. ఎన్సీడీ రేటును సంస్థ ప్రకటించలేదు. కానీ, ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం మూడేళ్ల ఎన్‌సీడీలపై 10 శాతం రేటు ఆఫర్ చేసి నిధులు సమీకరించినట్టు తెలుస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ చివరిగా గతేడాది సెపె్టంబర్లో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఎన్‌సీడీలపై సంస్థ ఆఫర్ చేసిన 10 శాతం రేటు, ప్రభుత్వ బాండ్ ఈల్డ్ రేటు కంటే 3 శాతం అధికంగా ఉంది. వీటిపై అదానీ ఎంటర్ప్రైజెస్ ఏటా వడ్డీ చెల్లించనుంది. అదానీ గ్రూప్ షేర్ల ధరలు, కంపెనీల ఖాతాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేయడం, దీన్ని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించడం గుర్తుండే ఉంటుంది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ పరిణామాల తర్వాత అదానీ గ్రూప్ ప్రమోటర్లు కంపెనీల్లో స్వల్ప వాటాలను సీక్యూజీ పార్ట్న ర్స్కు ప్రైవేటుగా విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం కూడా చేశారు. -
తప్పుడు లక్ష్యంతోనే ఆ నివేదిక: అదానీ గ్రూప్ ఫైర్
న్యూఢిల్లీ: కార్పొరేట్ సుపరిపాలన, సమాచార వెల్లడిలో విశ్వసనీయ విధానాలు అవలంబిస్తున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ గ్రూప్‌లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన ఐదు నెలల తదుపరి వార్షిక నివేదికలో ఇంకా పలు అంశాలపై స్పందించింది. అదానీ గ్రూప్ కంపెనీలలో అక్రమాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒక దశలో గ్రూప్ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. అయితే హిండెన్‌బర్గ్ నివేదిక తప్పుడు లక్ష్యాలతో నిరాధార ఆరోపణలకు తెరతీసిందని అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇది దేశంపై జరిగిన దాడిగా గౌతమ్ అదానీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున నివేదిక వెలువడినట్లు తెలియజేశారు. గ్రూప్‌పై తప్పుడు ఆరోపణలు చేసి షేర్ల ధరలను పడగొట్టడం ద్వారా హిండెన్‌బర్గ్ లాభాలు ఆర్జించినట్లు వెల్లడించారు. సుపరిపాలన, సమాచార వెల్లడిలో గ్రూప్ పటిష్ట విధానాలు అనుసరిస్తున్నట్లు వివరించారు. అన్ని రకాల నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. -
అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్డ్ ఆరోపణలతో అదానీ గ్రూపు భారీ నష్టాలను మూటగట్టుకుంది. లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్ తుడిచుపెట్టుకుపోతోంది. అయితే తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీకి చెందిన 'స్టాక్స్ అన్నీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాయి. సంస్థ మార్కెట్ క్యాప్ కూడా పది లక్షల కోట్లను అధిగమించింది. ఈ క్రమంలో టాప్‌ఇన్వెస్టర్ విజయగాథ వైరల్‌గా మారింది. రాజీవ్ జైన్, భారీ లాభాలు జీక్యూజీ పార్ట్నర్స్ చైర్మన్ రాజీవ్ జైన్ అదానీ నాలుగు కంపెనీలలో పెట్టిన పెట్టుబడులతో కేవలలో 100 రోజుల లోపే 65.18 శాతం రాబడిని పొందారు. విలువ పరంగా మార్చి 2న రూ.15,446.35 కోట్లగా ఉన్న పెట్టుబడులు మంగళవారం నాటి ట్రేడింగ్‌తో కలిపి ఏకంగా రూ.10,069 కోట్లు పెరిగి రూ.25,515 కోట్లకు చేరింది. మార్చిలో అదానీ గ్రూప్ కంపెనీల్లో జీక్యూజీ పెట్టుబడి రూ.15,446 కోట్లతో పోలిస్తే ఇది 65 శాతం పెరగడం విశేషం. (ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్ ) కేవలం 52 ట్రేడింగ్ సెషన్లలో జీక్యూజీ పార్టనర్స్ పెట్టుబడి రూ 25 వేల కోట్లకు పెరిగింది. ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై పెట్టుబడి దారులు ఆశ్చర్య పోనవసరం లేదని, సమర్థుడైన ప్రమోటర్ ద్వారా నిర్వహించిన ఆస్తులని రాజీవ్ జైన్ ప్రకటించారు. కాగా జీక్యూజీ చైర్మన్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ రాజీవ్ జైన్, 2 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ బిలియనీర్స్ 2023 జాబితాలో ప్రవేశించారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలు 20-75 శాతం మధ్య ర్యాలీ చేశాయి. దీనికి తోడు అదానీ గ్రూపులో అవకతవకలపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం నియమించిన ప్యానెల్ తేల్చి చెప్పడంతో అదానీ షేర్లలో ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. ఫలితంగా సోమవారం నాటికి కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. ఫిబ్రవరి 27నాటి కనిష్ట స్థాయి రూ.6.8 లక్షల కోట్ల నుంచి 50 శాతానికి పైగా రికవరీ. ఫిబ్రవరి 8న మొదటిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కు కంటే దిగువకు పడి పోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికకు ఒకరోజు ముందు గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.2 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) -
సుప్రీం కోర్టులో కేసు, 10 లక్షల కోట్లు దాటిన అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ.. ఏమైంది..?
అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్ని సుప్రీం కోర్ట్ ప్యానల్ తప్పుపట్టింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల్ని ఉల్లంఘించ లేదని తెలిపింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. గత శుక్రవారం అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ విలువ 9.34 లక్షల కోట్లు ఉంది. అయితే, సుప్రీం కోర్ట్ ప్రకటనతో.. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ కంపెనీ స్టాక్స్ దూసుకెళ్లాయి. వెరసీ ఆ సంస్థ విలువ అమాంతం పెరిగి రూ.10 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ వ్యాల్యూ ఈ ఒక్క రోజే 18 శాతం పెరిగింది. అదానీ విల్ మార్ 10 శాతం, అదానీ పోర్ట్స్ 8.15శాతం అంబుజా సిమెంట్ 6 శాతానికి చేరుకున్నాయి. 173 పేజీల నివేదిక విడుదల అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై ఖండిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఒపీ భట్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉన్న కమిటీ 173 పేజీల నివేదికను విడుదల చేసింది. అందులో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచే చర్యలు,సెబీ చేసిన దర్యాప్తులో అదానీ గ్రూప్ అవకతవకలు పాల్పడినట్లు ఎక్కడా కనిపించలేదని సూచించింది. చదవండి👉 ఈవీ బైక్ కొనుగోలు దారులకు భారీ షాక్.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు? -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూపు వివాదంలో గౌతం అదానీ భారీ ఊరట లభించింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యులు పానెల్ కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించలేదని తెలిపింది. ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేవు అదానీ గ్రూప్ ప్రస్తుత మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీం ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. తద్వారా స్టాక్ మానిప్లులేషన్స్‌తో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ చేసిన హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులకు సంబంధించి 2018 నిబంధనలు మారినప్పటికీ వాటినే అనుసరిస్తోందని కమిటీ వ్యాఖ్యానించింది. సెబీకి మూడు నెలల గడువు మరోవైపు సెబీకూడా ఈ వ్యవహారంలో దర్యాప్తునకు మరింత సమయం కావాలని కోరింది. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తును పూర్తి చేయడానికి సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల పొడిగింపును మంజూరు చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ స్టాక్ ధరల తారుమారు ఆరోపణలపై దర్యాప్తుపై అప్డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను ఆగస్టు 14లోగా సమర్పించాలని సుప్రీం సెబీకి సూచించింది. దీంతో శుక్రవార నాటి మార్కెట్లో అదానీగ్రూపు షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. కాగా హిండెన్‌బర్గ్ ఆరోపణలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్ ఏదైనా ఉల్లంఘనకు పాల్పడిందా అనే దానిపై దర్యాప్తు చేసే బాధ్యతను జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ మే 8న తన నివేదికను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించింది. -
Today Market Closing ఐటీ,అదానీ షేర్ల జోష్, వారాంతంలో సెన్సెక్స్ దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో హుషారుగా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు వివాదంలో సుప్రీం తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.దీనికి తోడు ఐటీషేర్లలో ర్యాలీ ఊతమిచ్చింది. ఫార్మా రంగ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 61730 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 18203 వద్ద ముగిసాయి. అదానీ కేసులో సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యుల ప్రత్యేక ప్యానెల్ ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది. అలాగే 13 ఎఫ్‌పిఐల వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులకు గ్రూప్‌తో లింక్ ఉందో లేదో నిర్ధారించేందుకు ఇంకా ఎక్కువ సమయం కావాలని సెబీ కోరింది. దీంతో అదానీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హిందాల్కొ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. (భారీ ఊరట: తగ్గిన పసిడి ధర, మరింత దిగొచ్చే అవకాశం!) అటు దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ లైఫ్, హీరో మోటార్స్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, నెస్లే, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసాయి.అటు గురువారం 82.59 ముగింపుతో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి స్వల్పంగా తగ్గి 82.66 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర ఇంట్రస్టింగ్ బిజినెస్ న్యూస్‌కోసం చదవండి: సాక్షి, బిజినెస్ -
అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్
SEBI on Adani: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణ కోరిన కొంతమంది పిటిషనర్లు ఆరోపించినట్లు తాము 2016 నుంచి ఏ అదానీ గ్రూప్ కంపెనీలపై విచారణ చేయలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇదీ చదవండి: Raghav Chadha Net Worth: పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా? ఇల్లు, కారు గురించి ఆసక్తికర విషయాలు ఈ మేరకు రిజాయిండర్ అఫిడవిట్‌ను సమర్పించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న విషయాల్లో ఎటువంటి పొంతన లేదని ఈ అఫిడవిట్లో సెబీ పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ విచారణ జరిపినట్లుగా పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. అయితే తాము విచారణ జరిపిన 51 భారతీయ లిస్టెడ్ కంపెనీలు గ్లోబల్ డిపాజిటరీ రసీదుల జారీకి సంబంధించినవని సెబీ వివరణ ఇచ్చింది. వీటిలో అదానీ గ్రూప్‌నకు చెందిన ఏ లిస్టెడ్ కంపెనీ లేదని స్పష్టం చేసింది. ‘పూర్తిగా అవాస్తవం’ తాము చేపట్టిన విచారణ అనంతరం సంబంధిత కంపెనీలపై తగిన చర్యలు తీసుకున్నామని సెబీ అఫిడవిట్లో పేర్కొంది. అందువల్ల 2016 నుంచే అదానీ గ్రూప్‌ను తాము విచారిస్తున్నట్లు చేసిన ఆరోపణ పూర్తిగా నిరాధారమైనదని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు సెబీ సుప్రీం కోర్టు మరో ఆరు నెలల సమయం కోరింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2016 నుంచే అదానీ గ్రూప్‌పై సెబీ విచారణ జరుపుతోందని పిటిషనర్ ఒకరు ఆరోపించారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
అదానీ - హిండెన్‌బర్గ్ వివాదంలో కీలక పరిణామం!
అదానీ - హిండెన్‌బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదికపై విచారణ జరిపించేందుకు సుప్రీం కోర్టు ఆరుగురు ప్యానెల్ సభ్యులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్యానల్ సభ్యులు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. మే 12న దీనిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం విచారించింది. అయితే నిపుణుల ప్యానెల్ విచారణ నిమిత్తం మరింత గడువు కోరిందా? లేదంటే నివేదికను అందించిందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ దేశీయ స్టాక్ మార్కెట్ చట్టాల్ని ఉల్లంఘించిందో? లేదో? దర్యాప్తు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను అంచనా వేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. నిబంధనలను పటిష్టం చేయడానికి, భారతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు సుప్రీం కోర్టు ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. సీల్డ్ కవర్లో ఏముందో? తాజాగా, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు తమకు మరో 6 నెలలు పొడిగించాలని సెబీ సుప్రీంను కోరినట్లు సమాచారం. దీనిపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఆరుగురు ప్యానెల్ సభ్యులు సుప్రీంకు నివేదిక అందివ్వగా.. ఆ సీల్డ్ కవర్ నివేదికలో ఏముందో అన్న చర్చ వ్యాపార వర్గాల్లో మొదలైంది విమర్శలు.. ఖండించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సుప్రీం కోర్టు విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా.. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జేపీ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్‌ను కమిటీ సభ్యులుగా పేర్కొంది. చదవండి👉 హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు! -
రుణ చెల్లింపుపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: ఇటీవల రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్ తాజాగా 13 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,066 కోట్లు) రుణాలను ముందస్తుగా చెల్లించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని బిలియనీర్.. గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తోంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ కొద్ది రోజులుగా రుణాలను ముందుగానే చెల్లిస్తోంది. దీనిలో భాగంగా గత నెలలో 2024 జూలైలో గడువు తీరనున్న 13 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను బైబ్యాక్ చేసేందుకు అదానీ పోర్ట్స్ టెండర్‌కు తెరతీసింది. ఈ బాటలో మరో 4 రుణాలను తిరిగి చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. టెండర్‌కు 41.27 కోట్ల డాలర్ల విలువైన బాండ్లు దాఖలైనట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. -
శరద్ పవార్ ఇంటికి గౌతమ్ అదానీ
ముంబై: మహారాష్ట్రలో ఇవాళ(గురువారం) ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani), యూపీఏ మిత్రపక్షం అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధ్యక్షులు శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. సౌత్ ముంబైలోని పవార్ సిల్వర్ ఓక్ ఇంటికి వెళ్లిన అదానీ.. రెండు గంటలపాటు అక్కడే గడిపారు. దీంతో ఈ భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక ఆధారంగా అదానీపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలన్నీ ఏకం కాగా, పవార్ మాత్రం జేపీసీని విభేదించారు. అంతేకాదు.. హిండెన్‌బర్గ్ నివేదిక వెనుక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారయన. ఈలోపు పవార్ తీరుపై విపక్షాల్లో అసహనం పెరిగిపోవడంతో జేపీసీకి బదులు.. సుప్రీం కోర్టు కమిటీని సమర్థిస్తూ తన అభిప్రాయం వెలిబుచ్చారాయన. జేపీసీలో మెజార్టీ సభ్యులు బీజేపీవాళ్లే ఉంటారని, కాబట్టి సుప్రీం ఆధారిత కమిటీనే ఈ వ్యవహారంలో విచారణకు మేలని విపక్షాలకు గుర్తు చేశారాయన. అయితే అంతలో మరోసారి స్వరం మార్చిన ఆయన.. విపక్షాల జేపీసీ విచారణ డిమాండ్‌కు తాము(ఎన్సీపీ) గళం కలపబోమని, అలాగని ఆ డిమాండ్‌ను వ్యతిరేకరించబోమని ప్రకటించారు. విపక్షాల ఐక్యత నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. అయితే.. అదానీ విషయంలో పవార్ మొదటి నుంచి మెతక వైఖరి ప్రదర్శిస్తుండడంపై పలు విమర్శలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల కిందట వీళ్లద్దరికీ మంచి స్నేహం ఉండేది. కోల్ సెక్టార్ విస్తరణలో ఈ వ్యాపారవేత్తకు, రాజకీయనేత అయిన పవార్‌కు మధ్య బంధం ఏర్పడింది. అంతేకాదు.. పవార్ తన ఆటోబయోగ్రఫీ లోక్ మజే సాంగతి(2015)లో.. అదానీ హార్డ్‌వర్కర్ అని, సాదాసీదాగా, డౌన్ టు ఎర్త్ ఉంటారని పవార్ పేర్కొనడం గమనార్హం. Amid the Opposition's demand for a Joint Parliamentary Committee probe into the Adani-Hindenburg issue, industrialist #GautamAdani on Thursday met NCP supremo #SharadPawar at the latter's Silver Oak residence in Mumbai. The meeting reportedly lasted for over two hours. pic.twitter.com/ZivU9Q2KNF — Abhinay Deshpande (అభినయ్ देशपांडे) (@iAbhinayD) April 20, 2023 ఇదీ చదవండి: పారిపోయే యత్నం.. అమృత్‌పాల్ భార్య అరెస్ట్! -
Adani Row: ఆయన స్వరం మారింది
ముంబై: హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై విపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్వరం మార్చారు. ఈ అంశంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ)ని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ సమావేశాలను సైతం విపక్షాలు స్తంభింపజేశాయి. అయితే.. విపక్షాల జేపీసీ డిమాండ్‌కు తాము అంగీకరించబోమని, కాకుంటే విపక్షాల ఐక్యత కోసం వాళ్ల డిమాండ్‌ను వ్యతిరేకించబోమని మంగళవారం ప్రకటించారాయన. ఈ విషయంలో(జేపీసీ డిమాండ్) మా మిత్ర పార్టీలతో మేం విబేధిస్తున్నాం. మద్దతు ఇవ్వం. కానీ, మేం ఐక్యంగా కొనసాగాలనుకుంటున్నాం. అందుకే విపక్షాల డిమాండ్‌ను వ్యతిరేకించకూడదని నిర్ణయించుకున్నాం అని ఓ మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ తెలిపారు. అంతకు ముందు ఇదే ఎన్సీపీ చీఫ్ హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై జేపీసీ విచారణకు తాను పూర్తిగా వ్యతిరేకం కాదని పేర్కొన్నారాయన. ఈ విషయంలో సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు ప్యానెల్ మరింత ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కొన్నిరోజులకే ఆయన స్వరం మార్చారు. గత వారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా మాట్లాడారు. హిండెన్‌బర్గ్ నివేదిక ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా, కేవలం విమర్శనాత్మకంగా ఉందంటూ పేర్కొన్నారు పవార్. ‘‘గతంలో మేం అధికారిక ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో పదేపదే టాటా బిర్లా పేర్లు ప్రస్తావించేవాళ్లం. అలా అని వాళ్లు ఈ దేశానికి చేసిన సేవల్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా దేశానికి ఏం చేశారన్నది ఓ సారి పరిశీలించాలి. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్‌లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే.. అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పవార్ 2015లో తన ఆటోబయోగ్రఫీలో అదానీనీ పొడుగుతూ.. రాసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అదానీతో బంధం వల్లే ఆయన విమర్శించలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపైనా ఈ అంశం ప్రభావం చూపెట్టవచ్చని, 2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని ముందుకు పోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఇది.. అడ్డుపుల్లాలాంటి ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రాహుల్ గాంధీకి గౌతమ్ అదానీ కౌంటర్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బిలియనీర్ గౌతమ్ అదానీ కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు అంతా పారదర్శకమేనని, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుపుతూ అదానీ గ్రూప్ నివేదికను విడుదల చేసింది. అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ..అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలపై అదానీ గ్రూప్ కౌంటర్‌గా పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలిపింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ 2019 నుండి గ్రూప్ సంస్థలలో 2.87 బిలియన్ డాలర్ల వాటా విక్రయాల వివరాలు, అలాగే 2.55 బిలియన్ డాలర్లు గ్రూప్ కంపెనీల వ్యాపారాల్లోకి ఎలా వచ్చాయన్న విషయాలనూ వివరించింది. కాగా, అదానీ గ్రూప్‌లో విదేశీ పెట్టుబుడులపై ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. ఇది గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ‘ఉద్దేశపూర్వక’ ప్రయత్నమని పేర్కొంది -
Hindenburg-Adani: జేపీసీ కంటే కోర్టు కమిటీ అత్యుత్తమం
ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్‌తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు. నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్‌బర్గ్‌ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్‌పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. -
బ్లాక్ కంపెనీని టార్గెట్ చేసిన హిండెన్‌బర్గ్.. జాక్ డార్సీకి షాక్!
న్యూఢిల్లీ: షార్ట్‌సెల్లింగ్ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా మరో కంపెనీని టార్గెట్ చేసుకుంది. ఈసారి ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీకి చెందిన చెల్లింపుల కంపెనీ బ్లాక్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లను బ్లాక్ తప్పుదోవ పట్టించిందంటూ నివేదికను ప్రచురించింది. 1 బిలియన్ డాలర్ల పైగా మోసానికి పాల్పడిందంటూ ఆరోపించింది. దాదాపు రెండేళ్ల పరిశోధన తర్వాత ఈ రిపోర్టును రూపొదించినట్లు పేర్కొంది. ఈ నివేదికతో అమెరికా మార్కెట్లో బ్లాక్ షేర్లు ఒక దశలో 20 శాతం పైగా క్షీణించి 58 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ ఈ ఏడాది జనవరిలో ఆరోపించడం, ఫలితంగా అదానీ సంస్థల షేర్లు భారీగా పతనం కావడం తెలిసిందే. అంతకు ముందు 2020లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్‌పై కూడా హిండెన్‌బర్గ్ పలు ఆరోపణలు చేసింది. దీనితో ఆ కంపెనీ షేరు పతనం కావడంతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. -
చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే..
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని అమెరికా మొబైల్ చెల్లింపు సంస్థ ‘బ్లాక్’పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది. అవకతవకలకు పాల్పడిదంటూ ఆరోపించింది. ఈ నివేదిక ప్రకారం.. గతంలో స్వేర్ (Square Inc) అనే పేరుతో ఉన్న ఈ బ్లాక్ (Block Inc) సంస్థ మార్కెట్ విలువ 44 బిలియన్ డాలర్లు. బ్యాంక్ ఖాతాలు లేనివారి కోసం ఈ సంస్థ సరికొత్త ఆర్థిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి? అయితే అదే టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులను పెంచుకున్న బ్లాక్ సంస్థ దాన్ని అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. వినియోగదారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసాన్ని సులభతరం చేయడం, నియంత్రణను నివారించడం, రుణాలు, ఫీజుల దోపిడీని విప్లవాత్మక సాంకేతికతగా మార్చిందని ఆక్షేపించింది. యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. 40 నుంచి 75 శాతం అకౌంట్లు ఫేక్‌వే కరోనా సంక్షోభం అనంతరం బ్లాక్ క్యాష్ యాప్ పురోగతి చాలా మంది విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లాక్ తన యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపిందని, అదే సమయంలో ఖర్చులను తక్కువగా చూపించిందని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. బ్లాక్ కస్టమర్ల అకౌంట్లలో 40 నుంచి 75 శాతం ఫేక్‌వేనని ఆరోపించింది. కోవిడ్ సమయంలో 18 నెలల్లో 639 శాతం పెరిగిన బ్లాక్ స్టాక్‌కు కొత్త వ్యాపారం ఒక్కసారిగా పెరుగుదలను అందించిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! జాక్ డోర్సీపై ఆరోపణలు జాక్ డోర్సే బ్లాక్‌లో మోసాన్ని సులభతరం చేశారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన డోర్సే 2015 నుంచి 2021 వరకు దాని సీఈవోగా పనిచేశారు. కోవిడ్ సమయంలో బిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను డంప్ చేయడం ద్వారా ఆయన లాభపడ్డారని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపించింది. బ్లాక్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వే ఇద్దరూ 1 బిలియన్ డాలర్ల స్టాక్‌ను విక్రయించారని పేర్కొంది. సీఎఫ్‌వో అమృతా అహుజాతో సహా ఇతర అధికారులు, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియా కూడా మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను డంప్ చేశారని ఆరోపించింది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరుతో కూడా.. బ్లాక్ క్యాష్ యాప్‌లో జాక్ డోర్సీకి అనేక ఫేక్ ఖాతాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా డజన్ల కొద్దీ నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయని వివరించింది. ఇదీ చదవండి: పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు! -
హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?
న్యూఢిల్లీ:యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌పై వెల్లడించిన రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్లాక్ఇంక్ ఏంటి? సహ వ్యవస్థపాకులతోపాటు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీ భారతీయ-అమెరికన్ సీఎఫ్‌వో అమృతా అహుజా గురించిన వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ ఇంకపై హిండెన్‌బర్గ్ గురువారం కీలక రిపోర్ట్‌ను వెల్లడించింది. జాక్ డోర్సే జేమ్స్ మెక్కెల్వీతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్, బ్రియాన్ గ్రాసడోనియాతో సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లు "మిలియన్ల డాలర్లను స్టాక్‌లో పెట్టారని " ఆరోపించింది. (ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) పెట్టుబడిదారులను మోసం చేసేందుకు కస్టమర్లను ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిపోర్ట్ ప్రకారం మోసంద్వారా వచ్చిన లాభాలను దోచు కున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో జాక్ డోర్సే , జేమ్స్ మెక్ కెల్వే సమిష్టిగా 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. అలాగే సీఎఫ్‌వో అమృతా అహుజా సహా ఇతర ఎగ్జిక్యూటివ్స్‌పై కూడా విమర్శలు గుప్పించింది. అమృతా అహుజా ఎవరు? ♦ అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్సిటీ , హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రీమియం విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి. ♦ 2019లో బ్లాక్‌లో చేరడానికి ముందు, ఆమె ఎయిర్బిఎన్బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ♦ ఆమె 2001లో కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ♦ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, అహుజా క్లీవ్‌ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్ నిర్వహించే భారతీయ వలసదారుల కుమార్తె. ♦ ఫాక్స్‌లో పనిచేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ♦ "కాల్ ఆఫ్ డ్యూటీ," "కాండీ క్రష్" , "వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్" వంటి పాపులర్ గేమ్‌ల వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజారే కంపెనీకి అభివృద్ధిలో తోడ్పడింది. ఆన్ స్టోర్ బిజినెస్ మోడల్నుంచి,ఆన్లైన్, ఆల్వేస్ ఆన్ లాంటి మల్టీప్లేయర్ వ్యాపార నమూనాతో అమ్మకాలతో దుమ్ము రేపేలా సాయపడింది. ♦ ఆమె 2022లో ఫార్చ్యూన్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్‌లో కనిపించింది. ♦ భర్త హర్‌ప్రీత్ మార్వాహ. 7 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు. ♦ తొలి ఉద్యోగం: ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ హైట్స్‌లోని ఆమె తల్లిదండ్రుల డేకేర్‌లో సమ్మర్ క్యాంప్ కౌన్సెలర్ ఇవీ చదవండి: రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు -
ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నెక్ట్స్ బాంబును ట్విటర్‌మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది. డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ అక్రమాలను బైట పెట్టింది. తమ రెండేళ్లలో పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు షార్ట్ సెల్లర్ తన వెబ్సైట్లో ప్రచురించిన నోట్లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న "మాయాజాలం"అని వ్యాఖ్యానించింది. బ్లాక్ సంస్థ "అండర్‌బ్యాంక్" కస్టమర్లలో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు న్నారని కూడా ఆరోపించింది. మోసం, ఇతర స్కామ్‌ల నిమిత్తం ఖాతాలను భారీగా సృష్టించడం, ఆపై అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసిందని తెలిపింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం. NEW FROM US: Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ (1/n) — Hindenburg Research (@HindenburgRes) March 23, 2023 -
త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్..
వివాదస్పద నివేదికతో అదానీ గ్రూప్‌ను దెబ్బ కొట్టిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ మోసాలు, అక్రమాలను బహిర్గతం చేస్తూ మరో ‘పెద్ద’ నివేదికను త్వరలో విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా హిండెన్‌బర్గ్ తెలియజేసింది. అయితే ఈసారి హిండెన్ బర్గ్ ఎవరిని లక్ష్యం చేసుకుందోనన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో మొదలయింది. ఏమిటీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్? ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్‌లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్. ఈ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అక్రమాలు, దుర్వినియోగం, బహిర్గతం చేయని లావాదేవీలను ఈ సంస్థ శోధించి బయటపెడుతుంది. ఇందుకోసం కంపెనీ తన సొంత మూలధనాన్ని ఖర్చు పెడుతుంది. హిండెన్‌బర్గ్ వెబ్సైట్ పేర్కొన్న దాని ప్రకారం.. 2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో అవకతవకలను గుర్తించి బయటపెట్టింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలతో కుదుపు ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిదంటూ గత జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ను వెలువరించింది. దాన్ని మరుసటి రోజున ట్విటర్లో షేర్ చేసింది. మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న అనేక మందితో మాట్లాడి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించి ఈ నివేదిక వెలువరించినట్లు హిండెన్‌బర్గ్ పేర్కొంది. అయితే హిండెన్ బర్గ్ నివేదిక పట్ల చాలా అనుమానాలున్నాయి. కేవలం తాను షార్ట్ సెల్లింగ్ చేసేందుకు గాను, అంటే తనకు ప్రయోజనం కల్పించుకునేందుకు హిండెన్ బర్గ్ ఆరోపణలు గుప్పించిందని పలువురు విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలంటూ SEBI సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : హిండెన్ బర్గ్ పై హరీష్ సాల్వే వ్యాఖ్యలు) ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ ఈ నివేదిక వెలువడిన ఐదు వారాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్న గౌతమ్ అదానీ వెనుకబడిపోయాడు. అదానీ గ్రూప్ కూడా ఊహించని విధంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేసిన రూ.20,000 కోట్ల ఎఫ్‌పీవోను ఉపసంహరించుకుంది. అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. -
కుబేరుల్లో ఒకే ఒక్కడు అంబానీ! 23వ స్థానానికి అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్ సంస్థ హురున్, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్ రిచ్ లిస్ట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. క్షీణతలో బెజోస్ టాప్.. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్‌లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పడిపోయి 118 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్ రిపోర్ట్ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్ డాలర్ల మేర (రోజుకు రూ. 3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 2023 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ► గతేడాదితో పోలిస్తే భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ► భారత్‌లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. -
అదానీ గ్రూప్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్ల విలువ చేసే పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2021లో అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు చెందిన స్థలంలో ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బొగ్గు నుంచి పీవీసీ వరకు ఉత్పత్తి చేసేలా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకాన్ని కలిగించేలా రుణాలను తిరిగి చెల్లించింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం నిలిపివేసింది. అందులో భాగంగానే తాజాగా ముంద్రా ప్రాజెక్టును పక్కన పెట్టింది. -
వినోద్ అదానీ ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమే: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ విషయంలో అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్‌లోని వివిధ లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్‌లో వినోద్ కూడా ఒకరని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వినోద్ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే. వినోద్‌కు అదానీ గ్రూప్‌లోని ఏ లిస్టెడ్ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. వినోద్ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది. -
హిండెన్‌బర్గ్ - అదానీ వివాదం : అషిమా గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత మార్కెట్లు మరింత బలంగా, వైవిధ్యంగా మారాయని ఆర్బీఐ ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఇవి అదానీ గ్రూపు అంశాన్ని సాఫీగా సర్దుబాటు చేసుకున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర సంస్థలకు వ్యాపించలేదని లేదా సంక్షోభంగా మారలేదని గుర్తు చేశారు. నియంత్రణ సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను కఠినతరం చేశాయని, అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. విడిగా గ్రూపులకు సంబంధించి ప్రభుత్వానికి ఆందోళన లేదన్నారు. జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. విదేశాలకు అక్రమ మార్గాల్లో డబ్బులు తరలించి, షెల్ కంపెనీల ద్వారా ఇక్కడ అదానీ గ్రూపు షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినట్టు ఆరోపించింది. ఖాతాల్లోనూ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. వీటిని అదానీ గ్రూపు ఖండించింది. భారత్‌కు చెందిన బడా కార్పొరేట్లు విదేశీ నిధులు సమీకరిస్తుండడంతో, విదేశీ అనలిస్టుల వైపు నుంచి వాటి ఖాతాలపై సునిశిత పరిశీలన ఉంటుందని గోయల్ చెప్పారు. ‘‘భారతీయ సంస్థలు ఇప్పటికీ సంక్లిష్టమైన నిర్మాణాలను కలిగి ఉన్నాయి. దీంతో పారదర్శకత లోపిస్తోంది. ఫలితంగా హిండెన్‌బర్గ్ వంటి సంస్థలకు అవకాశాలు కల్పిస్తోంది.’’అని గోయల్ అభిప్రాయపడ్డారు. -
రెండో విడత పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ, అదానీ వ్యవహారం, రాజకీయ ప్రత్యర్థు్టలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. వ్యూహరచన చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం సమావేశం కానున్నాయి. అదానీ–హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌ను తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకుడు కె. సురేశ్ చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల్లో సీబీఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీ నాయకులపైకి ప్రయోగిస్తోందన్న అంశం కూడా ఈ సారి సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. మార్చి 13న మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. సహకరించండి: ఉపరాష్ట్రపతి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ నిర్వహణపై విపక్ష నేతల నుంచి సూచనలు, సలహాలను కోరారు. సమావేశానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, విజయ సాయిరెడ్డి (వైఎస్సార్సీపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్) రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కె.రవీంద్రకుమార్ (టీడీపీ), కేశవరావు (బీఆర్ఎస్)లతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ డిమాండ్లను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధన్‌ఖఢ్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్లు విజయసాయిరెడ్డి, భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సుసరేంద్ర సింగ్ నగార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రతి అంశంపైనా చర్చకు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బాధ్యునిగా చేసేందుకు నిర్మాణాత్మకపాత్ర పోషిస్తాయని అన్నారు. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీకి పెరిగిపోతున్న దేశాధినేతల సపోర్ట్!
అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తోసిపుచ్చారు. రెగ్యులేటర్లు ఈ విషయాన్ని పరిశీలిస్తారని, తనకు సంబంధించినంత వరకు ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ‘‘ఆరోపణలు చేయడం చాలా తేలిక. ఏదో ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజం కాదు. నేరం రుజువయ్యే వరకు మీరు నిర్దోషే’’ అని చెప్పే న్యాయ సూత్రాల గురించి ప్రస్తావించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ చేస్తున్న ఆరోపణలపై భారత్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో టోనీ అబాట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞుడను. తన దేశంలో బిలియన్ల డాలర్ల విలువైన అదానీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. ఆ పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు, సంపద సృష్టించామని చెప్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా నుంచి అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు సహాయంతో.. భారత్‌లో నిరంతరం విద్యుత్తును అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయం చేశారని గౌతమ్ అదానీపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి అదానీ గ్రూప్‌పై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరికాదని, హిండెన్ బర్గ్ చేస్తున్న అసత్య ఆరోపణల్ని ఖండిస్తున్నట్లు టోనీ అబాట్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌పై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు! అదానీ అండగా టోనీ అబాట్ కాగా,2015లో అబాట్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆస్ట్రేయాలియాలో అదానీ కార్మైకేల్ సంస్థ బొగ్గు గనుల్ని వెలికితీసేందుకు పూనుకుంది. ఆ బొగ్గు వెలికి తీతపై స్థానిక కోర్టు తీవ్రంగా ఖండించింది. గనుల పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. దీన్ని ఖండించిన అబాట్ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల విస్తృతస్థాయి ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ అదానీ గ్రూప్‌కు అండగా నిలిచారు. ఎట్టకేలకు 2019లో అదానీ గ్రూప్‌నకు తుది అనుమతులు లభించాయి. అక్కడి నుంచి వెలికితీసిన బొగ్గునే ఇప్పుడు అదానీ గ్రూప్ భారత్‌కు సరఫరా చేస్తోంది. -
హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు!
అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ ‘నో గుడ్ స్మార్టానీయన్’.అందుకు పూర్తిగా విభిన్నమైంది. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల నుంచి డబ్బుల్ని కొల్లగొట్టడం విచారకరమని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ - అదానీ గ్రూప్ అంశంపై ఓ మీడియా సంస్థ నిర్వహించిన డిబెట్లో పాల్గొన్న హరీష్ సాల్వే.. హిండెన్ బర్గ్ తీరును విమర్శించారు. హిండెన్ బర్గ్ నో స్మార్టానీయన్. అవకాశావాది. తమకు అనుగుణంగా నివేదికను విడుదల చేయడం, మళ్లీ అదే నివేదికను కనుమరుగు చేయడం ఏంటని ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్ సంస్థను 'అనైతిక షార్ట్ సెల్లర్'గా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని అన్నారు. షేర్ వ్యాల్యూని తగ్గించి టన్నుల కొద్ది మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల పెట్టబుడుల్ని కాజేసింది ఎవరనేది స్పష్టం చేస్తుందని తెలిపారు. హిండెన్ బర్గ్ స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేషన్ చేయడంలో దిట్ట. ఆ సంస్థ ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించాలి. ఉదాహరణకు కంపెనీలు స్టాక్ మార్కెట్లోని మదుపర్లని మోసం చేస్తున్నాయని నిజంగా అనిపిస్తే.. అందుకు తగ్గ ఆధారాలుంటే వెంటనే భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తే విచారణ జరిపిస్తారు. కానీ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ అలా చేయలేదు. డైరెక్ట్‌గా రిపోర్ట్‌లను అడ్డం పెట్టుకొని కంపెనీలపై దాడులకు పాల్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా అని సెబీ చూస్తూ కూర్చొదుగా. ఎవరు స్టాక్ మార్కెట్లోని అలజడని సృష్టించి తద్వారా డబ్బుల్ని సంపాదిస్తున్నారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల డబ్బుల్ని కాజేస్తున్నారో ఇలా అందర్ని వెలుగులోకి తెస్తుందన్నారు. మనదేశంలో ఇదో కొత్త గేమ్. కేపిటల్ మార్కెట్ వృద్ది సాధిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టైన ప్రతి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులు మక్కువ చూపుతుంటారు. హిండెన్ బర్గ్ లాంటి రిపోర్ట్లు వెలుగులోకి వచ్చి.. అవి అబ్ధమని రుజువయ్యే సమయానికి సదరు కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింతుందని వెల్లడించారు. కాగా, సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆరుగురు సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే, ఎస్బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్, ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖరన్ సుందరేశన్ ఉన్నారని మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే చెప్పారు. -
‘అదానీ’పై సుప్రీం నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత దేశంలో 140 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విచారణ జరపడంతోపాటు మదుపర్ల ప్రయోజనాలను కాపాడేలా చర్యలను సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేత్వత్వం వహించే ఈ కమిటీలో ఎస్బీఐ మాజీ చైర్మన్ ఒ.పి.భట్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి.దేవధర్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ అధినేత కె.వి.కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మాజీ అధినేత నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారని తెలియజేసింది. స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేసి, నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సెబీని ఆదేశించింది. హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ అక్రమాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల మదుపరులు భారీగా నష్టపోయారని, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా వారు నష్టపోకుండా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. పెట్టుబడిదారులను చైతన్యవంతంచేయడానికి చేపట్టాల్సిన చర్యలను సైతం సిఫార్సు చేయాలని కమిటీకి స్పష్టంచేసింది. కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదానీ గ్రూప్ వ్యవహారాలపై దర్యాప్తునకు కమిటీని నియమించడానికి తమకు అభ్యంతరం లేదంటూ గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించినసంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని, తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం ఇప్పటికే తేల్చిచెప్పింది. కాగా, కోర్టు నిర్ణయంపై గౌతమ్ అదానీ స్పందించారు. నిర్దిష్ట గడువులోగా ఈ వ్యవహారమంతా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు. సత్యం గెలుస్తుంది అని పేర్కొన్నారు. -
సత్యమే గెలుస్తుంది: గౌతం అదానీ
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీ స్పందించారు. సమయాను కూలంగా నిజాలు నిగ్గు తేలతాయని... సత్యమే గెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు) The Adani Group welcomes the order of the Hon'ble Supreme Court. It will bring finality in a time bound manner. Truth will prevail. — Gautam Adani (@gautam_adani) March 2, 2023 హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించింది. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా రెగ్యులేటరీ బాడీని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే ఆరుగురు నిపుణులతో ఒక కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఇప్పటికే అదానీ కొట్టిపారేశారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ అదానీ గతంలోనే గ్రూపు సమూహం 413 పేజీల ప్రతిస్పందనను కూడా విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ ,వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని సెబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీనియర్ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్లో కోరారు. దీంతోపాటు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, ఒకసామాజిక కార్యకర్త కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. -
అదానీ హిండన్‌బర్గ్ అంశంపై సెబీ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం
-
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు - హిండెన్‌బర్గ్ వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెగ్యులేషన్ నిబంధనల ఉల్లంఘన ఉంటే కచ్చితంగా సెబీ విచారణ చేపట్టాలని సెబీని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ న్యాయమూర్తులు జేపీ దేవదత్, ఓపీ భట్‌తోపాటు కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర సుందరేశన్ ఉన్నారు. ఈ ప్యానెల్‌కు అన్నివిధాలా సహకారాన్ని అందించాలని కేంద్రం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్‌పర్సన్‌ను బెంచ్ ఆదేశించింది. అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్ల బ్యాచ్‌ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం ప్యానెల్ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు. -
అదానీకి ఊరట:వేల కోట్ల మార్కెట్ క్యాప్ జంప్, ఎందుకు?
సాక్షి,ముంబై: షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో విలవిల్లాడుతున్న అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. బుధవారం నాటి మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా ఎగిసాయి. దీంతో అదానీ గ్రూప్ ఎం-క్యాప్ ఏకంగా రూ. 39 వేల కోట్లు మేర పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లు పెరగడం ఇది రెండో రోజు. అదానీకి చెందిన రెండో విలువైన స్టాక్ అదానీ పోర్ట్స్ & సెజ్, ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.4,277 కోట్లు జోడించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 10 శాతం జంప్ చేసి రూ.1,500 స్థాయికి చేరుకున్నాయి. వీటితోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ jpce గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ. 39,000 కోట్ల నుంచి రూ. 7.50 లక్షల కోట్ల మార్కుకు పెంచిన స్టాక్‌లలో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 10 శాతం ఎగసింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 29 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్ రూ.4,277 కోట్లు ,అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.3,841 కోట్లు , అదానీ పవర్, అదానీ విల్మార్ , అంబుజా సిమెంట్స్ రూ. 2-3వేల కోట్లను గ్రూప్ ఎం-క్యాప్‌కు జోడించడ విశేషం. ముంద్రా అల్యూమినియం కాగా కంపెనీ అనుబంధ సంస్థ ముంద్రా అల్యూమినియం, ఒడిశాలోని కుట్రుమాలి బాక్సైట్ బ్లాక్ తవ్వకాలకు ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఒడిషాలోని కలహండి ,రాయగడ జిల్లాల్లో ఉన్న ఈ బ్లాక్‌లో మొత్తం 128 మిలియన్ టన్నుల భౌగోళిక వనరులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) పొందింది. మరోవైపు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్ సింగపూర్, హాంకాంగ్‌లలో ఫిక్ట్స్డ్ ఇన్‌కం రోడ్‌షోను నిర్వహిస్తోంది. దీనికి తోడు అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 800 మిలియన్ల డాలర్లు రుణ సదుపాయాన్ని పొంద నుందన్న నివేదికలు పాజిటివ్‌గా మారాయి. -
వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్ఈఎస్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గ్రూప్ మార్కెట్ క్యాప్(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇచ్చింది. గ్రూప్ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా గ్రూప్ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. క్యాష్ ఫ్లోలు ఓకే అదానీ గ్రూప్‌లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్ఈఎస్ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్‌లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్మిషన్ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్ ప్రసారం బిజినెస్ ద్వారా ఫిక్స్డ్ రిటర్న్ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది. -
వరుస నష్టాలు, గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో అదానీ ఎక్కడంటే?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపుపై ఆందోళనల మధ్య గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్‌తో గత ఐదు నెలల్లో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో విదేశీ నిధుల ప్రవాహం, ఐటీ, ఆటో, ఆయిల్ స్టాక్స్‌లో నష్టాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీశాయి. చివరికి సెన్సెక్స్ 176 పాయింట్లు లేదా 0.30 శాతం క్షీణించి 59,288 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 526 పాయింట్ల మేర కుప్పకూలింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 17,393 వద్ద ముగిసింది. కాగా ఏడు సెషన్లలో, సెన్సెక్స్ 2,031 పాయింట్లు లేదా 3.4 శాతం క్షీణించగా, నిఫ్టీ 643 పాయింట్లు లేదా 4.1 శాతం నష్టపోయి 17,400 స్థాయికి దిగువన ముగిసింది. అటు డాలరుమారకంలో రూపాయి 9పైసల నష్టంతో 82.84 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, లార్సెన్ & టూబ్రో, భారతీ ఎయిర్టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోగా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. 40 బిలియన్ డాలర్ల దిగువకు అదానీ మార్కెట్ క్యాప్ మరోవైపు అమెరికా షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల తరువాత బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 బిలియన్ల డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రధానంగా ఫిబ్రవరి 27న అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 12 శాతం క్షీణించి 1107 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో పుంజుకుని 1188 వద్ద ముగిసింది. దీంతో గ్రూప్ వాల్యుయేషన్ ఆగస్టు 2021 తర్వాత మొదటిసారిగా రూ. 7 లక్షల కోట్ల దిగువకు పడిపోయిందని మార్కెట్ వర్గాల అంచనా. జనవరి 24 నాటికి రూ. 19.19 లక్షల కోట్లతో పోలిస్తే 65 శాతం క్షీణించింది. దీంతో గౌతం అదానీ ఇప్పుడు గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 39వ స్థానానికి పడిపోయారు. -
హైదరాబాద్ కంపెనీలకు ‘హిండెన్‌బర్గ్ బూచి’
సాక్షి, హైదరాబాద్: ‘హిండెన్‌బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు థ్యాంక్స్ చెబుతున్న ట్రక్ డ్రైవర్లు.. ఎందుకో తెలుసా!
సిమ్లా: భారత్‌లో ఇటీవల అదానీ గ్రూప్ వెర్సస్ హిండెన్‌బర్గ్ వివాదం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈ నివేదిక కారణంగా అదానీ ఆస్తులు చూస్తుండగానే కరిపోతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని అస్త్రంగా మార్చుకుని కేంద్రంపై దాడికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్లు హిండెన్‌బర్గ్ నివేదికు ధన్యవాదాలు చెబుతున్నారు. అసలు ఈ రిపోర్ట్ ట్రక్ డ్రైవర్లకు ఏం చేసింది, వారేందుకు థ్యాంక్యు చెప్తున్నారో తెలుసుకుందాం! థ్యాంక్యూ హిండెన్‌బర్గ్ ట్రక్ డ్రైవర్లు సిమెంట్ సరఫరాకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, ఈ కారణంగా ప్లాంట్ నడపడం లాభదాయకం కాదని అదానీ సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని గాగల్, దార్లఘాట్‌లోని అదానీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని సుమారు 7,000 మంది ట్రక్కు యజమానులు, డ్రైవర్లు వారాల తరబడి నిరసన ర్యాలీలను మొదలుపెట్టారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం ట్రక్ డ్రైవర్లకు.. అదానీ గ్రూప్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ‘హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిని తర్వాత అదానీ గ్రూప్‌పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కుంటున్న ఈ సంస్థ ఇటువంటి సమయంలో తమ ప్లాంట్లను మూసివేస్తే అది తప్పకుండా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి అదానీ ప్రతినిధులు ట్రక్ డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ సారి సిమెట్ సరఫరాకు వసూలు చేస్తున్న మొత్తంలో 10 నుంచి 12 శాతం తగ్గించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ట్రక్ డ్రైవర్లు తమ ఆందోళనను విరమించారు. అంతేకాకుండా సిమెంట్ ప్లాంట్లను మూసివేయాలన్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, ఇకపై అవి యథావిధిగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిందంటే కారణం.. హిండెన్‌బర్గ్ నివేదిక వల్లేనని భావించిన ట్రక్ డ్రైవర్లు ఈ సందర్భంగా హిండెన్ బర్గ్ థ్యాంక్స్ చెబుతున్నారు. చదవండి 70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ! -
అదానీ- హిండెన్‌బర్గ్ వివాదం.. డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి గాధపై అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాద ప్రభావమేమీ ఉండబోదని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కార్పొరేట్ గ్రూప్‌నకు మాత్రమే పరిమితమైన విషయమే తప్ప, దీనితో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌పై నమ్మకమేమీ సడలబోదని పేర్కొన్నారు. పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉంటాయనే అభిప్రాయాలను సింగ్ తోసిపుచ్చారు. అయితే అధిక వృద్ధి బాటలో ముందుకెళ్లాలంటే అదానీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకుని, పెట్టుబడిని పెంచుకోవాలని సూచించారు. భారీగా షేర్ల విక్రయాల సమయంలో కొందరు బ్లాక్‌మెయిలర్లు నివేదికలతో బైటికొస్తుంటారని చెప్పారు. -
George Soros: ఎవరీయన.. ప్రధాని మోదీని ఏమన్నాడంటే..
జార్జ్ సోరోస్.(92). ఈ పేరు వింటే చాలూ బీజేపీ మండిపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్రం తరపున మంతత్రి స్మృతి ఇరానీ సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఇంతకీ ఈయనెవరూ? ప్రధాని మోదీని ఏమన్నారంటే.. ► జార్జ్ సోరోస్.. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో 32 బిలియన్ డాలర్లను దానం చేస్తున్నట్లు ప్రకటించి.. 15 బిలియన్డాలర్లు ఇప్పటికే ఇచ్చేశాడు కూడా. ప్రపంచంలోకెల్లా ‘అత్యంత ఉదార దాత’ అనే బిరుదును ఈయనకు కట్టబెట్టింది ఫోర్బ్స్. అయితే.. ► మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(జర్మనీ--ఫిబ్రవరి 17-19 తేదీల నడుమ జరగనుంది) దరిమిలా.. జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని లేవనెత్తిన ఆయన.. విదేశీ పెట్టుబడిదారులు, భారత పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ► ‘మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. మోదీ బలహీన పడే అవకాశముంది. ‘‘ఈ పరిణామం కచ్చితంగా భారత సమాఖ్య ప్రభుత్వంపై ఆ దేశ ప్రధాని మోదీకి ఉన్న పట్టును గణనీయంగా బలహీనపరుస్తుంది.సంస్థాగత సంస్కరణల కోసం తలుపులు తెరవాల్సి వస్తుంది. నాకు అక్కడి(భారత్) విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను" అని మిస్టర్ సోరోస్ పేర్కొన్నారు. ► ఈ బిలియనీర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు మండిపడుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోరోస్ వ్యాఖ్యలను ‘భారత్‌పై సహించరాని దాడి’గా అభివర్ణించారామె.విదేశీ శక్తులంతా మూకుమ్మడిగా భారత ప్రజాస్వామ్య విధానంలో జోక్యం చేసుకునే యత్నం చేస్తున్నాయని.. దేశప్రజలంతా కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపు ఇచ్చారు.అంతేకాదు సోరోస్‌ను ఆర్థిక యుద్ధ నేరగాడిగా అభివర్ణించారామె. ఆయన కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను దోచుకున్న సోరోస్‌ను ఆర్థిక నేరగాడిగా ఆ దేశం ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. గతంలోనూ మన అంతర్గత వ్యవహారాల్లో ఇలాగే విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మనం ఓడించాం. ఈసారి కూడా అలాగే చేస్తాం అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. Whether the PM-linked Adani scam sparks a democratic revival in India depends entirely on the Congress, Opposition parties & our electoral process. It has NOTHING to do with George Soros. Our Nehruvian legacy ensures people like Soros cannot determine our electoral outcomes. — Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023 ► జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపకక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్ సోరోస్ కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ► ప్రపంచ ధనికుల్లో ఒకరైన జార్జ్ సోరోస్.. హంగేరీలో ఓ జూయిష్ ఫ్యామిలీలో పుట్టారు. నాజీల రంగ ప్రవేశంతో.. ఆయన కుటుంబం లండన్‌కు వలస వెళ్లింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆపై లండన్‌లోనే ఓ ప్రముఖ బ్యాంక్‌లో కొంతకాలం పని చేసి.. 1956లో ఆయన న్యూయార్క్‌కు వెళ్లి యూరోపియన్ సెక్యూరిటీస్ అనలిస్ట్‌గా పని చేయడం ప్రారంభించారు. ► 1973లో హెడ్గే ఫండ్(పూల్ ఇన్వెస్ట్మెంట్) అనే సాహసోపేతమైన అడుగుతో ఆర్థిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారాయన. ఆపై ఎన్నో సంచలనాలకు ఆయన నెలవయ్యాడు. ► బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఆయన దగ్గరి సంపద 8.5 బిలియన్ డాలర్లు. అలాగే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో ఛారిటీ పనులు చేస్తున్నారాయన. ప్రజాస్వామ్య పరిరక్షణ, పాదర్శకత, వాక్ స్వేచ్ఛ నినాదాలతో ఈ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేస్తోంది. ► రష్యా, చెకోస్లోవేకియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియా.. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు తర్వాత ఈ దేశాల్లోనూ ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించారాయన. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో జార్జ్ సోరోస్ ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► రాజకీయంగానూ ఆయన అభిప్రాయాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గతంలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్లకు ఆయన మద్దతు ప్రకటించారు. అలాగే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌లకు బద్ధ వ్యతిరేకి. ఇప్పుడు అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అవకతవకలపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ దీన్ని దాఖలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో దర్యాప్తుకు ఆదేశించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహల ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. కేసును అత్యవసరంగా విచారించాలని లాయర్ కోరారు. దీంతో కేసును ఈనెల 24వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే నమోదైన మరో రెండు కేసుల విచారణ 17వ తేదీన ఉండటంతో అదే రోజున దీనినీ విచారించాలని జయా ఠాకూర్ తరఫు లాయర్ చెప్పారు. అందుకు సమ్మతిస్తూ, ఈనెల 17వ తేదీనే విచారిస్తామని కోర్టు స్పష్టంచేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ నియంత్రణ వ్యవస్థల బలోపేతానికి నిపుణుల మండలిని ఏర్పాటు చేయాలన్న కోర్టు సిఫార్సులను కేంద్రం అంగీకరించడం తెలిసిందే. చదవండి: ‘మీ బుల్డోజర్లతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్’ యోగి సర్కార్‌పై యూపీ మాజీ సీఎం ఫైర్ -
అదానీ గ్రూప్ కంపెనీల ఆడిటింగ్
న్యూఢిల్లీ: అమెరికన్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలకు భరోసా కల్పించే చర్యలపై అదానీ గ్రూప్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని గ్రూప్ కంపెనీల ఖాతాలను స్వతంత్ర సంస్థతో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకుంది. తాము ఏమీ దాచడం లేదని, చట్టాలన్నింటినీ పాటిస్తున్నామని నియంత్రణ సంస్థలకు తెలియజేయడమే ఈ ఆడిట్ ప్రధాన ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంస్థలపై ప్రభావం నిల్: ఎస్అండ్పీ అదానీ గ్రూప్ సంక్షోభ ప్రభావాలు ఇతర ఆర్థిక సంస్థలపై భారీగా ఉండబోవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింVŠ ఒక నివేదికలో విశ్లేషించింది. -
అదానీపై దాచేదేమీ లేదు
అగర్తల(త్రిపుర): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదిక రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలిసారిగా పెదవి విప్పారు. అదానీ అంశంలో తాము భయపడుతున్నది కానీ, దాస్తున్నది కానీ ఏమీ లేదన్నారు. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రిగా తానిప్పుడేమీ మాట్లాడకూడదని మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో అన్నారు. బీజేపీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుందని ఎవరైనా భావిస్తే కోర్టులను ఆశ్రయించాలన్నారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. మోదీపై కుట్రలు జరిగిన ప్రతీసారి ఆయన మరింత బలం పుంజుకుని ప్రజాదరణ పొందుతున్నారన్నారు మరి భయమెందుకు?: కాంగ్రెస్ అదానీ ఉదంతంలో దాయటానికేమీ లేకుంటే కేంద్రం ఎందుకు భయపడుతోందని, జేసీసీ విచారణకు ఆదేశించకుండా ఎందుకు పారిపోతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఈ అవకతవకలు కేంద్రాన్నే వేలెత్తి చూపుతున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. -
Adani Group crisis: రూ. 10 లక్షల కోట్లు హాంఫట్, 24వ స్థానానికి గౌతం అదానీ
సాక్షి, ముంబై: అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్లసంపద రోజురోజుకు ఆవిరైపోతూ వస్తోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే రూ. 51,610 కోట్లను కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్క రోజు పతనంతో గ్రూప్ మార్కెట్ విలువ 8.98 ట్రిలియన్ రూపాయిలకు పడిపోయింది. (ఇదీ చదవండి: Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!) హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలతో జనవరి 24న ప్రారంభమైన మెల్ట్‌డౌన్, గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి 10.2 ట్రిలియన్ రూపాయలు లేదా 53 శాతం తుడిచి పెట్టుకుపోయింది మరోవైపు అదానీ గ్రూప్ ఛైర్మన్, గౌతం అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి దిగజారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నాటికి అదానీ నికర విలువ 52.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, నికర విలువ 53 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్సీఐ గత వారం చివరిలో దాని గ్లోబల్ ఇండెక్స్‌లలో భాగమైన కొన్ని గ్రూప్ కంపెనీల వెయిటింగ్‌లను తగ్గించడం, అలాగే గ్రూప్ తన క్యాపెక్స్ ప్లాన్లను తగ్గించాలని యోచిస్తున్న తాజా నివేదికల తరువాత తాజా నష్టాలు సంభవించాయి. ఇప్పటికే హిండెన్‌బర్గ్ ఆరోపణలను తిప్పి కొట్టిన అదానీ గ్రూప్ కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్ల కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ను నియమించినట్టు తెలుస్తోంది. (Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) అంతా బానే ఉంది: ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ భరోసా ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యాపార ప్రణాళికలకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వాటాదారులకు మంచి రాబడులే అందించగలమంటూ ధీమా వ్యక్తం చేసింది. వృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులను కుదించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను గ్రూప్ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రస్తుత మార్కెట్ కుదుటపడిన తర్వాత గ్రూప్‌లోని ప్రతీ సంస్థ తన వ్యూహాల సమీక్ష చేపడుతుందని చెప్పారు. -
అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ.. కమిటీకి కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, ఈ అంశంలో వచ్చిన ఆరోపణల నిజనిజాలు తేల్చడానికి (The Securities and Exchange Board of India (SEBI)) సెబీకి అన్ని రకాల అర్హతలున్నాయని, అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయాలనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. హిండెన్ బర్గ్ రిపోర్టు, తదనంతర పరిణామాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వం వహించిన బెంచ్ ముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. కమిటీలో ఎవరెవరు ఉండాలో నిర్ణయిస్తే.. శుక్రవారం రోజు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కమిటీలో ఎవరెవరి పేర్లు ఉండాలో ఒక సీల్డ్ కవర్లో బుధవారం సుప్రీంకోర్టుకు అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే 22 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన సెబీ... హిండెన్ బర్గ్ నివేదికలో అంశాలతో పాటు, స్టాక్ మార్కెట్లపై ఆ నివేదిక చూపించిన ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. హిండెన్ బర్గ్ తమ నివేదికను బయటపెట్టక ముందు, అలాగే నివేదికను వెల్లడించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను, దాని వెనక ఏదైనా కుట్ర ఉందా? ఏవైనా అవకతవకలు జరిగాయా అన్న అంశాలను పరిశీలిస్తున్నామని సెబీ తెలిపింది. సెబీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన సుప్రీంకోర్టు.. కమిటీ ఏర్పాటు వల్ల మరింత లోతుగా, క్షుణ్ణంగా ఈ వ్యవహారాన్ని విచారణ చేయవచ్చని తెలిపింది. పెట్టుబడిదారులు నష్టపోకుండా కేంద్రం ఏం చేయవచ్చన్నదానికి ఇది స్పష్టత నిచ్చే అవకాశం ఉందని, ఏవైనా చట్ట సవరణలు చేయాలా అన్న అంశం కూడా తెలుస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటి ఆరోపణలను హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇంతకు ముందు సుప్రీంకోర్టు విచారణ జరిపి, కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే కమిటీ సభ్యులను సూచించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. -
దేశంలో అదానీ - హిండెన్‌బర్గ్ ప్రకంపనలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్లోని పెట్టు బడిదారులు తీవ్రంగా నష్ట పోయారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఆదానీ ప్రకంపనలు ఇంకా పార్లమెంట్లో కొనసాగుతున్నాయి. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ. పార్థివాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇన్వెస్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. నిపుణలతో కమిటీ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. హిండెన్‌బర్గ్ నివేదిక వివాదంపై సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని, జడ్జీతో కూడిన నిపుణులైన ప్యానల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అదానీ అంశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వివాదంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటుకు సూచించామని సీజేఐ చెప్పారు. ఆ కమిటీలో న్యాయమూర్తి, సంబంధిత నిపుణులను చేర్చవలసిందిగా తెలిపారు. రెగ్యులేటరీ ప్రక్రియపై ఆందోళన, గత రెండు వారాల్లో జరిగిన ఈ సంఘటనతో దేశ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపేందుకు కృషి చేయాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి13కు వాయిదా వేసింది. చదవండి👉 మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు -
గౌతమ్ ఆదానీ మాస్టర్ ప్లాన్..హిండెన్‌బర్గ్‌కు చెక్!
హిండెన్‌బర్గ్‌తో పోరులో గౌతమ్ ఆదానీ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటానికి అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ అయిన వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. హిండెన్‌బర్గ్ నివేదికతో ఆదానీ గ్రూప్‌నకు ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు న్యూయార్క్‌లో ప్రముఖ వాచ్‌టెల్, లిప్టెన్, రోసెన్, కట్జ్ సంస్థల్లోని సీనియర్ లాయర్ల సేవలను వినియోగించుకోనున్నారు. స్టాక్ మార్కెట్లో ఆదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిదంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బయటపెట్టిన నివేదిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డీల్ జరిగింది అక్కడే ఆదానీ గ్రూప్‌నకు అండగా ఉండే సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థలో కార్యాలయంలో వాచ్‌టెల్‌తో ఈ డీల్ జరినట్లు తెలుస్తోంది. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థ అధినేత సిరిల్ ష్రాఫ్ కుమార్తెను గౌతమ్ ఆదానీ కొడుక్కి వివాహం చేసుకున్నారు. కార్పొరేట్ సంస్థల్లో తలెత్తే సంక్షోభాలను పరిష్కరించడంలో ఈ వాచ్‌టెల్ సంస్థకు విశేష నైపుణ్యం ఉంది. రూ.4లక్షల కోట్లు ఆవిరి కొద్ది రోజుల క్రితం అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండేన్ బర్గ్ భారత్‌లో కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ దెబ్బకు అదానీ గ్రూప్ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 7వ స్థానానికి పడిపోయాడు. భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున నష్టపోయాయి. ఆ రిపోర్ట్ విడుదల ప్రారంభంలో కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకొన్నాయి. పార్లమెంట్లో ప్రకంపనలు స్టాక్ మార్కెట్ లోనే కాదు, ఇటు పార్లమెంట్ లోనూ అదానీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక షేక్ చేస్తుంది. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకై ఈ తరుణంలో హిండెన్‌బర్గ్‌పై గౌతమ్ అదానీ న్యాయ పోరాటానికి దిగారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అంశంలో అదానీ ఎంత మేరకు విజయం సాధిస్తానేది కాలమే నిర్ణయించాలి. -
అదానీ గ్రూపు షేర్లకు ఎంఎస్సీఐ షాక్, కానీ..!
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ కార్పొరేట్ మోసాల ఆరోపణల తరువాత అదానీ గ్రూపు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్కెట్ క్యాప్‌లో 100 బిలియన్ డాలర్ల కోల్పోయింది. తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ట్రాకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించింది. దీంతో శుక్రవారం కూడా మార్కెట్లో అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. ఇండెక్స్ ప్రొవైడర్ఎంఎస్సీఐ) నాలుగు అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ డిగ్జినేషన్లను ఫ్రీఫ్లోట్‌ను తగ్గించింది. అయితే దాని గ్లోబల్ ఇండెక్స్‌ల నుండి ఏ స్టాక్లను తొలగించలేదని తెలిపింది. జనవరి 30 నాటికి ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ ఏసీసీ ఫ్రీ ఫ్లోట్లను తగ్గించింది. నువామా ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, ఈ చర్య తీసుకున్నది. మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచిత ఫ్లోట్లు అలాగే ఉంటాయని తెలిపింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల నుండి మొత్తం 428 మిలియన్ డాలర్ల ఔట్ ఫ్లో ఉంటుందని ఎంఎస్సీఐ అంచనా వేసింది. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ 161 మిలియన్ డాలర్ల, అదానీ ట్రాన్స్మిషన్ 145 మిలియన్ డాలర్ల , అదానీ టోటల్ గ్యాస్ 110 మిలియన్ డాలర్లు, ఏసీసీ 12 మిలిన్ డాలర్లు ఉంటాయని తెలిపింది. అలాగే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, సీసీ పవర్ & ఇండస్ట్రియల్లను జోడించగా బయోకాన్‌ను తొలగించింది. తాజా మార్పులు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. షేర్ల పతనం ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 8శాతం, అదానీ టోటల్ గ్యాస్ 6.4 శాతం అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం అదానీ విల్మార్ 3 శాతం క్షీణించాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్ లాభాల్లు ఉన్నాయి. -
బీజేపీ చలవతోనే అదానీకి ఆస్తులు
న్యూఢిల్లీ: అదానీపై హిండెన్‌బర్గ్ రిపోర్టు వ్యవహారం అధికార, ప్రతిపక్షాల నడుమ అగ్గిరాజేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే గౌతమ్ అదానీ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 609వ స్థానం నుంచి ఎకాఎకిన రెండో స్థానానికి చేరుకున్నారని, ఇదంతా బీజేపీ చలవేనని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అదానీ గత 20 ఏళ్లలో ఎంత సొమ్ము ఇచ్చాడో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపారం, రాజకీయం కలిస్తే ఏం జరుగుతుందో బిజినెస్ స్కూళ్లలో ఒక కేసు స్టడీగా అధ్యయనం చేయాలన్నారు. అదానీ సంపద 2014 నుంచి 2022 దాకా 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందంటూ జోడో యాత్రలో జనం తనను అడిగారని అన్నారు. అక్రమాలకు పాల్పడిన అదానీని ప్రధాని నరేంద్రమోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని అన్నారు. అదానీ షెల్ కంపెనీల గుట్టు తేల్చండి హిండెన్‌బర్గ్ నివేదికను సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అదానీకి విదేశాల్లో షెల్ కంపెనీలు ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారని వెల్లడించారు. ఈ కంపెనీల గుట్టుమట్లను ప్రభుత్వం వెలికితీయాలని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని స్పష్టం చేశారు. అదానీకి మేలు చేయడానికి నిబంధనలను సైతం ప్రభుత్వం మార్చేసిందని దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులను అదానీకి అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. ఎల్ఐసీ సొమ్మును నిలకడ లేని అదానీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని రాహుల్ తప్పుపట్టారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని రాహుల్ పేర్కొన్నారు. ఆధారాలు చూపించండి: బీజేపీ లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు తొలగించాం.. లోక్‌సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. రాహుల్ మంగళవారం సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు చెప్పారు. -
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ : అదానీ - టోటల్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టుపై నీలినీడలు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్‌తో జత కలిసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్‌లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా గతేడాది జూన్‌లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్‌లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ నివేదికతో టోటల్ ఎనర్జీస్ వెనక్కి తగ్గింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్‌తో తమ పార్టనర్షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది. -
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: అదానీ గ్రూపు- హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వివాదం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పరోక్షంగా స్పందించారు. అదానీ గ్రూప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, బ్యాంకింగ్ రంగంపై ప్రభావంపై గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంఘటన లేదా కేసు ద్వారా బ్యాంకులు ప్రభావితం అయ్యే అవకాశం లేదని అన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, మరింత బలోపేతం చేసుకునేందుకే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్బీఐ పాలసీ ప్రకటనల అనంతరం విలేకరుల సమావేశంలో శక్తికాంత దాస్‌మాట్లాడుతూ, నిర్దిష్ట కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవని పేర్కొన్నారు. వాటి బలం, ఫండమెంటల్స్, నగదు ప్రవాహం, ఇతర అంశాల ఆధారంగా రుణాలు ఇస్తారని చెప్పారు. కార్పొరేట్ల కంపెనీల రుణాలపై మాట్లాడుతూ అన్ని బ్యాంకులు పెద్ద ఎక్స్పోజర్ మార్గదర్శకాలను పాటించాయని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే సంక్షోభం అంచున ఉన్న అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నిలకడగా కొనసాగుతున్నాయని ప్రకటించరాఉ. -
రుణ నాణ్యతపై అదానీ గ్రూప్ ఎఫెక్ట్ ఉండదు: ఫిచ్, మూడీస్
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో రేటింగ్ దిగ్గజాలు కీలక వ్యాఖ్యలు చేశాయి అదానీ గ్రూపునకు బ్యాంకుల రుణాలు వాటి ‘రుణ నాణ్యతపై’ ప్రభావితం చూపే భారీ స్థాయిలో లేవని గ్లోబల్ రేటింగ్ దిగ్గజాలు- ఫిచ్, మూడీస్ పేర్కొన్నాయి. అవసరమైతే వాటికి ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు అందే అవకాశం ఉందని కూడా విశ్లేషించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఎక్కువ రుణాలు ఇచ్చినప్పటికీ, అవి ఆయా బ్యాంకుల మొత్తం రుణాలలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది. ‘‘భారతీయ బ్యాంకుల కార్పొరేట్ రుణాల మొత్తం నాణ్యత స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలలో చిన్న స్థాయి కార్పొరేట్లు నష్టపోయాయి. ఇది కొన్ని బ్యాంకుల కార్పొరేట్ రుణ పుస్తకాలలో భారీ వృద్ధిని నిలువరించింది’’ అని మూడీస్ విశ్లేషించింది. ఏదైనా అవసరమైతే అసాధారణ రీతిలో బ్యాంకింగ్‌కు ప్రభుత్వ మూలధన మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్‌కు దేశ దిగ్గజ బ్యాంక్ రుణాలు రూ.27,000 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా రూ.7,000 కోట్లు. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ మొత్తం రుణాల్లో అదానీ గ్రూప్ రుణ వాటా 0.94 శాతం. దేశ మౌలిక రంగం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్‌కు కష్టాలు కొనసాగితే, మధ్య కాలికంగా అది దేశ ఆర్థిక వృద్ధిపై నామమాత్రపు ప్రభావమే చూపుతుందని ఫిచ్ అంచనావేస్తోంది. భారత్ ఆర్థిక వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని కూడా పేర్కొంది. -
మోదీ-అదానీ కామెంట్లు.. రాహుల్‌పై సభా ఉల్లంఘన ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘అదానీ వ్యాఖ్యలు’.. రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్‌పై వరుసగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సభా ఉల్లంఘనకుగానూ ఆయనపై సభా ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ ఒకరు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో.. రాహుల్ గాంధీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆ విధంగా మాట్లాడారని. ఆధారాల్లేకుండా ప్రధానిపై నేరారోపణ చేశారని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే(జార్ఖండ్) పేర్కొన్నారు. అలా మాట్లాడటం సభానియమామళికి విరుద్ధమని, సభ ఔనత్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా.. ప్రధాని గౌరవాన్ని భంగపరిచేలా రాహుల్ వ్యవహరించారంటూ పేర్కొన్నారు నిశికాంత్. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ తన పరిశోధన నివేదికలో.. అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్‌కు పాల్పడిందని, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం సంచలనంగా మారగా.. అదానీ గ్రూప్ ఆ నివేదికను తోసిపుచ్చింది. మరోవైపు మంగళవారం రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మోదీ, బిలియనీర్ గౌతమ్ అదానీలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో అదానీ 609వ ర్యాంక్‌లో ఉన్నాడు, ఏం మ్యాజిక్ జరిగిందో 2వ ర్యాంక్‌కి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య స్నేహబంధం ఏంటసలు?. కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అనుచితంగా లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. గౌతమ్ అదానీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో కూర్చున్న ఒక ఫొటోను రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ 'యే దేఖియే రిష్టా, యే రిష్టా హై (ఈ సంబంధం చూడండి, ఇది సంబంధం)' అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య ఈ బంధం మొదలైందని రాహుల్ గాంధీ వాదించారు. ''భారతదేశ వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ప్రధానితో భుజం, భుజం కలిపి పనిచేశారు, మద్దతు ఇచ్చారు. ఇది జోక్ కాదు. ఆయన (గౌతమ్ అదానీ) ప్రధానికి విధేయుడిగా ఉన్నారు'' అని రాహుల్ అన్నారు. మోదీకి వైబ్రెంట్ గుజరాత్ ఆలోచనలో గౌతమ్ అదానీ సాయపడ్డారని, దీంతో ఆయనకు ఈయన అండగా నిలిచారన్నారు రాహుల్. దాని ఫలితంగానే గౌతమ్ అదానీ వ్యాపారం అభివృద్ధి చెందిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన కామెంట్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ హయాంలోనూ టాటా, బిర్లా, అంబానీల్లాంటి వ్యాపారులెందరికో అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇక ఎంపీ నిశికాంత్ దుబే మాట్లాడుతూ.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(కాంగ్రెస్), పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతోనూ అదానీ మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. లాజిక్ లేకుండా ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఆరోపణలు వస్తే వాదనలతో పాటు ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి. బీజేపీ ఎంపీలు రవిశంకర్‌తో పాటు స్మృతి ఇరానీ సైతం రాహుల్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్
సాక్షి, ఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు సభలు సజావుగా జరుగుతాయని అంతా భావించారు. అయితే టర్కీ, సిరియా భూకంప బాధితుల సంతాపం ప్రకటన అనంతరం.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలంటూ ఇరు సభలను అడ్డుకునే యత్నం చేశాయి. దీంతో ఉభయ సభలు కాసేపటికి వాయిదా పడ్డాయి. తొలుత బీఆర్ఎస్, ఆప్‌లు మాత్రమే సమావేశాలకు దూరంగా ఉంటాయని అంతా భావించారు. ఈ క్రమంలో మిగతా పార్టీలలో దాదాపుగా అన్నీ పార్లమెంట్ వ్యవహారాలకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ జైరామ్ రమేశ్ ప్రకటించారు. అయితే.. లోక్‌సభలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా రాజ్యసభలో మాత్రం విపక్షాలు కార్యకలాపాలను ఏమాత్రం ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. Rajya Sabha adjourned till 2 pm as Opposition MPs walked to the Well of the House and demanded that the PM come to the House and respond over #Adani row. pic.twitter.com/OR1nh85pO4 — ANI (@ANI) February 7, 2023 అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హౌజ్ వెల్‌లోకి వెళ్లాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటల దాకా సభ వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభ ప్రారంభంలో ప్రతిపక్షాల నిరసనతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆపై మరోసారి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రారంభమైన సభ కాస్త సజావుగానే నడిచింది. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ దర్యాప్తుగానీ, సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తునకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోదీ సైతం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. -
1.1 బిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపు
న్యూఢిల్లీ: తనఖాలో ఉన్న అదానీ గ్రూప్ సంస్థల షేర్లను విడిపించుకునేందుకు ప్రమోటర్లు 1.1 బిలియన్ డాలర్లను ముందస్తుగా చెల్లించనున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (ఏపీసెజ్) , అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ (ఏటీఎల్) సంస్థల షేర్లు వీటిలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ కానున్నాయి. ఇటీవల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో కంపెనీల షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకటన ప్రకారం తనఖా ఉంచిన షేర్లకు సంబంధించి ఏపీసెజ్‌లో 12 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 1.4 శాతం ప్రమోటర్ల వాటాలను విడిపించనున్నారు. అదానీ ట్రాన్స్మిషన్ లాభం 73 శాతం అప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అదానీ ట్రాన్స్మిషన్ లాభం దాదాపు 73 శాతం పెరిగి రూ. 478 కోట్లకు చేరింది. అమ్మకాల వృద్ధి, వన్‌టైమ్ ఆదాయం నమోదు కావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ. 277 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 2,623 కోట్ల నుంచి రూ. 3,037 కోట్లకు చేరింది. -
హిండెన్‌బర్గ్ వివాదం: అదానీ గ్రూపు ప్రమోటర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్ వివాదం తరువాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్ షేర్ల రిలీజ్ కోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించనుంది. 1.1 బిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఈమేరకు కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్: అదానీకి మరోషాక్! ఆ ప్రమాదం ఎక్కువే?) ఇటీవలి మార్కెట్ అస్థిరత దృష్ట్యా, అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించడానికి ప్రమోటర్ల నిబద్ధత కొనసాగింపులో, మెచ్యూరిటీ కంటే ముందే 1,114 మిలియన డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లించనున్నామని ప్రకటించింది. ముందస్తు చెల్లింపులో భాగంగా ప్రమోటర్ హోల్డింగ్‌లో 12 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ల 168.27 మిలియన్ షేర్లు విడుదల చేయనుంది. అదానీ గ్రీన్ విషయానికొస్తే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 3 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 27.56 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. అలాగే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 1.4 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ ట్రాన్స్‌మిషన్‌లోని 11.77 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. కాగా అదానీ గ్రీన్ స్క్రిప్ వరుగా నాలుగో సెషన్లోనూ సోమవారం నాడు 5శాతం పడి లోయర్ సర్క్యూట్ అయింది. గత నెలతో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. అదానీ గ్రూపు గత కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు మార్కెట్లో ప్రకంపనలు రేపింది. దాదాపు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అయితే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ వాదనలను నిరాధారమైనదని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!) -
అదానీ-హిండెన్‌బర్గ్: అదానీకి మరోషాక్! ఆ ప్రమాదం ఎక్కువే?
సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇటీవల చేసిన ఆరోపణలు ప్రభావం సంస్థను భారీగానే ప్రభావితం చేస్తోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చి 12 రోజుల తరువాత కూడా ఆ సెగలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన అన్ని షేర్లు భారీగా కుప్పకూలగా, అదానీ చైర్మన్ గౌతం అదానీ నికర సంపద దారుణంగా పడిపోయింది. చివరికి అదానీగ్రూప్నకు కీలకమైన అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోను కూడా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి తాజాగా అదానీకి మరో షాక్ తగలనుందనే ఊహాగానాలు మార్కెట్లో ఉన్నాయి. రూ. 11,574 కోట్ల రుణాన్ని రీకాల్ చేసే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, దాని అనుబంధ కంపెనీలు తీసుకున్న మొత్తం రూ. 11,574 కోట్ల అన్సెక్యూర్డ్ లోన్స్ రుణాలను ఇపుడు బ్యాంకులు ,ఆర్థిక సంస్థలు రీకాల్ చేసే అవకాశం ఉందని అంచనా. రూ.20 వేల కోట్ల ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ను ఆకస్మికంగా ఉపసంహరించుకోవాలని గ్రూప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం, ప్రత్యేకించి అదనపు వనరులను సమీకరించడంలో కొత్త సవాళ్లను సృష్టించింది. ముఖ్యంగా కంపెనీ పెట్టుబడి దారులకు వెల్లడించిన వివరాల ప్రకారం, "ఈ రుణాలు ఏదైనా అంగీకరించిన రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం తిరిగి చెల్లించలేకపోవచ్చు, రుణదాత ఎప్పుడైనా రీకాల్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే జరిగితే తమ అనుబంధ సంస్థలు ఫైనాన్సింగ్ కోసం ప్రత్యామ్నాయ వనరులను కనుగొనవలసి ఉంటుందని, అయితే బలమైన నగదు ప్రవాహం, సురక్షితమైన ఆస్తులతో గ్రూప్ బ్యాలెన్స్ షీట్ చాలా ఆరోగ్యంగా ఉందని గౌతం అదానీ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి తాజా అంచనాలపై అదానీ మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అట్టుడుకిన పార్లమెంట్ మరోవైపు అదానీపై అవినీతి ఆరోపణలతో హిండెన్‌బర్గ్ నివేదికసౌ విపక్షాలు సోమవారం పార్లమెంటులో లేవనెత్తాయి, చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాగా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత అంబుజా, ఏసీసీ సిమెంట్‌తో సహా తొమ్మిది అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడు ట్రేడింగ్ రోజుల వ్యవధిలో దాదాపు సగం (100 బిలియన్ డాలర్ల వరకు) క్షీణించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక్కటే భారీ మార్కెట్ క్యాప్ విలువను కోల్పోయింది. -
Budget Session: పార్లమెంట్లో మారని సీన్..ఉభయసభలు వాయిదా
సాక్షి, ఢిల్లీ: అదానీ కంపెనీల అవకతవకలపై చర్చ జరపాలని, జేపీసీ దర్యాప్తు డిమాండ్లతో విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వడం లేదు. విపక్షాల వాయిదా తీర్మాన నోటీసులు.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల తిరస్కరణ.. ఆపై పార్లమెంట్లో నెలకొన్న గందరగోళంతో ఇరు సభలు కూడా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించకుండానే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనా రెండు సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి. బడ్జెట్ సమావేశాల ఐదవ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదానీ కంపెనీపై హిండన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు సభ ప్రారంభమైన కాసేపటికే నినాదాలతో గందరగోళం సృష్టించాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా విపక్షాలు అనుమతించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సుమారు 16 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు.. శుక్రవారం ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై జేపీసీ దర్యాప్తు అనే ఏకపక్ష డిమాండ్‌ను ఉభయ సభల్లోనూ లెవనెత్తాలని నిర్ణయించుకున్నారు. ఆపై శుక్రవారం ఎలాంటి వ్యవహరాలు జరగకుండానే.. సోమవారానికి(ఇవాళ్టికి) పార్లమెంట్ సెషన్ వాయిదా పడింది. అయితే సోమవారం ప్రారంభమైన తర్వాత కూడా అదే సన్నివేశం నెలకొంది. కేంద్రం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి ఒక ప్రాధాన్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది. -
అదానీVsహిండెన్‌బర్గ్: ఆర్బీఐ,సెబీపై ఆర్థికమంత్రి ఏమన్నారంటే!
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల స్థిరీకరణ నియంత్రణ సంస్థలు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెబీల ప్రధాన ధ్యేయం కావాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ విషయంలో రెగ్యులేటర్లు పూర్తి విజయవంతంగా పని చేస్తున్నాయని కూడా ఉద్ఘాటించారు. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ, మార్కెట్లను స్థిరంగా ఉంచడానికి నియంత్రణ సంస్థలు సమయానికి పని చేయాలన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక కుట్ర కాదా అని అడిగినప్పుడు సీతారామన్ ఈ వ్యాఖ్య చేశారు. ఈ మేరకు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అదానీ గ్రూప్ సంక్షోభ పరిస్థితులపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, అది ఈ గ్రూప్ కంపెనీలకు మాత్రమే సంబంధించిన సమస్యని స్పష్టం చేశారు. ఏ కంపెనీకి కూడా భారత్ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలు ఇవ్వలేదని, బీమా కంపెనీల పెట్టుబడులు కూడా భారీగా లేవని అన్నారు. -
Stock Market: ఒడిదుడుకులు కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ – అదానీ గ్రూప్ పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఎఐక్స్ ఇండెక్స్ 17.32% నుంచి 14.4శాతానికి దిగిరావడం కలిసొచ్చే అంశంగా ఉంది. వీటితో పాటు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారం సూచీలు రెండున్నరశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1534 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు లాభపడ్డాయి. అయితే హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ సంక్షోభంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేంద్ర ప్రకటించిన సంతులిత బడ్జెట్ సైతం అస్థిరతలను తగ్గించలేకపోయింది. ‘‘వారాంతాపు బౌన్స్‌బ్యాక్ కాస్త ఒత్తిడిని తగ్గించింది. అయితే సంకేతాలు ఇప్పటికీ మిశ్రమంగానే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని స్థిరత్వం కలిసొచ్చే అంశమే. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, అదానీ గ్రూప్ సంక్షోభం పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. నిఫ్టీ 17,900 స్థాయిని అధిగమించగలితే ఎగువస్థాయిలో 18,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,550 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం వారాంతాపు రోజైన శుక్రవారం డిసెంబర్ పారిశ్రామిక, తయారీ రంగ డేటా విడుదల కానుంది. అదేరోజున ఫిబ్రవరి మూడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల జనవరి 27 వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. జనవరి యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ కన్స్ట్రక్షన్ పీఎంఐ డేటా, బ్రిటన్ సీఐపీఎస్ కన్స్ట్రక్షన్ పీఎంఐ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. యూఎస్ వాణిజ్యలోటు రేపు(మంగళవారం) వెల్లడికానుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఆర్బీఐ ఎంసీపీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు బుధవారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గానూ ఆర్బీఐ నిర్వహించే చివరి ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఇది. వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని అంచనా. గతేడాది డిసెంబర్లో వరుసగా ఐదో విడత కీలక రెపో రేటును 0.35 శాతం పెంచడంతో 6.25 శాతానికి చేరింది. భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు/తగ్గింపు, బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ పై విధాన కమిటీ అభిప్రాయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఈ కొత్త ఏడాది తొలి నెలలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శించారు. ఈ జనవరిలో మొత్తం రూ.28,852 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గతేడాది జూన్ తర్వాత ఒక నెలలో ఎఫ్ఐఐల జరిపిన అత్యధిక విక్రయాలు ఇవే. కొనసాగింపుగా ఈ ఫిబ్రవరి మొదటివారంలోనూ రూ.5,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్లో షార్ట్ పోజిషన్లతో భారీ లాభపడ్డారు. తక్కువ విలువ వద్ద ట్రేడ్ అవుతున్న చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, జొమాటో, లుపిన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. -
అదానీ-హిండెన్‌బర్గ్ సంక్షోభం: వారికి ఆనంద్ మహీంద్ర హెచ్చరిక
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రేపిన దుమారంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎంఅండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. తన తాజా ట్వీట్లో అదానీ గ్రూప్ సంక్షోభాన్ని ప్రస్తావించారు.ఎన్ని సవాళ్లు వచ్చినా భారత్ దృఢంగా నిలబడుతుంది అంటూ సోషల్‌మీడియాలో ప్రకటించారు. (కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్) వ్యాపార రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థికశక్తిగా ఉండాలనే భారతదేశ ఆశయాలను దెబ్బతీస్తాయా అని గ్లోబల్ మీడియా అనేక ఊహాగానాలు చేస్తోంది కానీ అలాంటిదేమీ ఉండదు. ఎన్ని తుఫానులు, సంక్షోభాలు వచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉంటుందని ప్రకటించారు. ఇండియా గతంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, కానీ ప్రతిసారీ బలంగా నిలబడిందని ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. భూకంపాలు, కరువులు, మాంద్యాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు లాంటివి ఎన్నో చూశా.. తాను చెప్పేది ఒక్కటే, భారతదేశానికి వ్యతిరేకంగా ఎపుడూ సవాల్ చేయొద్దని సూచించారు. అలా అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై మోపిన అకౌంటింగ్ మోసం ఆరోపణల నేపథ్యంలో అనేక ఊహాగానాలు చేస్తున్న వారిని పరోక్షంగా ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. Global media is speculating whether current challenges in the business sector will trip India’s ambitions to be a global economic force. I’ve lived long enough to see us face earthquakes, droughts, recessions, wars, terror attacks. All I will say is: never, ever bet against India — anand mahindra (@anandmahindra) February 4, 2023 /p> -
Adani Group issue: ‘అదానీ’పై అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల పతనం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఏకతాటిపైకి వచ్చిన విపక్ష సభ్యుల ఆందోళనతో శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ స్తంభించాయి. మిగతా సభా కార్యకలాపాలను పక్కనపెట్టి హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టడంతో వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సమావేశాలకు ముందే తీసుకున్న సంయుక్త నిర్ణయం 15 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభ ఆరంభమై ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్ష ఎంపీలు హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. విచారణ జరిపించాల్సిందే... అదానీ గ్రూప్ పట్ల వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేదా సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌తో విచారణ జరిపించాలని విపక్షాలు పునరుద్ఘాటించాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చకు అంగీకరించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చర్చించే దాకా పట్టు! పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆప్, బీఆర్ఎస్, శివసేన, ఆర్జేడీ, జేడీ(యూ), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), కేరళ కాంగ్రెస్ (థామస్), ఆరెస్పీ ఇందులో ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై సభలో చర్చ జరిగేదాకా పట్టుబట్టాల్సిందేనని పార్టీలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దాంతోపాటు అదానీ గ్రూప్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తుకు కేంద్రం అంగీకరించేదాకా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అదానీ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడు మాత్రమే వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులకు భద్రత’’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో అన్నారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని మోదీయే వాటిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆర్థిక, అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడిందంటూ న్యూయార్క్‌కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల దెబ్బకు గ్రూప్ విలువ చూస్తుండగానే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. -
కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల తీరు నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. దలాల్ స్ట్రీట్‌లో అదానీ స్టాక్‌ల తనం కారణంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ సంపద దాదాపు సగం ఆవిరైపోయింది. ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 55.8 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీకి చెందిన ఎనర్జీ-టు-పోర్ట్‌ల సామ్రాజ్యం నికర సంపద 10 రోజుల్లో సగం తుడిచి పెట్టుకు పోయింది. ఫలితంగా ప్రపంచంలో 2వ అత్యంత సంపన్న పౌరుడిగా ఎదిగిన బిలియనీర్ 108 బిలియన్ డాలర్లను కోల్పోయి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 20వేల ఎఫ్‌పీవో రద్దు భారీ క్షీణతకు దారితీసింది. అటు హిండెన్‌బర్గ్ కంపెనీకి అదానీ గ్రూపు ఇచ్చిన సమాధానం కూడా పెట్టుబడి దారులకు భరోసా ఇవ్వడంలో విఫలమైంది. ఫలితంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ , అదానీ గ్రీన్ ఎనర్జీ వాటి గరిష్ట స్థాయిల నుండి 70-75 శాతం క్షీణించగా, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్ తమ విలువలో 50-60 శాతం నష్టపోయాయి. ఇంకా ఏసీసీ అంబుజా సిమెంట్స్ ,ఎన్డీటీవీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. డౌ జోన్స్ నుంచి ఔట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ నుండి తొలగించనున్నారు. ఈమేరకు S&P Dow Jones Indices ఒక నోట్ జారీ చేసింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం ఆరోపణలు, మీడియా, వాటాదారుల విశ్లేషణ తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ సూచీల నుండి తొలగిస్తున్నట్టు ఈ నోట్ పేర్కొంది. ఈ సంక్షోభంతో ప్రపంచవృద్ధి ఇంజిన్‌గా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్య స్థానంగా ఉన్న భారత విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూపు మేనేజ్మెంట్ క్లారిటీ కోరనున్న ఎల్ఐసీ మరోవైపు అదానీలో కీలక పెట్టుబడిదారు ఎల్ఐసీ త్వరలోనే అదానీ గ్రూపు కీలక మేనేజ్మెంట్తో భేటీ కానుందట. ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఇన్వెస్టర్లకు పెట్టుబడులను తిరిగి ఇచ్చే విషయంలో స్పష్టకోరనుందని సీఎన్‌బీసీ నివేదించింది. -
Adani row: ఉభయసభలు సోమవారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగనిచ్చేలా కనిపించడం లేదు. సమావేశాల్లో నాలగవ రోజైన శుక్రవారం ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లోక్‌సభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తునన్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు అదానీ-హిడెన్‌బర్గ్ విషయంలో పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాల దాడులను ఎలా తిప్పి కొట్టాలి అనే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు బీజేపీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్షాల అత్యవసర సమావేశం జరిగింది. ఆప్, బీఆర్ఎస్లు సైతం ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇరు సభల్లో విడివిడిగా అదానీ-హిడెన్‌బర్గ్ వ్యవహారంపై వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఆప్ కూడా నోటీసులు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అదానీ-హిడెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. सदन में लगातार हंगामे के कारण Speaker हुए गुस्से से आग बबूला, फिर हुआ ये.. | Liberal TV#RajyaSabha #Loksabha2024 #Loksabha #Parliament #parliamentofindia #Adjourned #LiberalTV #Speaker #Ombirla #anger pic.twitter.com/FQU93r0YBC — Liberal TV (@LiberalTVNews) February 3, 2023 -
అదానీకి మరో షాక్, జో జాన్సన్ గుడ్‌బై, ఎవరీ జాన్సన్?
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ సాగా కొనసాగుతోంది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు జో జాన్సన్ అదానీ సామ్రాజ్యంనుంచి తప్పుకున్నారు. లండన్‌కు చెందిన అదానీలతో సంబంధం ఉన్న ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో జాన్సన్ రాజీనామా చేశారు. (ట్రేడర్లకు అలర్ట్: అదానీ షేర్ల పతనం, ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం) అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవీ)తో ముడిపడి ఉన్న యూకే ఆధారిత పెట్టుబడి సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌షిప్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. ఫిబ్రవరి 1న జో జాన్సన్ డైరెక్టర్ పదవి ఉంచి తప్పుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ధృవీకరించింది. "యూకే- ఇండియా వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు" సహకరించడానికి ఎలారాలో చేరాననీ, అప్పటికి కంపెనీ మంచి పరిస్థితిలో ఉందని తనకు హామీ ఇచ్చారనీ తెలిపారు. అలాగే ఎలారా క్యాపిటల్ చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉందని అయితే ఆర్థిక నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక రంగాలలో ఎక్కువ డొమైన్ నైపుణ్యం అవసరమని భావించి బోర్డుకు రాజీనామా చేసానని జో జాన్సన్ వెల్లడించారు. (అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!) ఎలారా క్యాపిటల్‌కి.. అదానీ గ్రూప్‌కి లింక్ ఏంటి? భారతీయ కార్పొరేట్ల కోసం నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థ ఎలారా క్యాపిటల్. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10 బుక్‌రన్నర్‌లలో ఎలారా క్యాపిటల్ కూడా ఒకటి. లార్డ్ జాన్సన్ గత ఏడాది జూన్‌లో లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ పిఎల్సికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎలారా క్యాపిటల్‌ను 2002లో రాజ్ భట్ క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంగా స్థాపించారు, GDR (గ్లోబల్ డిపాజిటరీ రసీదు), FCCB (ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్), లండన్ AIM మార్కర్ ద్వారా భారతీయ కార్పొరేట్లకు నిధులను సమకూరుస్తుంది. ఇది న్యూయార్క్, సింగపూర్, ముంబై, అహ్మదాబాద్ లండన్లలో పూర్తి లైసెన్స్ పొందిన కార్యాలయాలను కలిగి ఉంది. ఎలారా క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం 2021 వేసవి నాటికి 5.1 శాతం వాటాతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మూడవ అతిపెద్ద వాటాదారుగా ఉంది. కాగా అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ 2022 ఏప్రిల్‌లో బోరిస్ రెండు రోజుల భారత పర్యటనలో అదానీ చైర్మన్ గౌతమ్ అదానీని అహ్మదాబాద్‌లో కలిశారు. మరోవైపు తాజా నివేదికల ఆధారంగా అదానీ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శలను మరోసారి ఎక్కు పెట్టింది. బోరిస్ జాన్సన్ 25 ఏళ్ల కుమారుడికి అహ్మదాబాద్‌లోని అదానీలతో కొంత సంబంధం ఉందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని లేదా జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గురువారం డిమాండ్ చేసింది. -
ట్రేడర్లకు అలర్ట్: అదానీ షేర్ల పతనం, ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ తరువాత అదానీ గ్రూప్ షేర్లన్నీ దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత దాదాపు అన్నీ 52 వారాల కనిష్టానికి చేరాయి. కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్ వద్ద నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, మార్కెట్ అస్థిరత కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్‌లను ఫిబ్రవరి 3, 2023 నుండి ASM (అదనపు నిఘా మార్జిన్) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచింది, దీని ప్రకారం ఆయా షేర్లలో ట్రేడింగ్ చేయడానికి 100శాతం మార్జిన్ ఉండి తీరాలి. తద్వారా పలు ఊహాగానాలను, షార్ట్ సెల్లింగ్‌ను అరికట్టవచ్చని అంచనా. (షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో) "ధర/వాల్యూమ్ వైవిధ్యం, అస్థిరత మొదలైన ఆబ్జెక్టివ్ పారామితుల ఆధారంగా సెక్యూరిటీలపై అదనపు నిఘా చర్యలు (ASM) ఉంటాయి" అని ఎన్ఎస్ఈ తన వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది (అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!) కాగా అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20 వేల కోట్ల ఎఫ్ఈవో రద్దు తర్వాత, అదానీ గ్రూప్ మార్కెట్ నష్టాలు గురువారం నాడు 100 బిలియన్ డార్లకు పైగా చేరిన సంగతి తెలిసిందే.ఫోర్బ్స్ గురువారం అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గౌతం అదానీ 16 వ స్థానానికి పడిపోయారు. (అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్ నేత సంచలన సలహా) -
అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధన నివేదిక సునామీతో అదానీ గ్రూప్ షేర్లన్నీ పతనం వరుసగా కొనసాగుతోంది. కంపెనీకి చెందిన 10 స్టాక్‌లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో ఆసియా కుబేరుడుగా నిలిచిన అదానీ చైర్మన్ గౌతం అదానీ, ప్రపంచ బిలియనీర్ల ర్యాంకు నుంచి 16 స్థానానికి పడిపోయారు. అదానీ నికర విలువ ఒక వారంలో దాదాపు సగానికి పడిపోయింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 8.76 లక్షల కోట్లు (107 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఇది (రూపాయి-డాలర్ మార్పిడి రేటు 81.80 వద్ద) ఇథియోపియా లేదా కెన్యా జీడీపీతో సమానమట. వీటి వార్షిక జీడీపీ 110-111 బిలియన్ల డాలర్లు (ప్రపంచ బ్యాంకు). అదానీ టోటల్ గ్యాస్ 6 రోజుల రూట్లో 29 బిలియన్ల డాలర్లు పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో 26.17బిలియన్ల డాలర్లను కోల్పోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,గత సంవత్సరం సెప్టెంబర్‌లో గరిష్టంగా 150 బిలియన్ల డాలర్లున్న అదానీ వ్యక్తిగత సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తరువాత ( జనవరి 24 నాటికి) 119 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. కాగా ఫోర్బ్స్ అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా గురువారం అంచనా వేసింది. దీని ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 85 బిలియన్ డాలర్లు పతనం. ఇది బల్గేరియా వార్షిక జీడీపీకి సమానం! అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 65,000 కోట్లకు పైగా క్షీణించగా, అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ. 2.1 లక్షల కోట్లు హుష్ కాకి అయిపోయాయి. గత సంవత్సరం అదానీ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, దాని m-క్యాప్ దాదాపు రూ. 29,000 కోట్లు పడిపోయింది, ఇది 29శాతం పతనం. అదానీ గ్రీన్ ఎనర్జీ (16.95 బిలియన్ డాలర్లు క్షీణత) అదానీ ట్రాన్స్మిషన్ (16.36 బిలియన్ డాలర్లు కోల్పోయింది) విలువపరంగా భారీ పెట్టుబడిదారుల సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లు. ఇంకా అదానీ పోర్ట్స్ & SEZ (7.89 బిలియన్ డాలర్లు), అంబుజా సిమెంట్స్ (3.55 బిలియన్ డాలర్లు ) అదానీ విల్మార్ (2.4బిలియన్ డాలర్లు ) ఏసీసీ (1.13 బిలియన్ డాలర్లు) కోల్పోయాయి. ఇక ఎఫ్‌పీవో ఉపహసంహరణ తరువాత అదానీ షేర్లను కొనేవాళ్లకు లేక చాలా వరకు లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. గురువారం అదానీ షేర్ల తీరు ఇలా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఈ స్టాక్ గురువారం రెండవ వరుస సెషన్లో 30శాతం క్రాష్ అయ్యింది. 1,494.75 వద్ద కొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం పడి, రూ. 1,707లోయర్ సర్క్యూట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం కుప్పకూలి కొత్త 52 వారాల కనిష్టాన్ని తాకింది. అదానీ ట్రాన్స్మిషన్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి, 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 14.35 కుప్పకూలి , 52 వారాల కనిష్ట స్థాయి అదానీ పవర్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ అదానీ విల్మార్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. -
అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్ నేత సంచలన సలహా
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్ట్‌తో అదానీ గ్రూపు చైర్మన్ గౌతం విలవిల్లాడుతుండగా బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ వివాదంపై సోషల్‌మీడియా ద్వారా స్పందించిన ఆయన ప్రధాని మోదీకి ఒక సలహా కూడా ఇచ్చారు. (షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో) అదానీగ్రూపు - హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుబ్రమణియన్ స్వామి గురువారం ట్విటర్లో స్పందించారు. అదానీ & కో మొత్తం వాణిజ్య ఆస్తులను జాతీయం చేయాలని, ఆపై ఆ ఆస్తులను విక్రయించాలంటూ ప్రధాని మోదీకి సలహా ఇచ్చారు. అంతేకాదు అదానీని హోప్‌లెస్‌గా భావించిన మోదీ ప్రభుత్వం నెమ్మదిగా అదానీని డిస్ ఓన్ చేసుకుంటోందనీ, ఎలా వచ్చిన వాళ్లు అలానే పోతారు అంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. I believe Modi Govt is slowly disowning Adani as a hopeless case. Easy come easy goes — Subramanian Swamy (@Swamy39) February 2, 2023 My advice to Modi: Nationalise the entire commercial properties of Adani & Co for “ negative” payment and later auction the properties. — Subramanian Swamy (@Swamy39) February 2, 2023 -
షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో
సాక్షి,ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాద సునామీలో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎప్‌ఫీవో కచ్చితంగా ఉండి తీరుతుందని ప్రకటించింది అదానీ. ఈ మేరకు ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ తరువాత కూడా అనూహ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్‌పీవో విషయంలో అదానీ గ్రూప్ వెనక్కి తగ్గింది. అతిపెద్ద 20000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్‌ను ఉపసంహరించుకున్నామంటూ అందరికీ షాకిచ్చింది. అయితే ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని అదానీ గ్రూపు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ తొలిసారి స్పందించారు. తాము తీసుకున్న నిర్ణయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ వోలటాలీటీనేతమ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్వెస్టర్లు నష్టాలకు గురి కాకూడదనే షేర్ల విక్రయానికి పిలుపునివ్వాలని గ్రూప్ నిర్ణయించినట్లు అదానీ గురువారం తెలిపారు. బుధవారం నాటి మార్కెట్ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే, ఎఫ్‌పిఓతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించిందని అదానీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇది అదానీ గ్రూప్ సంస్థల ప్రస్తుత కార్యకలాపాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగానూ ప్రభావితం చేయదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. తమ బ్యాలెన్స్ షీట్ బలంగానే ఉందని, సంస్థ రుణ బాధ్యతలను నెరవేర్చటంలో సంస్థకున్న ట్రాక్ రికార్డు కూడా బాగుందంటూ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. Chairman @gautam_adani's address to investors after withdrawal of the fully subscribed AEL FPO#GrowthWithGoodness #NationBuilding #AdaniGroup pic.twitter.com/f9yaYrxCzx — Adani Group (@AdaniOnline) February 2, 2023 -
అదానీ గ్రూప్ షేర్లు విలవిల.. ఒక్క వారంలో రూ.7.44 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫిబ్రవరి 2న అదానీ స్టాక్‌ల విక్రయాలు అధికం కావడంతో కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి సంబంధిత లోయర్ సర్క్యూట్లకు పడిపోయాయి. ఈ ప్రకంపనలు నేపథ్యంలో గత వారం నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో దాదాపు రూ.7.44 లక్షల కోట్లు నష్టపోయింది. సిటీ గ్రూప్ ఇంక్ (Citigroup Inc.) మార్జిన్ లోన్ల కోసం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల సెక్యూరిటీలను తాకట్టుగా స్వీకరించడాన్ని కూడా నిలిపివేసిందని బ్లూమ్‌బెర్గ్ నుంచి నివేదికలు వెలువడ్డాయి. దీనిని అనుసరించి అదానీ గ్రూప్ స్టాక్‌లపై చీకటి మేఘాలు చుట్టుముట్టాయి. దానికి తోడు, అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను ఆశ్చర్యకరంగా ఉపసంహరించుకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 1 గంటకు అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల షేర్ల పరిస్థితి ఈ పరిణామాలు అదానీ సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫిబ్రవరి 2న ఉదయం 11.43 గంటలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 8.53 శాతం తగ్గి రూ.1,957.25 వద్ద ట్రేడవుతుండగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ - అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డిటివి కూడా వాటి సంబంధిత లోయర్ సర్క్యూట్లలోకి చేరుకున్నాయి. చదవండి: వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు! -
అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
దేశంలో హిండెన్‌బర్గ్ వెర్స్‌స్ అదానీ వ్యవహారం తీవ్ర దుమారేన్ని రేపుతోంది. గత నెలలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అంతే కాకుండా ఈ ప్రకంపనలు దేశీయ స్టాక్ మార్కెట్లో కలకలం రేపుతోంది. చివరికి హిండెన్ బర్గ్ నివేదిక సెగ పార్లమెంటుకు కూడా తాకింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. అదానీ వ్యవహారంలో అర్బీఐ జోక్యం ఖాతాల్లో, షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా అదానీ గ్రూపునకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. గత వారం నుంచి మార్కెట్ వాల్యుయేషన్‌లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని ఆర్బీఐ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నుంచి అధికారిక ప్రకటన రాలేదని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో అదానీ గ్రూప్ గతంలో ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన రూ.20,000 కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. India's central bank (Reserve Bank of India) has asked local banks for details of their exposure to the Adani group of companies, government and banking sources, reports Reuters pic.twitter.com/EHxDfVNmhD — ANI (@ANI) February 2, 2023 చదవండి: వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు! -
పార్లమెంట్లో ‘హిండెన్‌బర్గ్’ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక గురువారం పార్లమెంట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మార్కెట్ విలువను భారీగా కోల్పోతున్న అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడుల అంశంపై తక్షణమే చర్చించాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు స్తంభించాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా 9 విపక్షాల ఎంపీలు వెల్‌లోకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 9 పార్టీల వాయిదా తీర్మానాలు సభా కార్యకలాపాల ఆరంభానికి ముందే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదానీ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చేదాకా సభా కార్యక్రమాలు అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఉభయ సభల్లో 9 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున మాణిక్యం ఠాగూర్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ప్రశ్నోత్తరాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, అదానీ అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ స్పీకర్ పదేపదే కోరినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుంటూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. జేపీసీ లేక సీజేఐ నేతృత్వంలో కమిటీ అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇందుకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉదయం ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని విపక్ష ఎంపీలు విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మార్కెట్ విలువ కోల్పోతున్న సంస్థల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారు. దీనిపై చర్చించడానికి మేమిచ్చిన తీర్మానాన్ని సస్పెండ్ చేశారు. అదానీ అంశంపై పార్లమెంట్లో లోతుగా చర్చించాలి. అదానీపై విచారణ వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణతోనే..: నామా, కేకే అదానీ వ్యవహారంపై జేపీసీ లేక సీజేఐ కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కె.కేశవరావు పేర్కొన్నారు. ఎల్ఐసీ సహా బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. జనం సొమ్మును లూటీ చేశారు ఎల్ఐసీ, ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ సంస్థలతో అదానీ గ్రూప్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. తాజా సంక్షోభం వల్ల ఆయా సంస్థలు భారీగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు పొదుపు చేసుకున్న సొమ్ము ప్రమాదంలో చిక్కుకుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అదానీ అంశంపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వారంతా భయాందోళనకు గురవుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ చెప్పారు. జనం సొమ్మును అదానీ లూటీ చేశారని సీపీఎం నేత ఎలమారమ్ ధ్వజమెత్తారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భారీ కుంభకోణం జరిగితే ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిలదీశారు. -
అదానీకి మరో షాక్.. ఒకదాని తర్వాత మరొకటి, 3 రోజుల్లోనే
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీకి మరో షాక్ తగిలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన సంపద రోజు రోజుకూ పతనం వైపు పరుగులు పెడుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన ర్యాంకింగ్ మరింత కిందకి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు. టాప్ 10లో స్థానం పాయే హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతమ్ అదానీ సంపద చూస్తుండగానే మంచులా కరిగిపోతుంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అదానీ సంపద 3 రోజుల్లోనే 34 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రాకముందు ఆయన మూడో స్థానంలో ఉండేవారు. భారత్ నుంచి టాప్ 10 చోటు దక్కించుకున్న సంపన్నుడిగా కొన్నాళ్లు కొనసాగారు. అదానీ గ్రూప్ మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. ఆయన వ్యాపారం, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, రుణ భారంపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదిక ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఈ ఆరోపణలు నిరాధారమని అదానీ 413 పేజీల వివరణ నివేదిక కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోయింది. ఈ దెబ్బకు ఆ సంస్థ కీలక డాలర్ బాండ్లు కూడా తాజా కనిష్ట స్థాయిని తాకాయి. చదవండి: రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ? -
వివాదాల నడుమ అదానీకి భారీ ఊరట: వేల కోట్ల లైఫ్‌లైన్
సాక్షి,ముంబై: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న వేళ అదానీకి భారీ ఊరట లభించింది. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడులను ప్రకటించింది. రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవోలో 16 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) ఇక్కిందిచుకుంది 2023లో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో దృష్టితోపాటు, స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడుల్లో ఈ ఏడాది ఇదే తమ తొలి పెట్టుబడి అని కంపెనీ పేర్కొంది. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్) అబుదాబి కంపెనీ ఐహెచ్‌సీకి చెందిన అనుబంధ సంస్థ గ్రీన్ ట్రాన్స్మిషన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలో 400 మిలియన్ డాలర్లు (రూ. 3,200 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. అదానీ గ్రూప్‌పై తమ ఆసక్తి, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫండమెంటల్స్‌పై నమ్మకంతో, బలమైన వృద్ధిని తన వాటాదారులను అదనపు విలువును ఆశిస్తున్నామని ఐహెచ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ బాసర్ షుబ్ అన్నారు. క్లీన్ ఎనర్జీ , ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 2023లో గ్లోబల్ అక్విజిషన్ను 70శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో రెండో రోజు కేవలం 3 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. ఈక్విటీ షేర్‌కు రూ. 3,112 ,రూ. 3,276 ప్రీమియం ప్రైస్ బ్యాండ్ వద్ద ఇష్యూ మంగళవారం ముగియనుంది. (రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?) కాగా అదానీ గ్రూప్‌లో ఐహెచ్‌సీకి రెండో పెట్టుబడి ఒప్పందం. గత సంవత్సరం అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా అదానీ గ్రూప్‌లోని మూడు గ్రీన్ ఫోకస్డ్ కంపెనీలలో 2 బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. పెట్టుబడి పెట్టింది. ఈ మూడు సంస్థలు బీఎస్సీ,ఎన్ఎస్సీలలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. (చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?) -
అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్-అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వివాదం మరింత రాజు కుంటోంది. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానికి హిండెన్‌బర్గ్ సోమవారం తిరిగి కౌంటర్ ఇచ్చింది. జాతీయవాదం పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని, చైర్మన్ గౌతం అదానీ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందంటూ దుయ్యబట్టింది. వారి సమాధానంతో ఏకీభవించడం లేదని, అసలు చాలా ప్రశ్నలకు సమాధానమే చెప్పలేదని హిండెన్‌బర్గ్ వాదించింది. Our Reply To Adani: Fraud Cannot Be Obfuscated By Nationalism Or A Bloated Response That Ignores Every Key Allegation We Raisedhttps://t.co/ohNAX90BDf — Hindenburg Research (@HindenburgRes) January 30, 2023 దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటోందని ఆరోపించింది. భారత దేశం శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశమని, అది సూపర్ పవర్‌గా ఎదుగుతోందని, కానీ అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు జాతీయవాదం లేదా తాము లేవనెత్తిన ప్రతి ప్రధాన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కప్పిపుచ్చి మోసాన్ని అడ్డుకోలేరంటూ స్పందించడం గమనార్హం. (రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?) -
రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదం సెగ రానున్న బడ్జెట్ సెషన్‌ను భారీగానే తాగనుంది. ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణలు, డిమాండ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే 2023 బడ్జెట్ సమావేశాల్లో ప్రకంపనలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని రేపింది. 413 పేజీలతో అదానీ గ్రూపు ఇచ్చిన వివరణమరింత ఆజ్యం పోసింది. అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా తప్పులతడకలని అదానీ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఇది ఏదో ఒక కంపెనీపై ఊరికే చేసిన దాడి కాదని.. లాభనష్టాలు అన్నింటినీ బేరీజు వేసుకుని భారత్‌పైనా .. భారతీయ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యతపైనా .. భారత వృద్ధి గాధ, ఆకాంక్షలపైనా చేసిన దాడి అని అభివర్ణించింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అదానీ ఎపుడు ఇండియాగా మారిపోయారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేత వైసతీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ ముఖ్యంగా కాంగ్రెస్, శివసేన నాయకులు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వివాదం పార్లమెంటులో రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రభావం చూపవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అదానీ ఎప్పుడు భారతదేశంగా మారిందని ప్రశ్నించారు. అలాగే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ షేర్లు (రెండు రోజుల్లో రూ.22,442 కోట్లు)కుప్పకూలడంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రోనీస్ కోసం 29 కోట్ల పాలసీదారులతో దేశ "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్"!ను మోడీ ప్రభుత్వం లూట్ ఇన్వెస్ట్మెంట్గా మార్చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్) శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా అదానీ గ్రూప్ అంటే ఇండియా, ఇండియా అంటూ అదానీ గ్రూప్ అంటూ సెటైర్లు వేశారు. అమెరికాలోని ఒక చిన్న సంస్థ బహిర్గతం చేసేదాకా ఆర్థిక మంత్రి ఇంతకాలం ఏమి చేస్తున్నారు? సెబీ ఎక్కడ ఉంది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్కడ ఉంది? 2022లో మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో దాదాపు 80 శాతం వాటాను ఒక గ్రూపు కలిగి ఉంది అంటూ కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ఝా విమర్శించారు. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. మరి ఈ వివాదంపై పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
అదానీ గ్రూప్ ఎఫ్‌పీవో సక్సెస్ అవుతుంది : జుగేశిందర్ సింగ్
న్యూఢిల్లీ: గత వారం ప్రారంభమైన ఫాలో ఆన్ ఆఫర్(ఎఫ్‌పీవో) విజయవంతమవుతుందని డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ సీఎఫ్‌వో జుగేశిందర్ సింగ్ తాజాగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్‌పీవో ధరలో లేదా షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేపట్టబోమని తెలియజేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో గత వారం చివర్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అయితే రూ. 20,000 కోట్ల సమీకరణకు అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన ఎఫ్‌పీవో శుక్రవారమే(27న) ప్రారంభమైంది. ఇష్యూ మంగళవారం(ఫిబ్రవరి 1న) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీవో ధర లేదా షెడ్యూల్‌ను సవరించే యోచనలేదంటూ సీఎఫ్‌వో స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల కౌంటర్లు అమ్మకాలతో డీలా పడ్డాయి. షేర్ల ధరల్లో పెరుగుదల, ఖాతాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కోనున్నట్లు ఇప్పటికే అదానీ గ్రూప్ తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే అదానీ గ్రూప్‌పై ఆరోపణలు గుప్పించినట్లు సింగ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ నివేదికలో ఎలాంటి పరిశోధనా సంబంధ అంశాలూ లేవని స్పష్టం చేశారు. పూర్తిగా ఆధారరహిత ఆరోపణలు చేసినట్లు వివరించారు. సక్సెస్ ఎందుకంటే అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ధరల శ్రేణి రూ. 3,112–3,276. మార్కెట్ల పతనంతో వారాంతాన షేరు రూ. 2,762 వద్ద ముగిసింది. అయినప్పటికీ ఎఫ్‌పీవో సక్సెస్ కాగలదంటూ ఎఫ్‌పీవో సింగ్ పేర్కొన్నారు. ఇందుకు కారణాలు ఇలా వివరించారు. బ్యాంకర్లు, ఇన్వెస్టర్లుసహా వాటాదారులంతా ఎఫ్‌పీవోపై విశ్వాసంతో ఉన్నారు. గత బుధవారం కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. ఓపెన్ మార్కెట్లో షేరు తక్కువ ధరకు చేరినప్పటికీ తగినన్ని షేర్లు(ఫ్రీఫ్లోట్) అందుబాటులో లేవు. రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రమే తగిన మోతాదులో లభించే వీలుంది. వ్యూహాత్మక పెట్టుబడిదారులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఎఫ్‌పీవో ద్వారా తగిన పరిమాణంలో షేర్లు అందుబాటులోకి వస్తాయి. లిక్విడిటీతోపాటు ఫ్రీఫ్లోట్‌ను పెంచేందుకే ఎఫ్‌పీవోకు తెరతీశారు. నిజానికి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు విలువరీత్యా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ పలు రంగాల సంస్థలకు చేయూత(ఇన్క్యుబేటర్)గా నిలుస్తోంది. ఎయిర్‌పోర్టులు, రహదారులు, నూతన ఇంధన ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, మైనింగ్ బిజినెస్ తదితరాలను నిర్వహిస్తోంది. వీటితోపాటు హైడ్రోజన్ తదితర ఆధునిక బిజినెస్‌లలో విస్తరిస్తోంది. ఇందుకు రానున్న దశాబ్ద కాలంలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. 2025–2028 మధ్య కాలంలో బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలకు సైతం తెరతీసింది. వెరసి షేరు ధరలో తాత్కాలిక ఆటుపోట్లవల్ల కంపెనీ దీర్ఘకాలిక విలువలో మార్పులు సంభవించబోవంటూ సింగ్ స్పష్టం చేశారు. -
ఇది భారత్‌పై జరిగిన దాడి: గౌతమ్ అదానీ
గాంధీనగర్: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన హేయమైన ఆరోపణల్ని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఖండించింది. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడి కాదని, దేశం (భారత్) పైన, దేశాభివృద్ధికి పాటుపడుతున్న సంస్థలపై దురుద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రణాళికతో కూడిన దాడిగా అభివర్ణించింది. సదరు సంస్థ చేసిన ఆరోపణల్లో అబద్ధం తప్ప మరేమీ కాదు అని అదానీ గ్రూప్ పేర్కొంది.ఈ మేరకు 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని విమర్శించింది. ఇది నాపై దాడి కాదు.. భారత్‌పై దాడి ఆర్థిక లాభాలను పొందేందుకు వీలుగా దురుద్దేశ్యంతో తప్పుడు మార్కెట్‌ను సృష్టించడం కోసమే హిండెన్‌బర్గ్ ఇలా చేస్తుందని అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది కేవలం గౌతమ్ అదానీ సంస్థలపైన చేసిన దాడి కాదని, దేశం, స్వాతంత్ర్యం, సమగ్రత, నాణ్యత, ఆర్ధిక వృద్ధిపై దాడి అని చెప్పింది. హిండెన్‌బర్గ్ పై అనుమానం ఈ సందర్భంగా అదానీ గ్రూప్.. హిండెన్‌బర్గ్ విశ్వసనీయత, నైతికతను ప్రశ్నించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల సమీకరణకు చేపట్టిన ఎఫ్‌పీవో శుక్రవారమే(27న) ప్రారంభమైంది. ఇష్యూ మంగళవారం(ఫిబ్రవరి 1న) ముగియనుంది. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఆరోపణలు నిరాధారం హిండెన్‌బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నలలో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు అన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయని తెలిపింది. మిగతా 23 ప్రశ్నల్లో 18 పబ్లిక్ షేర్హోల్డర్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగతా ఐదు ప్రశ్నలు నిరాధారమైనవని తెలిపింది. తమ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నట్టు అదానీ గ్రూప్ మరోసారి స్పష్టం చేసింది. చదవండి👉 అదానీకి హిండెన్‌బర్గ్ షాక్, మరో బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు -
అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన
సాక్షి, ముంబై: హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్‌తో ఇబ్బందుల్లో పడిన అదానీ గ్రూపునకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. దశాబ్దాలుగా అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల విషయంలో అవకతవకల తీవ్ర ఆరోపణలపై సెబీ రంగంలోకి దిగింది. అదానీ డీల్స్‌ను సెబీ నిశితంగా స్టడీ చేస్తోందట. ఈ అంశంపై భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారించనుంది. గత సంవత్సరంలో అదానీ గ్రూప్ డీల్స్‌ను పరిశీలిస్తోంది. అంతేకాదు కరీబియన్ దేశాలు మొదలు, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదానీ కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు అవినీతి పాల్పడ్డాయన్న ఆరోపణలతో అదానీ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులపై సొంత ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించ నుందట. దీనికి సంబంధించి అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని రాయిటర్స్ నివేదించింది. లిస్టెడ్ స్పేస్‌లో అదానీ గ్రూప్ చేస్తున్న అన్ని లావాదేవీలను సెబీ ఎక్కువగా పరిశీలిస్తోందంటూ విశ్వసనీయ సోర్సెస్‌ను ఉటంకిస్తూ రాయిట్సర్ తెలిపింది. మరోవైపు అదానీ గ్రూప్‌లో ఎక్కువ పెట్టుబడులుపెట్టిన ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తీవ్రంగా ప్రభావితయ్యే అవకాశం ఉందని, ప్రజాధనం, ఖాతాదారుల ఆస్తుల సంరక్షణ నిమిత్తం ఆర్బీఐ, సెబీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. అయితే ఆందోళన అవసరం లేదని ఎస్బీఐ ప్రకటించింది. -
దలాల్ స్ట్రీట్‌లో హిండెన్‌బర్గ్ ప్రకంపనలు:11 లక్షల కోట్ల ఢమాల్
సాక్షి,ముంబై: బడ్జెట్‌కు ముందు, దేశీయ స్టాక్ మార్కెట్లకు అదానీ షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. శుక్రవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అలాగే బ్యాంకింగ్, మెటల్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని కోల్పోయింది. చివర్లో కోలుకుని సెన్సెక్స్ 874.16 పాయింట్లు లేదా 1.45 శాతం క్షీణించి 59,330.90 వద్ద, నిఫ్టీ 287.60 పాయింట్లు లేదా 1.61 శాతం దిగువన 17,604 వద్ద ముగిసింది. ఫలితంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గత నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ ఆరోపణలతో గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. రెండురోజులుగా కొనసాగుతున్న అమ్మకాల వెల్లువలో అదానీ మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు తుడుచు పెట్టుకుపోయింది. అదానీ పోర్ట్స్, అదానీఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆటో, ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డా.రెడ్డీస్, ఐటీసీ లాభపడగా, దివీస్,అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాల్లో 8 పైసలు ఎగిసింది. -
అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-హిండెన్‌బర్గ్ వివాదం అదానీలో పెట్టుబడి పెట్టిన సంస్థలు, బ్యాంకులు, ఇతర పెట్టుబడిదారులను చుట్టుకుంది. గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ క్రాష్ కావడంతో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీగా ప్రభావితమైంది. ఎల్ఐసీ కేవలం 2 రోజుల్లోనే రూ.18,000 కోట్లు నష్టాన్ని మూటగట్టకుంది. అటు అదానీ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్‌మార్కెట్ శుక్రవారం భారీ పతనాన్ని నమోదు చేసింది. తాజా డేటా ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఎల్ఐసీ సంయుక్త పెట్టుబడి జనవరి 24, 2023న రూ.81,268 కోట్లగా ఉండగా, జనవరి 27, 2023న రూ.62,621 కోట్లకు పడిపోయింది. అంటే రూ.18,647 కోట్ల మేర ఎల్ఐసీ నష్టపోయింది. కాగా అదానీ గ్రూపు కంపెనీల ఆర్థిక వ్యవహారాల్లో దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్ బర్గ్ నివేదికను విడుదల చేసింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గడిచిన మూడేళ్లలో ఏకంగా 100బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఏడు లిస్టెడ్ కంపెనీలు, 85 శాతం నష్టాన్ని, గణనీయమైన రుణాలను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్టు అదానీ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను దెబ్బతీసే ప్రధాన లక్ష్యంతో తమప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ కుట్రపన్నారని పేర్కొంది. దీనిపై హిండెన్‌బర్గ్ కూడా స్పందించింది. తన నివేదికలోని అంశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. -
అదానీకి హిండెన్‌బర్గ్ షాక్, మరో బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ సృష్టించిన అలజడితో అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. తాజా డేటా ప్రకారం ఆసియా, భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్- గౌతం అదానీ సంపద శుక్రవారం మరింత పతన మైంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అతని ర్యాంకింగ్ శుక్రవారం ఏడో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని మొదటి ఐదుగురు సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు. 100 బిలియన్ డాలర్ల దిగువకు ఫోర్బ్స్ రియల్ టైమ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపద రోజులో 22.5 బిలియన్ల డాలర్లకు పైగా క్షీణించి 96.8 బిలియన్ల డాలర్లకు చేరింది. ఫలితంగా అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే దిగువ స్థానంలో ఉన్నారు. అదానీ షేర్ల భారీ ర్యాలీతో మొదట 2వ స్థానానికి చేరుకున్నారు గౌతం అదానీ. ఆ తరువాత చాలా కాలం పాటు 3వ స్థానంలో కొనసాగి, ఇటీవల నాలుగోప్లేస్కు దిగజారిన సంగతి తెలిసిందే. బిల్ అక్మాన్ వ్యాఖ్యలు అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హింబెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై బిలియనీర్, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్ అక్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక "అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడింది" అంటూ బిల్ అక్మాన్ ట్వీట్ చేశారు. హిండెన్‌బర్గ్ ఫారెన్సిక్ రీసెర్చ్ పూర్తి రిపోర్ట్ ఆధారంగానే, తప్ప తామెలాంటి ఇండిపెండెంట్ పరిశోధన చేయలేదంటూ అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అదానీ కంపెనీల్లో, లేదా హెర్బా లైఫ్‌లో తమకు ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఎఫ్‌పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) కు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రావడం గమనార్హం. నేటినుంచి( జనవరి 27) 31 వరకు నిర్వహించే ఎఫ్‌పీవోలో రూ.20 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. రూ. 3.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న అదానీ ఎంటర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైస్‌ను ధరను రూ.3,112 నుంచి రూ.3,276గా నిర్ణయించింది. -
అదానీ షేర్ల పతనం, లక్షల కోట్లు ఢమాల్, ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన
సాక్షి, ముంబై: అదానీ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల నివేదికను విడుదల చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో కంపెనీలు 8 శాతం వరకు నష్టపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం కూడా అదానీ షేర్లలో మరింత అమ్మకాలు వెల్లు వెత్తాయి. మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్‌లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. కలకలం రేపుతున్న ఈ వివాదం నేపథ్యంలోని ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరో ముఖ్యమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ 12 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా అంబుజా సిమెంట్, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి. Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL — Hindenburg Research (@HindenburgRes) January 26, 2023 హిండెన్‌బర్గ్ ప్రతి సవాల్ మరోవైపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై దావా వేయనున్నట్టు అదానీ ప్రకటించింది. అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల క్రింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్లో తెలిపింది. అటు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఆర్బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, మనీలాండరింగ్ చేసిందంటూ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై జనవరి 24, మంగళవారం అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అదంతా కుట్ర.. వాటిని చట్టపరంగా ఎదుర్కొంటాం: అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: ఖాతాల్లో, షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ తమ గ్రూప్ సంస్థలపై అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్ కుట్ర చేసిందని ఆరోపించింది. తాము తలపెట్టిన షేర్ల విక్రయాన్ని దెబ్బతీసేందుకే ‘నిర్లక్ష్యపూరితంగా’ వ్యవహరించినందుకు గాను హిండెన్‌బర్గ్‌ను చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు వ్యాఖ్యానించింది. ‘ఎటువంటి పరిశోధన లేకుండా హిండెన్‌బర్గ్ రూపొందించిన దురుద్దేశపూరితమైన నివేదిక .. అదానీ గ్రూప్, మా షేర్హోల్డర్లు, ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. నివేదిక వల్ల భారతీయ స్టాక్ మార్కెట్లలో తలెత్తిన ఒడిదుడుకులు ఆందోళన కలిగించాయి‘ అని గ్రూప్ లీడ్ హెడ్ జతిన్ జలుంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఫాలో ఆన్ ఇష్యూ (ఎఫ్‌పీవో)ను నాశనం చేసేందుకు ఒక విదేశీ సంస్థ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన తీరు తీవ్రంగా కలవరపర్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా చట్టాల ప్రకారం హిండెన్‌బర్గ్‌పై తగు చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోకు వస్తున్న తరుణంలో నివేదిక విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: ఆధార్ కార్డ్‌లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి!